రామ్ మాస్ యాక్టింగ్, రేసీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్, హీరోయిన్స్ గ్లామర్రామ్ మాస్ యాక్టింగ్, రేసీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్, హీరోయిన్స్ గ్లామర్రొటీన్ కథ, సెకండ్ హాఫ్
శంకర్ (రామ్) లోకల్ రౌడీగా చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఓ హత్య కేసులో అతను ఓ సంవత్సరం పాటు ఎవరికి కనిపించడు. ఇదిలాఉంటే ఓ హై ప్రొఫైల్ కేసు కోసం పోలీస్ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) విచారణ చేపడతాడు. అయితే సడెన్ గా సత్యదేవ్ చనిపోవడంతో అతని మెమొరీని ఓ చిప్ రూపంలో శంకర్ తలలో పెడతారు. ఇంతకీ శంకర్ ఏం చేశాడు..? అరుణ్ మెమొరీ చిప్ లో ఏముంది..? శంకర్ ఎలా వాటిని చేయగలిగాడు అన్నది సినిమా కథ.  



ఇస్మార్ట్ శంకర్ గా రామ్ పోతినేని తన ప్రాణం పెట్టి చేసినట్టు అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో పూరి రామ్ ను పొగుడుతుంటే ఏమో అనుకున్నాం కాని నిజంగానే రాం తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. డైలాగ్స్, యాక్షన్, ఫైట్స్ అన్నిటిలో ది బెస్ట్ అనిపించాడు. ఇక హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ షో సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇంకా సత్యదేవ్, షయాజి శిండే పాత్రలు అలరించాయి. మిగతా వారంతా పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.   


సినిమాటోగ్రాఫర్ రామ్ తోట తన కెమెరా వర్క్ తో మెప్పించారు. పూరి డైరక్షన్ లో కెమెరా టేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ కు సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బిజిఎం కూడా అదరగొట్టాడు. కథ పాతదే అయినా కథనంలో పూరి తన మార్క్ చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి.  



టెంపర్ తర్వాత పూరి హిట్టు కోసం తపించిపోతున్నాడు. అలాంటి టైంలో ఇస్మార్ట్ శంకర్ అంటూ ఇస్మార్ట్ మూవీతో వచ్చారు పూరి. ఎనర్జిటిక్ స్టార్ ఇప్పటివరకు చేయని ఊర మాస్ పాత్రతో సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కథ రొటీన్ గానే అనిపిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం హీరోని వాడుకోవడం అనే కథలు చాలానే వచ్చాయి.  


అయితే ఈ సినిమా కథ రొటీన్ గా అనిపించినా పూరి మార్క్ టేకింగ్ ఇంప్రెస్ చేస్తుంది. అంతేకాదు హీరోయిన్స్ అందాలు సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్నాళ్లుగా తెలుగులో పక్కా మాస్ సినిమాలు రావట్లేదన్న అసంతృప్తి ఉంది. పూరి ఆ కొరత తీర్చాడు.


ముఖ్యంగా సినిమాలో పూరి డైరక్షన్, రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్, ఇంటర్వల్ బ్యాంగ్ బాగున్నాయి. అయితే సెకండ్ హాఫ్ కాస్త రొటీన్ గా అనిపించడమే కాకుండా కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇస్మార్ట్ శంకర్ ముందునుండి చెబుతున్నట్టుగా బి, సి సెంటర్స్ ఆడియెన్స్ కోసమే వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది.   



రామ్ పోతినేని, నభా నటాషా,నిధి అగర్వాల్, పూరి జగన్నాధ్, ఛార్మీఓన్లీ ఫర్ మాస్ ఆడియెన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: