విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్మ్యూజిక్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సింగ్
ఫలక్ నుమాలో ఉండే దాస్ (విశ్వక్ సేన్) ఆ ఏరియాలో శంకరన్నని అభిమానిస్తాడు.. ఆయన స్పూర్తితోనే అతనిలా ఓ గ్యాంగ్ లీడర్ గా మారాలని అనుకుంటాడు. చిన్నప్పుడే ఓ గ్యాంగ్ వేసుకుని గొడవలు చేస్తుంటాడు.. ఇలా జరుగుతున్న క్రమంలో శంకరన్నని కొందరు చంపేస్తారు.. దాస్ ఆయన్ను  చంపిన వాళ్లను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాడు. అయితే అనుకోకుండా దాస్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేస్ నుండి బయపడేందుకు దాస్ ఏం చేశాడు..? దాస్ లైఫ్ ఎలా సెటిల్ అయ్యింది..? అన్నది సినిమా కథ.     



ఈనగరానికి ఏమైంది సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ ఈసారి హీరో కం డైరక్టర్ గా రెండు బాధ్యతలు నిర్వహించాడు. సినిమాలో అతని రోల్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉంది. నటన పరంగా మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశాడు. ఇక హీరోయిన్స్ హరిషిత గౌర్, సలోనిలు బాగానే ఆకట్టుకున్నారు. సినిమాలో డైరక్టర్ తరుణ్ భాస్కర్ పోలీస్ రోల్ ఇంప్రెస్ చేసింది. విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ సీన్స్ బాగున్నాయి. ఉత్తేజ్ కూడా తన పాత్రలో బాగానే చేశాడు.



విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ బాగుంది.. పాతబస్తీని చాలా అందంగా చూపించారు. కెమెరా వర్క్ ఫిదా అయ్యేలా ఉంది. వివేక్ సాగర్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. సినిమా దర్శకుడు విశ్వక్ సేన్ రీమేక్ కథే అయినా నేటివిటీకి తగినట్టుగా బాగా తీశారు. అయితే స్లో నరేషన్ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో బాగానే ఉన్నాయి.



రీమేక్ సినిమా అయినా కూడా దర్శకుడు ఫలక్ నుమా దాస్ సినిమాను చాలా క్లవర్ గా తీశాడు. అయితే సినిమా కథ పరంగా ఓకే కాని స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ స్పీడ్ గా అనిపించినా సెకండ్ హాఫ్ స్లో అనిపిస్తుంది. ఎంచుకున్న కథను తెరకెక్కించడంలో దర్శకుడు కొంతమేర సక్సెస్ అయినా కమర్షియల్ యాంగిల్ మిస్సైనట్టు తెలుస్తుంది.


ఫస్ట్ హాఫ్ వేగం సెకండ్ హాఫ్ లో కూడా ఉండి ఉంటే బాగుండేది. విశ్వక్ సేన్ హీరో కం డైరక్టర్ గా రెండు బాధ్యతలను బాగానే చేశాడు. అయితే కేవలం మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ సినిమా చేశాడని చెప్పొచ్చు. ఎంచుకున్న కథను ఆసక్తికరంగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు విశ్వక్ సేన్.


రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో పెద్దగా కనిపించవు. అయితే కొత్త ప్రయత్నంలా అనుకున్నారేమో కాని ఈ ఫలక్ నుమా దాస్ ఓన్లీ ఫర్ మాస్ ఆడియెన్స్ కు మాత్రమే నచ్చేలా ఉన్నాడు.



విశ్వక్ సేన్, విశ్వ‌క్ సేన్, స‌లోని మిశ్రా, ఉత్తేజ్, హ‌ర్షితా గౌర్, త‌రుణ్ భాస్క‌ర్ఫలక్ నుమా దాస్.. మాస్ ప్రేక్షకుల కోసమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: