సినిమాటోగ్రఫీ, యూత్ ఆడియెన్స్ కోరుకునే అంశాలు సినిమాటోగ్రఫీ, యూత్ ఆడియెన్స్ కోరుకునే అంశాలు స్క్రీన్ ప్లే, కాస్టింగ్, మ్యూజిక్
ఇంజినీరింగ్ పూర్తి చేసి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న దేవదాస్ అలియాస్ దేవ్ (కార్తికేయ) స్నేహ (జబ్బా సింగ్) తో ప్రేమలో పడతాడు. అయితే ఆమెతో లాంగ్ డ్రైవ్ కు వెళ్తే అక్కడ స్నేహ ఫ్రెండ్ ఆముక్తమాల్యద (దివంగన) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే ప్రేమిస్తాడు దేవ్. స్నేహని వదిలేసి ఆముక్రమాల్యద మీదే దృష్టి పెడతాడు. ఆమె కూడా దేవ్ ప్రేమకు అంగీకరిస్తుంది. అయితే ఆ తర్వాత ఆమె వల్ల కూడా దేవ్ ఇబ్బందులు పడుతుంటాడు. తను చెప్పినట్టే వినాలి.. తను చెప్పినట్టే చేయాలని లేనిపోని ఆంక్షలు పెడుతుంది ఆముక్తమాల్యద. దానితో విసిగిపోయిన హిప్పీ ఆమెను వదిలించుకోవాలని చూస్తాడు. అందుకోసం దేవ్ ఏం చేశాడు..? దేవ్ లైఫ్ లో అరవింద్ ఎవరు..? అతను హిప్పీకి ఎలా సహాయం చేశాడు..? చివరకు దేవ్, ఆముక్తమాల్యదలు కలిశారా లేదా అన్నది సినిమా కథ. 



దేవ్ పాత్రలో కార్తికేయ ఇంప్రెస్ చేశాడు. ఆరెక్స్ 100లో ఓ ఇన్నోసెంట్ లవర్ గా కనిపించిన కార్తికేయ హిప్పీలో టైటిల్ కు తగినట్టుగా నటించాడు. ఈ సినిమాలో తన లుక్ కూడా బాగుంది. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేశాడు. ఇక హీర్ఫోయిన్ దివంగన సూర్యవంశి తన నటనతో మెప్పించింది. సినిమాకు కావాల్సిన గ్లామర్ కూడా ఆమె అందించింది. జెడి చక్రవర్తి తన పాత్రలో మెప్పించాడు. అయితే ఈ పాత్ర ఆయనే చేయాల్సిన అవసరం కనిపించలేదు. వెన్నెల కిశోర్ కామెడీ కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. జబ్బా సింగ్ కొన్ని సీన్స్ కే పరిమితం కాగా బ్రహ్మాజి, సుదర్శన్ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు.



ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది.. నివాస్ కే ప్రసన్న మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. పరమ రొటీన్ కథతో అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో నిరాశపరచాడు దర్శకుడు టి.ఎన్.కృష్ణ. కళైపులి ఎస్ థాను ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.



ఆరెక్స్ 100లో కార్తికేయ సిన్సియర్ లవర్ గా కనిపించాడు. అయితే ఈ సినిమాలో దనైకి రివర్స్ గా నటించాడు. హిప్పీ టైటిల్ కు తగినట్టుగా అన్ని శృతిమించాయని చెప్పొచ్చు. లిప్ లాక్ సీన్స్ కూడా యూత్ ఆడియెన్స్ కోసం పెట్టినట్టుగానే ఉంటుంది. కథ, కథనాల్లో దర్శకుడు ఏమాత్రం ఆకట్టుకోలేదు.


ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో అలా నడిపించినా సెకండ్ హాఫ్ బోర్ కొట్టేస్తుంది. రాసుకున్న కథకు స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా చేయలేదు దర్శకుడు. ప్రీ క్లైమాక్స్ లో హీరో నటనకు మంచి మార్కులు పడ్డా సినిమా అప్పటికే ఆడియెన్స్ కు బోర్ కొట్టించేస్తుంది. కేవలం మూతి ముద్దులు, అడల్ట్ కంటెంట్, 18 ప్లస్ డైలాగ్స్ ఉంటే సరిపోదు సినిమాలో స్టఫ్ ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతుంది.


టీజర్, ట్రైలర్ లో వీటిని ఎరగా వేసి హిప్పీని వదిలారు. కాని ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా రుచిందని చెప్పొచ్చు. రెగ్యులర్ స్టోరీనే కాకుండా రొటీన్ స్క్రీన్ ప్లేతో వచ్చిన హిప్పీ ప్రేషకులను మెప్పించలేదని చెప్పొచ్చు.



కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జజ్బా, జేడీ చక్రవర్తి, కృష్ణహిప్పీ.. ఫెయిల్యూర్ అటెంప్ట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: