Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 6:12 am IST

Menu &Sections

Search

దొరసాని మూవీ రివ్యూ, రేటింగ్

- 3/5
దొరసాని మూవీ రివ్యూ, రేటింగ్ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • ఆనంద్ దేవరకొండ
  • శివాత్మిక
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • డైరక్షన్

చెడు

  • అక్కడక్కడ కొద్దిగా స్లో అవడం
ఒక్క మాటలో: దొరసాని.. రాజు, దేవకిల ప్రేమ కావ్యం..!

చిత్ర కథ

అది 1980 కాలం.. ఊరికి పెద్ద దొర రాజు(వినయ్ వర్మ). ఊరు మొత్తం దొర కనుసైగల్లో ఉంటుంది. దొర కూతురు చిన్న దొరసాని దేవకి (శివాత్మిక రాజశేఖర్)ని ఎవ్వరికి కనిపించకుండా పెంచుతాడు. అలాంటి టైంలో కూలీ కొడుకైన రాజు (ఆనంద్ దేవరకొండ) చిన్న దొరసానిని చూసి ఇష్టపడతాడు. దొరసాని కూడా రాజుని ప్రేమిస్తుంది. అయితే వీరి ప్రేమ వ్యవహారం దొర రాజుకి తెలుస్తుంది. కూలోడి కొడుకు దొరసానిని ప్రేమించడాన్ని జీర్ణించుకోని అతను రాజు తల్లిదండ్రులను చిత్రవద చేస్తాడు. రాజుని పోలీసులకు పట్టిస్తాడు. రాజుని మర్చిపోవాలని దేవకికి వార్నింగ్ ఇస్తాడు. ఇంతకీ రాజు, దేవకిల ఒకటయ్యారా..? వారి ప్రేమ కథ ఎలా ముగిసింది..? అన్నది సినిమా కథ.       



నటీనటుల ప్రతిభ

దొరసాని సినిమాకు ప్రధాన ఆకర్షణ కాస్టింగ్ అని చెప్పొచ్చు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఇద్దరు తమ పాత్రలకు ప్రాణం పెట్టి చేశారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఆనంద్, శివాత్మిక మొదటి సినిమానే ఇంత అద్భుతంగా నటించడం ఇంప్రెస్ చేస్తుంది. వినయ్ వర్మతో పాటుగా సినిమాలో మిగతా పాత్రలన్ని బాగా అలరించారు. కిశోర్ నటన బాగుంది.  



సాంకేతికవర్గం పనితీరు

ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. బిజిఎం కూడా మనసుకి హత్తుకునేలా ఉంటుంది. సన్ని కుర్రపాటి సినిమాటోగ్రఫీ అలరించింది. ఇక దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర కథ కథనాలు ఇంప్రెస్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకు కావాల్సినంత బడ్జెట్ కేటాయించారు.



చిత్ర విశ్లేషణ

ప్రేమకథలు ఎన్నొచ్చినా మనసుకి హత్తుకుంటాయి. అలాంటి కేటగిరిలో వచ్చిన సినిమా దొరసాని. కె.వి.ఆర్ మహేంద్రా అద్భుతమైన కథ, కథనాలతో దొరసని సినిమా ఇంప్రెస్ చేసింది. 1980ల నాటి పరిస్థితులకు తగినట్టుగా కథ రాసుకున్న దర్శకుడు కథనం కూడా అదేవిధంగా నడిపించాడు.


రాసుకున్న సన్నివేశాలే కాదు పాత్రల స్వభావాలు.. నటన అన్ని అద్భుతంగా కుదిరాయి. అయితే కథ సాధారణంగా అనిపించినా కథనం బాగా రాసుకున్నాడు దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్రా. ఇలాంటి కథలతో సినిమాలు ఎన్నో వచ్చినా టైట్ స్క్రీన్ ప్లేతో సినిమాను గట్టేక్కించారు.


లవ్, ఎమోషన్ రెండిటిలో సినిమా బాగా నడిపించాడు. ఓ మంచి ప్రేమకథను దర్శకుడు చెప్పిన విధానం బాగుంది. అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ, శివాత్మికల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉంటుంది.



కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 5847
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all