మేఘాంశ్, కామెడీ, సినిమాటోగ్రఫీమేఘాంశ్, కామెడీ, సినిమాటోగ్రఫీస్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్
సంజయ్ అలియాస్ సంజు (మేఘాంశ్) తన మొదటి చూపులోనే ప్రియ (నక్షత్ర)ని చూసి ప్రేమిస్తాడు. ప్రియను ఎలాగోలా లవ్ లోకి దించుతాడు సంజు. అయితే వీళ్ల ప్రేమకు అడ్డుగా మారతాడు ప్రియ తండ్రి (అనీష్ కురువిల్ల). వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లాలంటే అతని తండ్రికి ఇష్టమైన రాజ్ దూత్ ని తెచ్చి ఇవ్వాలని కోరుతాడు. అలా రాజ్ దూత్ వేటలో వెళ్లిన సంజు దాన్ని తీసుకొచ్చాడా లేదా అన్నది సినిమా కథ.



చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన మేఘాంశ్ హీరోగా చేసిన తొలి ప్రయత్నం రాజ్ దూత్. సినిమాలో సంజయ్ పాత్రలో అతను మెప్పించాడని చెప్పాలి. డ్యాన్స్, ఫైట్స్ ఓకే కాని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త వర్క్ అవుట్ చేయాల్సి ఉంది. హీరోయిన్ నక్షత్ర పర్వాలేదు అనిపించింది. తెర మీద వీరి లవ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. సుదర్శన్ కామెడీ కూడా సోసోగానే ఉంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. ముఖ్యంగా రాజ్ దూ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సునీల్ కూడా ఆకట్టుకున్నాడు.





విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ అలరించింది. సినిమాలో కెమెరా వర్క్ బాగుంది. వరుణ్ సునీల్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉంది. బిజిఎం కూడా సోసోగానే అనిపిస్తుంది. దర్శకులు అర్జున్ కార్తిక్ కథలో క్యూరియాసిటీ అనిపించినా కథనం తేలకొట్టేశారు. స్క్రీన్ ప్లే సరిగా రాసుకోలేదని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సోసోగానే అనిపిస్తాయి.


రాజ్ దూత్ అంటూ ఓ బైక్ చుట్టూ తిరిగే కథతో వచ్చాడు శ్రీహరి తనయుడు మేఘాంశ్. శ్రీహరి వారసత్వాన్ని కొనసాగించే సత్తా తనకు ఉందని హీరోగా మెప్పించే ప్రయత్నం చేశాడు మేఘాంశ్. అయితే మొదటి సినిమా కాబట్టి ఆ బెరుకు కనిపిస్తుంది. ఇక ఎంచుకున్న కథ బాగున్నా స్క్రీన్ ప్లే గొప్పగా రాసుకోలేదు.


సినిమా అంతా లాజిక్ లెస్ గా సాగుతుంది. ఫన్ ఎలిమెంట్స్ ఉన్నా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కథ, కథనాల మీద దర్శకులు ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. సినిమాలో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ ఫ్రెష్ గా అనిపిస్తుంది.


ఫైనల్ గా రాజ్ దూత్ ఫన్, లవ్, ఎమోషన్ అన్ని అంశాలతో వచ్చిన సినిమా. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉంది. అయితే డిఫరెంట్ జానర్ సినిమాలు చూస్తే ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా రుచించదు. 



మేఘాంశ్ శ్రీహరి, నక్షత్ర,రవి వర్మ, కోట శ్రీనివాసరావురాజ్ దూత్.. మెప్పించలేని మేఘాంశ్ తొలి ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: