రాజశేఖర్ నటన, స్క్రీన్ ప్లే, బిజిఎం, ట్విస్ట్రాజశేఖర్ నటన, స్క్రీన్ ప్లే, బిజిఎం, ట్విస్ట్హీరోయిన్స్, అక్కడక్కడ స్లో అవడం
కొల్లాపూర్ లో ఎమ్మెల్యే నర్సప్ప (అశుతోష్ రాణా) తమ్ముడు శేఖర్ బాబు (సిద్ధు) దారుణంగా చంపబడతాడు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసేందుకు కొల్లాపూర్ కు వస్తాడు ఐపిఎస్ ఆఫీస్ కల్కి (రాజశేఖర్). నర్సప్ప తమ్ముడిని చంపింది తన ప్రత్యర్ధి పెరుమాళ్ల (శత్రు) అని అందరు అనుకుంటారు. అతని కోసం నర్సప్ప, కల్కి వెతుకుతారు. శేఖర్ బాబుని చంపింది ఎవరు..? శేఖర్ బాబుని ఎందుకు చంపుతారు..? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.




కల్కి పాత్రలో రాజశేఖర్ నటన అద్భుతం. యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్ అన్నిటిలో ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. గరుడవేగ తర్వాత అదే కసితో నటించారు రాజశేఖర్. అదా శర్మ పాత్ర తక్కువే ఉన్నా ఆకట్టుకుంది. పద్మ పాత్రలో ఆమె నటన మెప్పించింది. నందిత శ్వేత కూడా సినిమాలో మంచి పాత్ర పోశించింది. పూజిత పొన్నడా రెండు సీన్లకే పరిమితమైంది. రాహుల్ రామకృష్ణ రిపోర్టర్ రోల్ ఆకట్టుకుంది. సినిమాలో అతని కామెడీ అలరిస్తుంది. అశుతోష్ రాణా, సిద్ధు, శత్రు, జయప్రకాశ్, నాజర్ ల నటన ఆకట్టుకుంది.   



శ్రావణ్ భరధ్వాజ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాకు అది ప్రధాన బలమని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పిరియాడికల్ డ్రామాకు సూటయ్యే లైటింగ్ తో కెమెరా వర్క్ బాగుందనిపిస్తుంది. కథ, కథనాల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ మెప్పించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేసిన మరో ప్రయత్నమే కల్కి. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచగా సినిమా ఆ రేంజ్ అందుకునేలా ఉందని చెప్పొచ్చు. స్టోరీ చాలా రొటీన్ గా అనిపించినా దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే మెప్పించింది. అయితే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. కథకు కావాల్సిన క్లూస్ అన్ని ఇస్తూనే ఒక్కోసారి హడావిడి చేసినట్టు అనిపిస్తుంది.


సెకండ్ హాఫ్ సినిమాకు ప్రాణమని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్స్ సినిమాకు బలం. క్లైమాక్స్ కూడా అలరించింది. సినిమా కథను అక్కడక్కడే తిప్పడం వల్ల ప్రేక్షకులు కొద్దిగా కన్ ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సినిమా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.


ఓవరాల్ గా కల్కి ఓ మెప్పించే ప్రయత్నమే.. ఎలాగు ప్రస్తుతం సినిమాలేవి లేకపోవడం కల్కికి కలిసి వచ్చే అంశం. రాజశేఖర్ తనకు సూటయ్యే కథతోనే వచ్చి అలరించాడు.



డాక్టర్ రాజశేఖర్,అదా శర్మ,నందితా శ్వేత,ప్రశాంత్ వర్మరాజశేఖర్ 'కల్కి' మెప్పించేశాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: