సూర్య నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీసూర్య నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీస్టోరీ, స్క్రీన్ ప్లే, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
ఎం.టెక్ పూర్తి చేసిన నంద గోపాల కృష్ణ (సూర్య) ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో జాబ్ వదిలేసి వచ్చేస్తాడు. సొంత ఊరులో వ్యవహసాం చేస్తుంటాడు.. సోషల్ యాక్టివిస్ట్ గా ఉండే నంద గోపాల కృష్ణ ఆ ఊరిలో ప్రజల సమస్యలపై పోరాడుతుంటాడు. అయితే తను ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచన వస్తుంది. అందుకే ఎమ్మెల్యే దగ్గర కార్యకర్తగా జాయిన్ అవుతాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సొంత పార్టీ పెట్టి అధికరం చేజిక్కించుకుంటాడు. రాజకీయాల్లో గోపాల్ తీసుకురావాలనుకున్న మార్పు ఏంటి..? గోపాల్ రాజకీయ కెరియర్ లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..? ఫైనల్ గా ఎన్.జి.కే ప్రజలకు ఏం చేశాడు అన్నది సినిమా కథ.  



సూర్య తన నటనతో మెప్పించాడు.. కాని దర్శకుడి లాజిక్ లేని కథ కథనాల వల్ల ఆయన ఎంత బాగా నటించినా అదంతా వేస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఎమ్మెల్యేకి దగ్గరయ్యే సీన్స్, క్లైమాక్స్ లో కూడా సూర్య తన నటనతో మెప్పించాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో ఆకట్టుకోగా.. సాయి పల్లవి రోల్ చిన్నదే అయినా పెద్దగా మెప్పించలేదు. జగపతి బాబు రోల్ కూడా ఎప్పటిలానే రొటీన్ విలనిజం చేశాడు.



శివ కుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కథ, కథనాలు చాలా రొటీన్ గా అనిపిస్తాయి. దర్శకుడు సెల్వ రాఘవన్ ఎంచుకున్న కథ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి. 



7/జి బృందావనకాలని, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలతో తెలుగులో కూడా క్రేజీ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సెల్వ రాఘవన్ సూర్యతో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా చేసిన సినిమా ఎన్.జి.కే. ఈ సినిమా మెయిన్ పాయింట్ సాధరణ కార్యకర్తగా ఉన్న ఓ వ్యక్తి సిఎంగా మారేందుకు ఎంత కృషి చేశాడు అనేది చెప్పదలచాడు దర్శకుడు. అయితే కథ రొటీన్ గా ఉన్నా స్క్రీన్ ప్లే కూడా అంతే రొటీన్ గా రాసుకున్నాడు.


ముఖ్యంగా సూర్య, సాయి పల్లవిల సీన్స్ సినిమాను ట్రాక్ తప్పించేశాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా నడిపించినా సెకండ్ హాఫ్ పూర్తిగా డిజప్పాయింట్ చేస్తుంది. ప్రజలకు, దేశానికి మంచి చేయాలన్న ఆలోచనలో ఉన్న హీరో పాత్రకి ఇంట్లో డిస్టబెన్స్ అన్నది రియాలిటీకి దగ్గరగా ఉంటుందని చూపించారేమో కాని అది సినిమాను దెబ్బ తీసింది.


ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా హీరో మాటలకు వాళ్ల నాయకుడి మీద దాడి చేయడం లాంటివి కూడా లాజిక్ గా అనిపించవు. ఫైనల్ గా ఈ సినిమా తమిళ ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉందేమో కాని తెలుగు ఆడియెన్స్ కు మాత్రం రుచించదు.



సూర్య, రకూల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, యువన్ శంకర్ రాజా, సెల్వ రాఘవన్సూర్య ఎన్.జి.కే.. మెప్పించలేని ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: