సమంత, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, బిజిఎం, ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లేసమంత, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, బిజిఎం, ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లేసెకండ్ హాఫ్ కొన్ని సీన్స్, సాంగ్ ప్లేస్ మెంట్స్
బేబీ (లక్ష్మి) ఆమె స్నేహితుడు కనకరాజు (రాజేంద్ర ప్రసాద్) కాలేజ్ క్యాంటీన్ చూసుకుంటూ ఉంటారు. ఓ చానెల్ లో మ్యూజిక్ కో ఆర్డినేటర్ గా విక్రమ్  (నాగ శౌర్య) పనిచేస్తుంటాడు. జగపతి బాబు చేసిన ఓ పని వల్ల 70 ఏళ్ల బేబీ కాస్త 20 ఏళ్ల బేబీ (సమంత)గా మారుతుంది. యంగ్ బేబీని చూసిన నాగ శౌర్య ఆమెను ప్రేమిస్తాడు. బేబీ తన ఫ్యామిలీకి సీక్రెట్ రివీల్ చేసిందా..? యంగ్ బేబీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? బేబీ మునుపటి రూపానికి వెళ్లిందా..?  అన్నది సినిమా కథ.   




సమంత అక్కినేని బేబీగా అదరగొట్టేసింది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నిటిలో సమంత ది బెస్ట్ అనిపించుకుంది. బేబీగా సమంత నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది. ఇక బేబీ పాత్రలో లక్ష్మి గారు కూడా బాగా చేశారు. పాత్ర ఉన్న కొద్దిసేపైనా సరే ఆమె తన సత్తా చాటారు. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, రావు రమేష్, నాగ శౌర్య, తేజ ఇలా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు.



రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అలరించింది. కెమెరా వర్క్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. బిజిఎం బాగా ఇచ్చాడు. జునైద్ సిద్ధిక్ ఎడిటింగ్ ఇంప్రెస్ చేసింది. సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది. దర్శకురాలు నందిని రెడ్డి మరోసారి తన ప్రతిభ చాటుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



కొరియన్ మూవీ మిస్ గ్రానీని తెలుగులో ఓ బేబీగా రీమేక్ చేశారు. ఈ రీమేక్ లో దర్శకురాలు నందిని రెడ్డి తెలుగు నేటివిటీకి తగినట్టుగా చేసిన మార్పులు బాగున్నాయి. కళ్యాణ వైభోగమే తర్వాత నందిని రెడ్డి ఈ సినిమా చేశారు. డైరక్షన్ పర్ఫెక్ట్ గా అనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ జెనరేట్ చేయగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా తీసుకెళ్లారు.


సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయినట్టు అనిపిస్తుంది. అయితే సమంత తన నటనతో దాన్ని కవర్ చేసింది. 70 ఏళ్ల వయసుగల బామ్మ 20 ఏళ్ల వయసు గల అమ్మాయిగా మారితే ఆమె ఆలోచనలు, ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది పర్ఫెక్ట్ గా చూపించారు. సినిమాలో సమంత వన్ మ్యాన్ షో చేసింది. 


సినిమాకు సపోర్టింగ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. మిస్ గ్రానీకి ఓ బేబీ పర్ఫెక్ట్ రీమేక్ యూత్, ఫ్యామిలీ, చిన్నా పెద్దా అందరు ఎంచకా చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు ప్రత్యేకంగా ఎమోషనల్ సీన్స్ బాగా నచ్చుతాయి. సో ఓ బేబీతో సమంత అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే.



అక్కినేని సమంత, లక్ష్మి, నాగ శౌర్య, రాజేంద్రప్రసాద్ఓ బేబీ.. టార్గెట్ రీచ్ అయిన సమంత..!

మరింత సమాచారం తెలుసుకోండి: