Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:01 am IST

Menu &Sections

Search

చిత్రం: అలాద్దీన్‌

- 0/5
చిత్రం: అలాద్దీన్‌

చిత్ర కథ


నటీనటుల ప్రతిభ


సాంకేతికవర్గం పనితీరు


చిత్ర విశ్లేషణ


కాస్ట్ అండ్ క్రూ

చిత్రం: అలాద్దీన్‌ ద‌ర్శ‌క‌త్వం: గ‌య్ రిచీ నిర్మాత‌: డేన్ లిన్‌, జొనాథ‌న్ ఎరిడ్‌ స్క్రీన్‌ప్లే: జాన్ అగ‌స్ట్, గ‌య్ రిచీ న‌టీన‌టులు: విల్ స్మిత్‌, మెనా మ‌సౌద్‌, న‌యోమీ స్కాట్‌, మార్వ‌న్ కెన్జారీ, న‌వీద్ నెగ‌బ‌న్‌, న‌సిమ్ త‌దిత‌రులు సంగీతం: అలాన్ మెన్‌క‌న్‌ కెమెరా: అలాన్ స్టెవార్ట్ ఎడిటింగ్‌: జేమ్స్ హెర్బెట్‌ నిర్మాణం: వాల్ట్ డిస్నీ పిక్చ‌ర్స్, రైడ్ బ్యాక్, మార్క్ ప్లాట్ ప్రొడ‌క్ష‌న్స్ విడుద‌ల‌: 24 మే 2019 (తెలుగు వెర్ష‌న్‌) అలాద్దీన్ గురించి, అత‌ని అద్భుత దీపం గురించి చిన్న‌ప్ప‌టి నుంచీ అంద‌రూ ర‌క‌ర‌కాల క‌థ‌లు వినే ఉంటాం. తాజాగా అలాద్దీన్ అద్భుత‌దీపం గురించి `అలాద్దీన్‌` పేరుతో ఓ సినిమా వ‌చ్చింది. ఇంత‌కు మునుపు కూడా ఈ క‌థాంశంతో సినిమాలు రూపొందాయి. తాజాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో అద్భుత‌దీపంలో ఉంటే జీనీ పాత్ర‌కు విక్ట‌రీ వెంక‌టేష్‌, అలాద్దీన్ పాత్ర‌కు వ‌రుణ్ తేజ్ డ‌బ్బింగ్ చెప్పారు. ఈ ఏడాది మొద‌ట్లో వీరిద్ద‌రూ క‌లిసి `ఎఫ్ 2`తో న‌వ్వులు పండించారు. ఈ తాజా చిత్రానికి వీరి వాయిస్ ఎంత ప్ల‌స్ అయింది అనేది ఆస‌క్తిక‌రం. క‌థ‌ అలాద్దీన్ చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోతాడు. అనాథ‌గా పెరుగుతాడు. ఆక‌లిద‌ప్పులు తీర్చుకోవ‌డానికి దొంగ‌తనం చేస్తుంటాడు. ఆ క్ర‌మంలో అత‌నికి అబ్బు (కోతి)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఎంతటి సాహ‌సానికైనా వెన‌కాడ‌ని వ్య‌క్తి అలాద్దీన్‌. ఆ రాజ్యంలో యువ‌రాణి జాస్మిన్‌. ఆమెను సుల్తానా అయి రాజ్యాన్ని పాలించాల‌ని ఉంటుంది. కానీ ఆమె తండ్రి ఆమె కోసం సంబంధాలు చూస్తుంటాడు. అదే స‌మ‌యంలో ఆ రాజ్యానికి చెందిన వ‌జీర్ తానే రాజు కావాల‌ని క‌ల‌లు కంటాడు. మ‌రోవైపు అక్క‌డికి ద‌గ్గ‌ర్లోని గుహ‌లో ఉన్న అలాద్దీన్ దీపం తీసుకొచ్చే ధీరుడి కోసం వెతుకుతుంటాడు. మ‌చ్చ‌లేని ఆ వీరుడుని అలాద్దీన్‌లో పోల్చుకుంటాడు. అలాద్దీన్ కు వ‌జీర్ చెప్పిన ఓ విష‌యం ప‌ట్ల గురి కుద‌ర‌డంతో గుహ‌లోకి వెళ్తాడు. అక్క‌డి నుంచి అలాద్దీన్ దీపాన్ని తెచ్చిన అత‌ని జీవితంలో చోటుచేసుకున్న మార్పులు ఏంటి? అనేది ఆస‌క్తిక‌రం.దీపాన్ని తాక‌గానే బ‌య‌టికి వ‌చ్చిన జీనీని అల్లాద్దీన్ ఏమ‌ని అడిగాడు? అత‌ను కోరిక మూడు కోరిక‌లు ఏంటి? వాటిలో స్వార్థానికి ఉప‌యోగించుకున్న‌వి ఎన్ని? జీనీ త‌న నియమాల‌ను దాటి అల్లాద్దీన్‌కి చేసిన సాయం ఏంటి? అల్లాద్దీన్ త‌న స్వార్థాన్ని వ‌దులుకుని జీనీకి చేసిన సాయం ఏంటి? వ‌జీర్ చివ‌రకు ఏమ‌య్యాడు? రాకుమారికి అల్లాద్దీన్ నిజం చెప్పాడా లేదా? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. ప్ల‌స్ పాయింట్లు - నటీన‌టుల న‌ట‌న‌ - గ్రాఫిక్స్ - వెంక‌టేశ్ చెప్పిన డ‌బ్బింగ్‌ - జీనీ కేర‌క్ట‌ర్‌కు రాసిన డైలాగులు మైన‌స్ పాయింట్లు - కొన్ని సంద‌ర్భాల్లో మ‌రీ పేల‌వంగా సాగిన స్క్రీన్‌ప్లే - వ్య‌ర్థ‌మైన పాట‌లు - స‌మీక్ష‌ అల్లాద్దీన్ కాన్సెప్ట్ చిన్న పిల్ల‌ల‌కు న‌చ్చిన కాన్సెప్ట్. అప్ప‌టి రాజ్యాలు, సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌లు, ఎగిరే మాయా తివాచీ, మాట్లాడే ప‌క్షులు, సాయం చేసే కోతులు, మ‌చ్చిక చేసుకున్న పులులు... ఇవ‌న్నీ చూసేకొద్దీ చూడాల‌నిపించే విష‌యాలు. చిన్న‌పిల్ల‌ల‌ను అమితంగా ఆక‌ట్టుకునే అంశాలు. తాజాగా అల్లాద్దీన్‌లో అవ‌న్నీ మ‌రోసారి మెప్పించాయి. వాటితో పాటు తెలుగువారిని ఆక‌ట్టుకున్న మ‌రో విష‌యం వెంక‌టేశ్ స్వ‌రం. జీనీ పాత్ర‌కు ఆయ‌న త‌న‌దైన శైలిలో స‌ర‌దాగా డ‌బ్బింగ్ చెప్పారు. దానికి తోడు ఆయ‌న పాత్ర‌కు రాసిన డైలాగులు కూడా బావున్నాయి. వ‌రుణ్‌తేజ్ డ‌బ్బింగ్ చెప్పార‌న్న సంగ‌తిని మ‌నం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తేగానీ అర్థంకాదు. న‌టీన‌టులంద‌రూ బాగా చేశారు. గ్రాఫిక్స్ బావున్నాయి. కాక‌పోతే అర్థంప‌ర్థంలేని పాట‌లు ప‌దే ప‌దే వ‌స్తూ విసుగు తెప్పించాయి. వేస‌విలో స‌కుటుంబంగా స‌ర‌దాగా చూసే చిత్రం `అలాద్దీన్‌`. బాట‌మ్ లైన్‌: పిల్ల‌ల కోసం `అలాద్దీన్‌` రేటింగ్‌: 4
5 / 5 - 1
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Tollywood

View all
ఏక్ సినిమా రివ్యూ

ఏక్ సినిమా రివ్యూ

విడుద‌ల తేదీః 14.06.2019 నటీనటులు : బిష్ణు అధికారి , అపర్ణ శర్మ , హిమాన్షి ఖురానా సంగీతం : మంత్ర ఆనంద్ నిర్మాత : హరి దర్శకత్వం : సంపత్ రుద్రారపు రేటింగ్ : 3/5 స‌మాజంలో జ‌రిగే ఎన్నోఅన్యాయాల‌ను అరిక‌ట్టాల‌నే నేప‌ధ్యంలో సాగే క‌థ ఇది. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌, కుల‌మ‌తాల గొడ‌వ‌లు ఇలా ఎన్నో అన్యాయాల‌ను చూసి త‌ట్టుకోలేని ఓ అమ్మాయి ల‌వ‌ర్ హీరో (బిష్ణు) పాత్ర ఉంటుంది. టెర్రరిజం నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కించిన చిత్రం '' ఏక్ ''. బిష్ణు హీరోగా అపర్ణ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్ర పోషించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా ! స్టోరీ : బ్రిలియంట్ స్టూడెంట్ అయిన సిద్దూ అపర్ణ శర్మ ని ప్రేమిస్తాడు . అపర్ణ శర్మ కూడా సిద్దూ ని అమితంగా ఇష్టపడుతుంది . అయితే ఉగ్రవాదుల దాడిలో అపర్ణ శర్మ చనిపోతుంది . త‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అప‌ర్ణ చ‌నిపోవ‌డంతో సంఘ వ్యతిరేకులైన ఉగ్రవాదులను అంతం చేయాలనుకుంటాడు సిద్దూ. ఉగ్రవాదులను అంతం చేయడానికి సిద్దూ ఎంచుకున్న మార్గం ఏంటి ? అందులో సక్సెస్ అయ్యాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . అందులో ఒక‌రిని త‌నే త‌న చేతుల‌తో ఘోరంగా చంపితే మ‌రొక‌రిని తెలివిగా ప్లాన్ చేసి విల‌న్‌ను చంపిస్తాడు. చివ‌ర‌గా త‌ను ప్రియురాలు బాంబ్‌బ్లాస్ట్‌లో చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన మ‌సూద్ (పృధ్వి) క్యారెక్ట‌ర్‌ను త‌న‌తో పాటే బాంబ్ పెట్టి చంపేస్తాడు. త‌న ప్రియురాలు లేని జీవితం త‌న‌కు ఎందుకు త‌న లైఫ్ త‌న‌తోనే అంతం అన్న పాత్ర‌ను ద‌ర్శ‌కుడు చాలా బాగా తెర‌కెక్కించారు. హైలెట్స్ : కథాంశం హీరో నటన పెర్ఫార్మెన్స్ : ఉగ్రవాదులను , అరాచక వాదులను అంతం చేయాలనే సిద్దు పాత్రలో అద్భుతంగా రాణించాడు బిష్ణు అధికారి . నటనలోనే కాదు మంచి ఫిజిక్ తో కూడా ఆకట్టుకున్నాడు బిష్ణు . అపర్ణ శర్మ గ్లామర్ తో అలరించింది , అలాగే హిమాన్షి ఖురానా గ్లామర్ కే పరిమితం అయ్యింది . కీలక పాత్రలో సుమన్ నటించాడు . ఇక సుమన్ గురించి కొత్తగా చెప్పేదేముంది . అలాగే బెనర్జీ , శ్రవణ్ , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు తమ తమ పాత్రల్లో రాణించారు . టెక్నికల్ టీమ్ : మంత్ర ఆనంద్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది , అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి . ఖర్చుకు వెనుకాడకుండా మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి తన నిర్మాణ దక్షతని నిరూపించుకున్నారు హరి . ఇక దర్శకుడు సంపత్ విషయానికి వస్తే బర్నింగ్ పాయింట్ ని కథా వస్తువుగా ఎంచుకొని మంచి ప్రయత్నమే చేసాడు . నటీనటుల నుండి చక్కని నటన ని రాబట్టుకున్న దర్శకుడు యువతని ఆలోచింప జేసే విధంగా ఏక్ చిత్రాన్ని మలిచాడు . ఫైనల్ గా : ఏక్ యాక్ష‌న్ డ్రామా ఎంట‌ర్‌టైన‌ర్‌

Kollywood

View all
పందెం కోడి 2 : రివ్యూ

పందెం కోడి 2 : రివ్యూ

నోటా : రివ్యూ

నోటా : రివ్యూ

Bollywood

View all