ఇంటర్వల్ బ్లాక్ ,డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వల్ బ్లాక్ ,డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాత కథ, స్లో నేరేషన్ ,అర్ధాంతరంగా ముగించేయడం.. ,రాసుకున్న బలమైన హీరోపాత్రని తెరపై చూపించలేకపోవడం

ఈ సినిమా ట్రైలర్ లో చెప్పినట్టు సినిమా ఓపెన్ చెయ్యగానే మన హీరో సత్య కొత్త రకమైన మాఫియా ప్రారంభించడానికి ముంబై వస్తాడు. వచ్చి తన ప్రాణ స్నేహితుడైన నారా దగ్గర ఉంటాడు. సత్య కొంతమంది బిజినెస్ మాన్ లతో కలిసి కొత్త రకమైన మాఫియాని సృష్టించడం మొదలు పెడతాడు. "కంపెనీ" అనే పేరుతో మొదలైన ఈ మాఫియ దేశం మొత్తం వ్యాపిస్తుంది. అదే సమయంలో కంపెనీ వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోడానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ని నియమిస్తుంది. అప్పటినుండి సత్య జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అప్పుడే సత్యకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని తెలుస్తుంది .. సత్య జీవితంలో చోటు చేసుకున్న ఆ సంఘటనలు ఏంటి ? సత్య పోలీస్ ల నుండి తప్పించుకున్నాడా? లేదా? అన్న అంశాలు కావాలంటే ఈ సినిమా చూడండి. హీరో ఫ్లాష్ బ్యాక్ కావాలంటే డైరెక్ట్ గా నెక్స్ట్ పార్ట్ చూడండి....

సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు, సో ముందు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుంచి మొదలు పెడదాం.. డిపార్ట్ మెంట్ సినిమాతో సినీ ప్రేక్షకులకి భయాన్ని చూపెట్టిన వర్మ ఈ సినిమాతో పరవాలేదనిపించుకున్నాడు. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు వర్మ ఈజ్ బ్యాక్ అనే స్థాయిలో ఉన్నాయి కానీ కొన్ని సీన్స్ మాత్రం ఈ మధ్యకాలంలో తను తీస్తున్న సినిమాల్లోలానే తల తోక, తాడు బొంగరం లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా ఇక నుంచి అండర్ వరల్డ్ సినిమాలే చేయనని చెప్పిన వర్మ ఈ సినిమా క్లైమాక్స్ లో అసలు ముగింపే ఇవ్వకుండా తదుపరి పార్ట్ లో చుసుకోమనడం ప్రేక్షకులకి షాక్ ఇచ్చింది.

రోగ్ మెథడాలజీ వాడకుండా ఈ సినిమా తీయడం వల్ల ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా బాగుందనిపిస్తుంది. పాటలు పరవాలేధనిపించాయి. నేపధ్య సంగీతం విషయానికి వస్తే అవసరమైన కొన్ని సన్నివేశాలకు చాలా బాగా ఇచ్చాడు అలానే కొన్ని అనవసర సన్నివేశాలకు కూడా అదే తరహాలో మ్యూజిక్ ఇవ్వడం కాస్త చిరాకు పెడుతుంది. వర్మ తను తీసిన సినిమాని ఎడిటర్ కట్ చెయ్యకూడదు అనే ఉద్దేశంతో సినిమాని చిన్నదిగా తీయడం వల్ల ఎడిటర్ పెద్దగా కష్టపడలేదు.ఉన్నదాన్ని సీన్ టు సీన్ ఎడిట్ చేసి ఇచ్చేసాడు. హిందీ వెర్షన్ లో డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు పరవాలేధనిపించే స్థాయిలో ఉన్నాయి.

సత్య పాత్రను పోషించిన పుణీత్ సింగ్ రతన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది కాని కొన్ని సన్నివేశాలలో ఎమోషన్స్ సరిగ్గా పండించలేకపోయాడు. అనైక సోటి పాత్రకు ప్రాధాన్యం లేదు కాబట్టి అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చింది. మహేష్ ఠాకూర్ తనకిచ్చిన పాత్రలో పరవలేధనిపించారు. ఆరాధన గుప్తా ఈ సినిమాకి బోనస్ అందాలను పంచి పెట్టింది. మిగిలిన అందరు నటులు టిపికల్ వర్మ స్టైల్ లో నటించారు నటనలో అందరు బాగా నటించారనే చెప్పుకోవచ్చు.

గత కొన్ని చిత్రాలుగా ప్రేక్షకులలో ఒక రకమయిన భయాన్ని నెలకొల్పిన రామ్ గోపాల్ వర్మ మరో చిత్రంతో మన ముందుకి వచ్చారు. "సత్య" - రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకొనే చిత్రం ఇది, దానికి సీక్వెల్ అనగానే అందరిలో కాకపోయినా కొందరిలో అంచనాలు నెలకొన్నాయి, కాని తీరా తెర మీద చూసాక ఇది సత్య కి కొనసాగింపు కాదు బిజినెస్ మాన్ కి రీమేక్ అని తెలియగానే నిరాశ పడటం ఖాయం. పోనీ బిజినెస్ మాన్ మాత్రమే అనుకుంటే కొన్ని సన్నివేశాలు సర్కార్ నుండి మరి కొన్ని రంగీల నుండి ఇలా అయన సినిమాలను ఆయనే పులిహోర చేసారు. ఇదంతా ఒక ఎత్తయితే గతంలో అడవి కి చేసిన విధంగానే ఈ చిత్రాన్ని అర్ధంతరంగా ముగించేయడం ప్రేక్షకుడికి విసుగు తెప్పించే విషయం. రాధిక ఆనంద్ అందించిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.

ఇంటర్వెల్ లో తెచ్చుకున్న పాప్ కార్న్ అయిపోయే లోపు సినిమా అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఎడిటర్ కత్తిరించడానికి కూడా అవకాశం లేనంత చిన్నది గా ఉంటుంది. బిజినెస్ మాన్ లో మహేష్ బాబు నాజర్ తో ఏవైతే డైలాగ్స్ చెప్తాడో అవే డైలాగ్స్ ఇందులో చివర్లో హీరో పోలీస్ తో చెప్తాడు. ఈ చిత్రానికి సత్య 2 అనడం కన్నా "కంపెనీ 2" లేదా "బిజినెస్ మాన్ 2" అని పేరు పెట్టి ఉంటె సరిగ్గా సరిపోయుండేది. చిత్రం ఆసాంతం ఇంటెన్సిటీ బాగున్నా సరయిన సమయంలో ఎలివేషన్ చెయ్యడంలో ఫెయిల్ అవ్వడం తో అప్పటి వరకు పాత్రతో కనెక్ట్ అవ్వడానికి సిద్దంగా ఉన్న ప్రేక్షకుడు నిరాశ చెందుతాడు.

చిత్రంలో ఇలాంటి పరిస్థితి మూడు నాలుగు సార్లు వస్తుంది. ఇంటర్వెల్ ప్రేక్షకులను ఎంగేజ్ చెయ్యగలిగినా దర్శకుడు అదే స్థాయిని రెండవ అర్ధ భాగంలో మెయిన్ టెయిన్ చెయ్యలేకపోయాడు. ఒకే రకమయిన కథను పూరి జగన్నాథ్ "బిజినెస్ మాన్" అని తీస్తే వర్మ "సత్య 2" అని తీసారు కాని టేకింగ్ పరంగా తేడా ఉండటంతో పోలికలు బయటపడవు. తెలుగులో ఈ చిత్రం శనివారం విడుదల అవుతుంది. పాత్ర తీరు తెన్నుల ప్రకారం చూస్తుంటే సత్య పాత్రలో శర్వానంద్ చాలా బాగా ఉంటాడు అనిపిస్తుంది. నిజానికి ఈ చిత్రానికి కరెక్ట్ రివ్యూ రాయాలంటే సత్య 3 కూడా చూడాలి కాని అలా కుదరదు కాబట్టి ఇప్పుడే రాసేయడం జరిగింది....

Sharwanand,Anaika Soti,Anjali Gupta,Ram Gopal Varma,M. Sumanth Kumar Reddy,P.Chandrasekarసత్య 2 : బిజినెస్ మాన్ 2 ..

మరింత సమాచారం తెలుసుకోండి: