కొన్ని కామెడీ సీన్స్, కెమెరా వర్క్, కొన్ని కామెడీ సీన్స్, కెమెరా వర్క్, హీరోయిన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎడిటింగ్
ఓ చిన్న దొంగగా జీవనం సాగించే గోవింద్ (సప్తగిరి) జీవితంలో అసలు లక్ కలిసి రాదు. అయితే అలాంటి టైంలో అతనికి ఓ నిధిని కనుగొనడానికి సహాయం చేసే అవకాశం వస్తుంది. అలాంటి టైంలో గోవింద్ ఏం చేశాడు. ఆ నిధిని దక్కించుకునే క్రమంలో గోవిందకు ఎదురైన సమస్యలు ఏంటి..? గోవింద ఎలా దాన్ని దక్కించుకున్నాడు అన్నది సినిమా కథ.


సినిమాలో సప్తగిరి కమెడియన్ గానే అనిపిస్తాడు. ఓ పక్క కమెడీ చేస్తూ హీరోయిజం చూపిస్తూ తన వరకు పర్వాలేదు అనిపించినా కథలో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక హీరోయిన్ గా వైభవి జోషి పెద్దగా మెప్పించలేదు. ఆమె ఏమాత్రం సినిమాకు ప్లస్ అవ్వలేదు. అర్చన ఉన్నా సరే పెద్దగా ఉపయోగం ఏమి లేదు. మిగతా నటీనటులంతా సోసోగా నటించారు.



విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఏమాత్రం మెప్పించలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకోలేదు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ మాత్రం ఆకట్టుకుంది. అరుణ్ పవార్ కథ, కథనాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమా అంతా రొటీన్ పంథాలో సాగినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సోసోగా ఉన్నాయి.



సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమాలతో పర్వాలేదు అనిపించిన సప్తగిరి. అరుణ్ పవార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా వజ్రకవచ ధర గోవింద. సినిమా ఓ చిన్న లైన్ తీసుకుని తెరకెక్కించాడు దర్శకుడు అరుణ్ పవార్. అయితే ఎంచుకున్న కథను తెరకెక్కించే విధానంలో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. అంతేకాదు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇలా రెండిటిలో ఆడియెన్స్ ను మెప్పించడంలో విఫలమయ్యాడు.


కమెడియన్ గా తన వరకు పర్ఫెక్ట్ అనిపించుకుంటున్న సప్తగిరి హీరోగా మారి కొత్త ప్రయత్నాలు చేస్తే బెటర్. వజ్రకవచ ధర గోవింద సినిమా సప్తగిరి వరకు తన ప్రయత్నం బాగున్నట్టు అనిపించినా ఫైనల్ గా సినిమా మాత్రం ఆడియెన్స్ ను మెప్పించడంలో విఫలమైంది. సినిమా ఏమాత్రం కొత్తదనం లేకుండా ఉంటుంది.


కొన్ని కామెడీ సీన్స్, హీరోయిజం చూపించే సీన్స్ ఉంటే సినిమా ఆడియన్స్ కు నచ్చేస్తుంది అనుకుని అరుణ్ పవార్ ఈ సినిమా తీసి ఉండొచ్చు. కాని ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం సినిమా ఫెయిల్ అయ్యింది.



సప్తగిరి, వైభవి జోషి, అర్చన, శ్రీనివాస్ రెడ్డి, జబర్ధస్త్ కమెడియన్స్, అరుణ్ పవార్సప్తగిరి 'వజ్రకవచధర గోవింద'.. ఫెయిల్యూర్ అటెంప్ట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: