ప్రియదర్శి, ఝాన్సి, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సీన్స్ప్రియదర్శి, ఝాన్సి, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సీన్స్అక్కడక్కడ స్లో అవడం
చేనేత కుటుంబంలో పుట్టిన మల్లేశం 6వ తరగతివరకే చదివి తండ్రి బాటలోనే మగ్గం పని చేస్తుంటాడు. అయితే ఆసు పోస్తూ తల్లి భుజాలు జారిపొతుంటాయి. తల్లి కష్టాన్ని చూడలేని మల్లేశం ఆమె కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతని ఆలోచనల్లో ఆసు యంత్రాన్ని కనిపెట్టాలని అనుకుంటాడు. దానికోసం మల్లేశం ఎంత కష్టపడ్డాడు. ఎన్ని అవమానాలు ఎదుర్కుంటాడు..? ఫైనల్ గా తను అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడు..? అన్నది సినిమా కథ.  


మల్లేశం పాత్రలో ప్రియదర్శి అద్భుత నటన కనబరిచాడు. సినిమా మొత్తం ప్రియదర్శి తన భుజాన వేసుకుని చేశాడు. సినిమా అంతా పాత్ర పరిధి దాటకుండా ప్రియదర్శి నటన మెప్పించింది. సినిమాలో ప్రియదర్శి తర్వాత మల్లేశం భార్యగా చేసిన అనన్య పాత్ర ఆకట్టుకుంది. మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సి ప్రాణం పెట్టి చేసింది. సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆనంద్ చక్రపాణి పాత్ర మెప్పించింది. మిగతా వారంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.      



మార్క్ కే రాబిన్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. బాలు సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. తెలంగాణా అందాలను తన కెమెరాతో అద్భుతంగా చూపించాడు. మల్లేశం సినిమా డైలాగ్స్ కూడా బాగా రాశారు. రాజ్ ఆర్ కథ, కథనాలు అతని ప్రతిభను మెప్పించేలా చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా సమకూర్చారు.



తల్లి కష్టాన్ని చూడలేక ఆసు యంత్రాన్ని కనిపెట్టిన తెలంగాణా స్పూర్తిదాయకమైన వ్యక్తి కథ మల్లేశం. నిజ జీవిత కథలను తెరకెక్కించే క్రమంలో సినిమా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. అలానే సినిమా కూడా దర్శకుడు వాస్తవికతకు దగ్గరగా తీశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మల్లేశం బాల్యం, మ్యారేజ్, ఆసు యంత్రాన్ని కనిపెట్టాలన్న ఆలోచన రావడం లాంటి సన్నివేశాలతో నింపేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగించాడు.


1990 కాలం నాటి విధానాలను చాలా చక్కగా చూపించాడు దర్శకుడు రాజ్ ఆర్. సెకండ్ హాఫ్ మాత్రం మల్లేశం ఇన్వెన్షన్ ఎలా సాగిందన్నది చూపించారు. సినిమాకు అనవసరమైన ఏ అంశాన్ని ప్రస్థావించలేదు. కమర్షియలిటీ కోసం సినిమాను ట్రాక్ తప్పించలేదు. చింతకింది మల్లేశం జీవిత కథతో వచ్చిన ఈ మల్లేశం సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.


అయితే సినిమా కథ జరిగింది కాబట్టి కథనంలో దర్శకుడు అక్కడక్కడ చిన్న పొరపాట్లు చేశాడు. అయితే అవేవి సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించవు. ఆసు యంత్రాన్ని కనిపెట్టి పద్మశ్రీ అవార్డ్ అందుకున్న చింతకింది మల్లేశం కు ఇది పర్ఫెక్ట్ బయోపిక్ అని చెప్పొచ్చు.



ప్రియదర్శి, అనన్య,ఝాన్సీ, చక్రపాణి ఆనంద,రాజ్ ఆర్ మల్లేశం.. ఇది కథ కాదు జీవితం..!

మరింత సమాచారం తెలుసుకోండి: