కాజల్, సినిమాటోగ్రఫీ. ప్రొడక్షన్ వాల్యూస్కాజల్, సినిమాటోగ్రఫీ. ప్రొడక్షన్ వాల్యూస్స్క్రీన్ ప్లే, బెల్లంకొండ శ్రీనివాస్, మ్యూజిక్
మనీ మైండెడ్ బిజినెస్ ఉమెన్ అయిన సీత (కాజల్ అగర్వాల్) ఓ పని కోసం ఎమ్మెల్యే బసవ (సోనూ సూద్) తో డీల్ కుదుర్చుకుంటుంది. అయితే దాని కోసం రఘురాం (బెల్లంకొండ శ్రీనివాస్) హెల్ప్ అవసరం పడుతుంది. బసవ కూడా కాజల్ కు ఇబ్బందిగా మారుతాడు.. అందుకే రఘురాం హెల్ప్ తీసుకుంటుంది సీత. సీతతో రఘురాం కు ఉన్న రిలేషన్ ఏంటి..? బసవ నుండి సీతను రఘురాం ఎలా కాపాడాడు..? రఘురాం, సీత ఎలా కలిశారు అన్నది సినిమా కథ.  



సినిమాలో హీరో పాత్ర కన్నా టైటిల్ రోల్ పోశించిన సీత పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. సీత పాత్రలో కాజల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మనీ మైండెడ్ గా డేరింగ్ గాళ్ గా కాజల్ ఇదవరకు చూడని విధంగా పర్ఫార్మ్ చేసింది. ఇక రఘురాం పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోసోగా అనిపించాడు. అల్లుడు శీను సినిమా నుండి కవచం వరకు అతను ఇలాంటి పాత్ర చేయలేదు. హీరోకి ఇది కొత్త రోల్ అని చెప్పొచ్చు. మన్నారా చోప్రా ఉన్నంతలో బాగానే చేసింది. బిత్తిరి సత్తి కామెడీ అలరించింది. సోనూ సూద్ విలనిజం ఓకే అనిపిస్తుంది.  



శిర్షా రే సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడా సినిమాకు తగినట్టుగానే ఉంది. అయితే నోటెడ్ సాంగ్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా బిజిఎం పర్వాలేదు అనిపిస్తుంది. కథ కొత్తగా చెప్పడానికి ట్రై చేసిన తేజ స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగించారు. అనీల్ సుంకర నిర్మాణ విలువలు బాగున్నాయి. 



జీవితంలో డబ్బే ప్రధానం అనుకునే ఓ అమ్మాయి.. అనుకోకుండా కష్టాల్లో పడితే ఆ సీతకు రాముడు ఎలా తోడున్నాడు అన్నది సీత కథ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషన్, కామెడీ మిక్స్ చేసి సరదాగా నడిపించిన తేజ సెకండ్ హాఫ్ మాత్రం ట్రాక్ తప్పేశాడని చెప్పొచ్చు. సినిమా స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగింది.


ఏమాత్రం ఆకట్టుకునే కథనం రచించలేదు తేజ. పాత్రలను బాగా రాసుకున్నా పాత్ర స్వభావాలు మాత్రం మళ్లీ రొటీన్ పంథాలోనే చిత్రీకరించాడు. ఈకాలం అమ్మాయిల ప్రవర్తనను సీత లో కాజల్ పాత్ర ద్వారా చెప్పాలనుకున్న తేజ కొద్దిమేరకు సక్సెస్ అయినా ఓవరాల్ గా సినిమా ఆడియెన్స్ ను నిరాశపరచిందని చెప్పొచ్చు.   


కమర్షియల్ సినిమాలనే కొత్తగా చెప్పడానికి ట్రై చేసే తేజ సీత విషయంలో రొటీన్ స్క్రీన్ ప్లేతో వచ్చాడు. సగటు సిని ప్రేక్షకుడు ఎంగేజ్ అయ్యే అవకాశం ఉన్నా వెరైటీ సినిమాలు కోరుకునే ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా నచ్చదు. యూత్ ఆడియెన్స్ ను మెప్పించే అంశాలు కూడా పెద్దగా ఏమి లేవని చెప్పొచు. ఫైనల్ గా తేజ సీత ఆశించిన స్థాయిలో లేదు.



Kajal, Bellamkonda Srinu, Director Teja, Anup Rubens, Paruchuri Gopala Krishna'సీత'తో మళ్లీ నిరాశపరచిన బెల్లంకొండ..!

మరింత సమాచారం తెలుసుకోండి: