Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 3:44 am IST

Menu &Sections

Search

7 మూవీ రివ్యూ, రేటింగ్

- 2/5
7 మూవీ రివ్యూ, రేటింగ్ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • సినిమాటోగ్రఫీ
  • బిజిఎం
  • మెయిన్ ప్లాట్

చెడు

  • స్క్రీన్ ప్లే
  • డైరక్షన్
  • పర్ఫార్మెన్స్
ఒక్క మాటలో: 7.. మెప్పించలేని ప్రయత్నం..!

చిత్ర కథ

ఏసిపి విజయ్ ప్రకాశ్ (రెహమాన్) కార్తి (హవీష్) కోసం వెతుకుతుంటాడు. రమ్య (నందిత శ్వేత), జెన్నీ (అనీషా అంబ్రోస్) వారి భర్త కనబడటం లేదని కంప్లైంట్ ఇస్తారు. అయితే వారిద్దరు ఇచ్చింది ఒక్కడి కోసం అతనే కార్తిక్. ఈ ఇద్దరే కాదు ఇంకా ప్రియా (త్రిదా చౌదరి), భాను (పూజిత పొన్నాడ), అభినయ (అదితి ఆర్య) అందరు కార్తిక్ భారీన పడిన వాళ్లని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా కార్తిక్ వీళ్లందరిని ఎందుకు మోసం చేశాడు..? కార్తిక్ ఎందుకు అమ్మాయిలను మోసం చేస్తున్నాడు..? అసలు కార్తిక్ ఎవరు..? అతను ఎందుకు ఇలా మారాడన్నది సినిమా కథ.



నటీనటుల ప్రతిభ

 
సినిమాలో హీరో హవీష్ తన శక్తిమేరకు నటించడానికి ట్రై చేశాడు. కార్తిక్, కృష్ణమూర్తి రెండు పాత్రల్లో హవీష్ నటించాడు. అయితే నటనలో ఇంకాస్త పరిణితి సాధించాలని తెలుస్తుంది. హీరోయిన్స్ ఏడుగురు గ్లామర్ తో పాటుగా మంచి అభినయాన్ని కబరిచారు. అయితే రెజినా పాత్ర పెద్దగా మెప్పించలేదు. రెహమాన్ ఎప్పటిలానే తన పాత్రకు న్యాయం చేశారు.



సాంకేతికవర్గం పనితీరు

చైతన్ భరధ్వాజ్ మ్యూజిక్ సినిమాకు పెద్దగా హెల్ప్ అవలేదు. బిజిఎం ఓకే అనిపిస్తుంది. నిజారి షఫి సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు కూడా అతనే అవడం వల్ల కెమెరా వర్క్ నీట్ గా అనిపిస్తుంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. దర్శకుడు నిజార్ షఫి కథ సస్పెన్స్ గా తీసుకెళ్లినా స్క్రీన్ ప్లే పెద్దగా మెప్పించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనేలా ఉన్నాయి.



చిత్ర విశ్లేషణ

సినిమా మొదలు పెట్టిన విధానం బాగుండి ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే అది రాను రాను ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఏదో అలా నడిపించినా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పేశాడు. లాజిక్ లేని సీన్స్ తో దర్శకుడు పూర్తిగా ట్రాక్ తప్పేసినట్టు అనిపిస్తుంది. కథను నడిపించిన విధానం కొంతమేరకు మెప్పించినా కథనంలో పొరపాట్లు.. కమర్షియాలిటీ మిస్ అవడం సినిమాపై బాగా ఎఫెక్ట్ పడింది.


ఇలాంటి కథ అనుకున్నప్పుడు కాస్టింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాని 7లో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ మెప్పించలేదు. అసలు ట్విస్ట్ రివీల్ అయ్యే టైం కు ఆడియెన్స్ లో నీరసం వచ్చేస్తుంది. సినిమా ఓవరాల్ గా డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చొచ్చు కాని రెగ్యులర్ సిని లవర్స్ కు మెప్పించకపోవచ్చు. కొన్ని కథలు రాసుకున్నప్పుడు విన్నప్పుడు బాగుంటాయి.. అయితే వాటిని తెరకెక్కించే విధానంలో గ్రిప్పింగ్ మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే 7 మూవీ. ఈ సినిమా మరోలా తీసుంటే బాగుండేది అన్న భావన కలుగుతుంది. 


ప్రత్యేకించి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఆడియెన్స్ ఈ సినిమా కొంతమేర నచ్చే అవకాశం ఉంది. అయితే దర్శకుడు చాలా సార్లు లాజిక్ మిస్ అవుతూ స్క్రీన్ ప్లే నడిపిస్తాడు. ట్రైలర్ చూసి 7 హీరోయిన్స్ తో హీరో రొమాన్స్ అని యూత్ ఆడియెన్స్ ఏమన్నా చూసే అవకాశం ఉంది. 


కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 5847
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all