Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:15 pm IST

Menu &Sections

Search

'ఎన్ జీకే ' మూవీ రివ్యూ, రేటింగ్

- 1.75/5
'ఎన్ జీకే ' మూవీ రివ్యూ, రేటింగ్

మంచి

  • సూర్య నటన
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ

చెడు

  • స్టోరీ
  • స్క్రీన్ ప్లే
  • మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
ఒక్క మాటలో: సూర్య ఎన్.జి.కే.. మెప్పించలేని ప్రయత్నం..!

చిత్ర కథ

ఎం.టెక్ పూర్తి చేసిన నంద గోపాల కృష్ణ (సూర్య) ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో జాబ్ వదిలేసి వచ్చేస్తాడు. సొంత ఊరులో వ్యవహసాం చేస్తుంటాడు.. సోషల్ యాక్టివిస్ట్ గా ఉండే నంద గోపాల కృష్ణ ఆ ఊరిలో ప్రజల సమస్యలపై పోరాడుతుంటాడు. అయితే తను ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచన వస్తుంది. అందుకే ఎమ్మెల్యే దగ్గర కార్యకర్తగా జాయిన్ అవుతాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సొంత పార్టీ పెట్టి అధికరం చేజిక్కించుకుంటాడు. రాజకీయాల్లో గోపాల్ తీసుకురావాలనుకున్న మార్పు ఏంటి..? గోపాల్ రాజకీయ కెరియర్ లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..? ఫైనల్ గా ఎన్.జి.కే ప్రజలకు ఏం చేశాడు అన్నది సినిమా కథ.  నటీనటుల ప్రతిభ

సూర్య తన నటనతో మెప్పించాడు.. కాని దర్శకుడి లాజిక్ లేని కథ కథనాల వల్ల ఆయన ఎంత బాగా నటించినా అదంతా వేస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఎమ్మెల్యేకి దగ్గరయ్యే సీన్స్, క్లైమాక్స్ లో కూడా సూర్య తన నటనతో మెప్పించాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో ఆకట్టుకోగా.. సాయి పల్లవి రోల్ చిన్నదే అయినా పెద్దగా మెప్పించలేదు. జగపతి బాబు రోల్ కూడా ఎప్పటిలానే రొటీన్ విలనిజం చేశాడు.సాంకేతికవర్గం పనితీరు

శివ కుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కథ, కథనాలు చాలా రొటీన్ గా అనిపిస్తాయి. దర్శకుడు సెల్వ రాఘవన్ ఎంచుకున్న కథ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి. చిత్ర విశ్లేషణ

7/జి బృందావనకాలని, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలతో తెలుగులో కూడా క్రేజీ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సెల్వ రాఘవన్ సూర్యతో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా చేసిన సినిమా ఎన్.జి.కే. ఈ సినిమా మెయిన్ పాయింట్ సాధరణ కార్యకర్తగా ఉన్న ఓ వ్యక్తి సిఎంగా మారేందుకు ఎంత కృషి చేశాడు అనేది చెప్పదలచాడు దర్శకుడు. అయితే కథ రొటీన్ గా ఉన్నా స్క్రీన్ ప్లే కూడా అంతే రొటీన్ గా రాసుకున్నాడు.


ముఖ్యంగా సూర్య, సాయి పల్లవిల సీన్స్ సినిమాను ట్రాక్ తప్పించేశాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా నడిపించినా సెకండ్ హాఫ్ పూర్తిగా డిజప్పాయింట్ చేస్తుంది. ప్రజలకు, దేశానికి మంచి చేయాలన్న ఆలోచనలో ఉన్న హీరో పాత్రకి ఇంట్లో డిస్టబెన్స్ అన్నది రియాలిటీకి దగ్గరగా ఉంటుందని చూపించారేమో కాని అది సినిమాను దెబ్బ తీసింది.


ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా హీరో మాటలకు వాళ్ల నాయకుడి మీద దాడి చేయడం లాంటివి కూడా లాజిక్ గా అనిపించవు. ఫైనల్ గా ఈ సినిమా తమిళ ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉందేమో కాని తెలుగు ఆడియెన్స్ కు మాత్రం రుచించదు.కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 5476
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Tollywood

View all
ఏక్ సినిమా రివ్యూ

ఏక్ సినిమా రివ్యూ

విడుద‌ల తేదీః 14.06.2019 నటీనటులు : బిష్ణు అధికారి , అపర్ణ శర్మ , హిమాన్షి ఖురానా సంగీతం : మంత్ర ఆనంద్ నిర్మాత : హరి దర్శకత్వం : సంపత్ రుద్రారపు రేటింగ్ : 3/5 స‌మాజంలో జ‌రిగే ఎన్నోఅన్యాయాల‌ను అరిక‌ట్టాల‌నే నేప‌ధ్యంలో సాగే క‌థ ఇది. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌, కుల‌మ‌తాల గొడ‌వ‌లు ఇలా ఎన్నో అన్యాయాల‌ను చూసి త‌ట్టుకోలేని ఓ అమ్మాయి ల‌వ‌ర్ హీరో (బిష్ణు) పాత్ర ఉంటుంది. టెర్రరిజం నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కించిన చిత్రం '' ఏక్ ''. బిష్ణు హీరోగా అపర్ణ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్ర పోషించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా ! స్టోరీ : బ్రిలియంట్ స్టూడెంట్ అయిన సిద్దూ అపర్ణ శర్మ ని ప్రేమిస్తాడు . అపర్ణ శర్మ కూడా సిద్దూ ని అమితంగా ఇష్టపడుతుంది . అయితే ఉగ్రవాదుల దాడిలో అపర్ణ శర్మ చనిపోతుంది . త‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అప‌ర్ణ చ‌నిపోవ‌డంతో సంఘ వ్యతిరేకులైన ఉగ్రవాదులను అంతం చేయాలనుకుంటాడు సిద్దూ. ఉగ్రవాదులను అంతం చేయడానికి సిద్దూ ఎంచుకున్న మార్గం ఏంటి ? అందులో సక్సెస్ అయ్యాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . అందులో ఒక‌రిని త‌నే త‌న చేతుల‌తో ఘోరంగా చంపితే మ‌రొక‌రిని తెలివిగా ప్లాన్ చేసి విల‌న్‌ను చంపిస్తాడు. చివ‌ర‌గా త‌ను ప్రియురాలు బాంబ్‌బ్లాస్ట్‌లో చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన మ‌సూద్ (పృధ్వి) క్యారెక్ట‌ర్‌ను త‌న‌తో పాటే బాంబ్ పెట్టి చంపేస్తాడు. త‌న ప్రియురాలు లేని జీవితం త‌న‌కు ఎందుకు త‌న లైఫ్ త‌న‌తోనే అంతం అన్న పాత్ర‌ను ద‌ర్శ‌కుడు చాలా బాగా తెర‌కెక్కించారు. హైలెట్స్ : కథాంశం హీరో నటన పెర్ఫార్మెన్స్ : ఉగ్రవాదులను , అరాచక వాదులను అంతం చేయాలనే సిద్దు పాత్రలో అద్భుతంగా రాణించాడు బిష్ణు అధికారి . నటనలోనే కాదు మంచి ఫిజిక్ తో కూడా ఆకట్టుకున్నాడు బిష్ణు . అపర్ణ శర్మ గ్లామర్ తో అలరించింది , అలాగే హిమాన్షి ఖురానా గ్లామర్ కే పరిమితం అయ్యింది . కీలక పాత్రలో సుమన్ నటించాడు . ఇక సుమన్ గురించి కొత్తగా చెప్పేదేముంది . అలాగే బెనర్జీ , శ్రవణ్ , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు తమ తమ పాత్రల్లో రాణించారు . టెక్నికల్ టీమ్ : మంత్ర ఆనంద్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది , అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి . ఖర్చుకు వెనుకాడకుండా మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి తన నిర్మాణ దక్షతని నిరూపించుకున్నారు హరి . ఇక దర్శకుడు సంపత్ విషయానికి వస్తే బర్నింగ్ పాయింట్ ని కథా వస్తువుగా ఎంచుకొని మంచి ప్రయత్నమే చేసాడు . నటీనటుల నుండి చక్కని నటన ని రాబట్టుకున్న దర్శకుడు యువతని ఆలోచింప జేసే విధంగా ఏక్ చిత్రాన్ని మలిచాడు . ఫైనల్ గా : ఏక్ యాక్ష‌న్ డ్రామా ఎంట‌ర్‌టైన‌ర్‌

Bollywood

View all