Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:09 pm IST

Menu &Sections

Search

7 మూవీ రివ్యూ, రేటింగ్

- 2/5
7 మూవీ రివ్యూ, రేటింగ్ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • సినిమాటోగ్రఫీ
  • బిజిఎం
  • మెయిన్ ప్లాట్

చెడు

  • స్క్రీన్ ప్లే
  • డైరక్షన్
  • పర్ఫార్మెన్స్
ఒక్క మాటలో: 7.. మెప్పించలేని ప్రయత్నం..!

చిత్ర కథ

ఏసిపి విజయ్ ప్రకాశ్ (రెహమాన్) కార్తి (హవీష్) కోసం వెతుకుతుంటాడు. రమ్య (నందిత శ్వేత), జెన్నీ (అనీషా అంబ్రోస్) వారి భర్త కనబడటం లేదని కంప్లైంట్ ఇస్తారు. అయితే వారిద్దరు ఇచ్చింది ఒక్కడి కోసం అతనే కార్తిక్. ఈ ఇద్దరే కాదు ఇంకా ప్రియా (త్రిదా చౌదరి), భాను (పూజిత పొన్నాడ), అభినయ (అదితి ఆర్య) అందరు కార్తిక్ భారీన పడిన వాళ్లని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా కార్తిక్ వీళ్లందరిని ఎందుకు మోసం చేశాడు..? కార్తిక్ ఎందుకు అమ్మాయిలను మోసం చేస్తున్నాడు..? అసలు కార్తిక్ ఎవరు..? అతను ఎందుకు ఇలా మారాడన్నది సినిమా కథ.నటీనటుల ప్రతిభ

 
సినిమాలో హీరో హవీష్ తన శక్తిమేరకు నటించడానికి ట్రై చేశాడు. కార్తిక్, కృష్ణమూర్తి రెండు పాత్రల్లో హవీష్ నటించాడు. అయితే నటనలో ఇంకాస్త పరిణితి సాధించాలని తెలుస్తుంది. హీరోయిన్స్ ఏడుగురు గ్లామర్ తో పాటుగా మంచి అభినయాన్ని కబరిచారు. అయితే రెజినా పాత్ర పెద్దగా మెప్పించలేదు. రెహమాన్ ఎప్పటిలానే తన పాత్రకు న్యాయం చేశారు.సాంకేతికవర్గం పనితీరు

చైతన్ భరధ్వాజ్ మ్యూజిక్ సినిమాకు పెద్దగా హెల్ప్ అవలేదు. బిజిఎం ఓకే అనిపిస్తుంది. నిజారి షఫి సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు కూడా అతనే అవడం వల్ల కెమెరా వర్క్ నీట్ గా అనిపిస్తుంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. దర్శకుడు నిజార్ షఫి కథ సస్పెన్స్ గా తీసుకెళ్లినా స్క్రీన్ ప్లే పెద్దగా మెప్పించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనేలా ఉన్నాయి.చిత్ర విశ్లేషణ

సినిమా మొదలు పెట్టిన విధానం బాగుండి ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే అది రాను రాను ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఏదో అలా నడిపించినా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పేశాడు. లాజిక్ లేని సీన్స్ తో దర్శకుడు పూర్తిగా ట్రాక్ తప్పేసినట్టు అనిపిస్తుంది. కథను నడిపించిన విధానం కొంతమేరకు మెప్పించినా కథనంలో పొరపాట్లు.. కమర్షియాలిటీ మిస్ అవడం సినిమాపై బాగా ఎఫెక్ట్ పడింది.


ఇలాంటి కథ అనుకున్నప్పుడు కాస్టింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాని 7లో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ మెప్పించలేదు. అసలు ట్విస్ట్ రివీల్ అయ్యే టైం కు ఆడియెన్స్ లో నీరసం వచ్చేస్తుంది. సినిమా ఓవరాల్ గా డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చొచ్చు కాని రెగ్యులర్ సిని లవర్స్ కు మెప్పించకపోవచ్చు. కొన్ని కథలు రాసుకున్నప్పుడు విన్నప్పుడు బాగుంటాయి.. అయితే వాటిని తెరకెక్కించే విధానంలో గ్రిప్పింగ్ మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే 7 మూవీ. ఈ సినిమా మరోలా తీసుంటే బాగుండేది అన్న భావన కలుగుతుంది. 


ప్రత్యేకించి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఆడియెన్స్ ఈ సినిమా కొంతమేర నచ్చే అవకాశం ఉంది. అయితే దర్శకుడు చాలా సార్లు లాజిక్ మిస్ అవుతూ స్క్రీన్ ప్లే నడిపిస్తాడు. ట్రైలర్ చూసి 7 హీరోయిన్స్ తో హీరో రొమాన్స్ అని యూత్ ఆడియెన్స్ ఏమన్నా చూసే అవకాశం ఉంది. 


కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 5847
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Tollywood

View all
ఏక్ సినిమా రివ్యూ

ఏక్ సినిమా రివ్యూ

విడుద‌ల తేదీః 14.06.2019 నటీనటులు : బిష్ణు అధికారి , అపర్ణ శర్మ , హిమాన్షి ఖురానా సంగీతం : మంత్ర ఆనంద్ నిర్మాత : హరి దర్శకత్వం : సంపత్ రుద్రారపు రేటింగ్ : 3/5 స‌మాజంలో జ‌రిగే ఎన్నోఅన్యాయాల‌ను అరిక‌ట్టాల‌నే నేప‌ధ్యంలో సాగే క‌థ ఇది. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌, కుల‌మ‌తాల గొడ‌వ‌లు ఇలా ఎన్నో అన్యాయాల‌ను చూసి త‌ట్టుకోలేని ఓ అమ్మాయి ల‌వ‌ర్ హీరో (బిష్ణు) పాత్ర ఉంటుంది. టెర్రరిజం నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కించిన చిత్రం '' ఏక్ ''. బిష్ణు హీరోగా అపర్ణ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్ర పోషించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా ! స్టోరీ : బ్రిలియంట్ స్టూడెంట్ అయిన సిద్దూ అపర్ణ శర్మ ని ప్రేమిస్తాడు . అపర్ణ శర్మ కూడా సిద్దూ ని అమితంగా ఇష్టపడుతుంది . అయితే ఉగ్రవాదుల దాడిలో అపర్ణ శర్మ చనిపోతుంది . త‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అప‌ర్ణ చ‌నిపోవ‌డంతో సంఘ వ్యతిరేకులైన ఉగ్రవాదులను అంతం చేయాలనుకుంటాడు సిద్దూ. ఉగ్రవాదులను అంతం చేయడానికి సిద్దూ ఎంచుకున్న మార్గం ఏంటి ? అందులో సక్సెస్ అయ్యాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . అందులో ఒక‌రిని త‌నే త‌న చేతుల‌తో ఘోరంగా చంపితే మ‌రొక‌రిని తెలివిగా ప్లాన్ చేసి విల‌న్‌ను చంపిస్తాడు. చివ‌ర‌గా త‌ను ప్రియురాలు బాంబ్‌బ్లాస్ట్‌లో చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన మ‌సూద్ (పృధ్వి) క్యారెక్ట‌ర్‌ను త‌న‌తో పాటే బాంబ్ పెట్టి చంపేస్తాడు. త‌న ప్రియురాలు లేని జీవితం త‌న‌కు ఎందుకు త‌న లైఫ్ త‌న‌తోనే అంతం అన్న పాత్ర‌ను ద‌ర్శ‌కుడు చాలా బాగా తెర‌కెక్కించారు. హైలెట్స్ : కథాంశం హీరో నటన పెర్ఫార్మెన్స్ : ఉగ్రవాదులను , అరాచక వాదులను అంతం చేయాలనే సిద్దు పాత్రలో అద్భుతంగా రాణించాడు బిష్ణు అధికారి . నటనలోనే కాదు మంచి ఫిజిక్ తో కూడా ఆకట్టుకున్నాడు బిష్ణు . అపర్ణ శర్మ గ్లామర్ తో అలరించింది , అలాగే హిమాన్షి ఖురానా గ్లామర్ కే పరిమితం అయ్యింది . కీలక పాత్రలో సుమన్ నటించాడు . ఇక సుమన్ గురించి కొత్తగా చెప్పేదేముంది . అలాగే బెనర్జీ , శ్రవణ్ , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు తమ తమ పాత్రల్లో రాణించారు . టెక్నికల్ టీమ్ : మంత్ర ఆనంద్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది , అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి . ఖర్చుకు వెనుకాడకుండా మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి తన నిర్మాణ దక్షతని నిరూపించుకున్నారు హరి . ఇక దర్శకుడు సంపత్ విషయానికి వస్తే బర్నింగ్ పాయింట్ ని కథా వస్తువుగా ఎంచుకొని మంచి ప్రయత్నమే చేసాడు . నటీనటుల నుండి చక్కని నటన ని రాబట్టుకున్న దర్శకుడు యువతని ఆలోచింప జేసే విధంగా ఏక్ చిత్రాన్ని మలిచాడు . ఫైనల్ గా : ఏక్ యాక్ష‌న్ డ్రామా ఎంట‌ర్‌టైన‌ర్‌

Bollywood

View all