వెంకటేష్ ,రోహిత్ శెట్టి వెంకటేష్ ,రోహిత్ శెట్టి విజయ భాస్కర్ ,కాపీ సరిగ్గా కొట్టలేని మిగిలిన అందరు.. రెహమాన్ (రామ్) మరియు సానియా (అంజలి) అక్క తమ్ముళ్ళు, వీరు ఒక కోర్ట్ కేసులో ఓడిపోయి ఉద్యోగం కోసం నారాయణ (ఎం ఎస్ నారాయణ) వాళ్ళ ఊరు భీమరాజుపురం కి వెళ్ళిపోతారు ఆ ఊరికి పెద్ద అయిన బలరాం(వెంకటేష్) దగ్గర రెహమాన్ తన పేరు రామ్ అని చెప్పి ఉద్యోగంలో చేరిపోతాడు. కాని బలరాంకి అబద్దం చెప్పే వాళ్ళు నచ్చరు, అక్కడ నుండి కథ మొదలవుతుంది. అవసరం కోసం అబద్దం మీద అబద్దం చెబుతూ రెహమాన్, బలరాం దగ్గర ఇరుక్కుపోతాడు. అక్కడ నుండి ఎదురయ్యే హాస్య పూరిత సన్నివేశాల సమూహారమే మిగిలిన కథ. ఇదిలా ఉండగా రామ్, బలరాం చెల్లెలు అయిన మీనాక్షి (షాజాన్ పదమ్సీ) తో ప్రేమలో పడతాడు. బలరాం రెహమాన్ గురించి నిజం తెలుసుకున్నాడా లేదా? రెహమాన్ మీనక్షిల ప్రేమను బలరాం ఒప్పుకున్నాడా లేదా? అసలు సానియా/ సావిత్రి/సరిత ఎవరు? అన్నదే మిగిలిన కథ .... వెంకటేష్ నటన పరంగా తన అనుభవాన్ని అంతా రంగరించి నటించారు ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో అయన నటన అద్భుతం. అయన చెప్పిన డైలాగ్స్ కనుక లేకపోయుంటే చిత్రంలో ఏమి లేదు అన్నంత స్థాయిలో అయన పాత్ర ఉంటుంది. రామ్ నటన పరవాలేదు కాని అభిషేక్ బచ్చన్ లా చెయ్యాలన్న తపనతో ఆయనకు వచ్చిన నటన కూడా చెయ్యలేకపోయాడు. మూడు విభిన్న పేర్లతో రెండు వేరు వేరు పాత్రలలో నటించిన అంజలి పాత్రకు తగ్గట్టుగానే నటించింది ఎక్కువసేపు కనిపించని ఆమె పాత్రకి ఆమె కూడా ఎక్కువ నటించలేదు. షాజన్ పదమ్సీ గురించి చెప్పాలంటే సన్నివేశాలు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి ఆమె హవాభావల్లో మాత్రం మార్పు లేదు ఆ రకంగా ఆమె తన స్థిరత్వం చాటుకుంది. జయప్రకాశ్ నారాయణ్, అలీ , ఎం ఎస్ నారాయణ మరియు కోవై సరళ వారి పాత్రలు ఉన్నంత మేరకు నవ్వించగలిగారు. ముందుగా ఈ చిత్ర డైరెక్టర్ రోహిత్ శెట్టి గురించి మాట్లాడుకుంటే.... ఏంటి విజయ్ భాస్కర్ కదా అనుకున్నారా చిత్రం చూసాక మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. ఈయన శైలి ఈ చిత్రంలో ఎక్కడా కనిపించదు కాబట్టి ఈయన గురించి మాట్లాడుకోవడం అనవసరం. డైలాగ్స్ చాలా బాగున్నాయి కాని ప్రాస కోసం పరిగెత్తి పట్టుకోలేక కొన్ని చోట్ల పడిపోయారు. సెంటిమెంట్ సన్నివేశాలలో రచించిన సంభాషణలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ లో కూడా కాపీ కొట్టడం ఇదే మొదటి సారి లేదా రెండవ సారి అయ్యుండచ్చు.. ఎడిటెడ్ వెర్షన్ ని రీమేక్ చేస్తున్నారు కాబట్టి ఎడిటర్ కి కూడా సేమ్ దర్శకుడి పనే "కట్ కాపీ పేస్ట్". ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి బౌన్సీ పిచ్ మీద బాల్స్ ఎగిరినట్టు ఎగిరారు మనుషులు, తమన్ సంగీతం "ఎప్పటిలానే" ఉంది నేపధ్య సంగీతం కూడా "అలానే" ఉంది. 35 కోట్ల సినిమాలా లేదు పాతిక రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్టు అనిపించదు. నిర్మాతలు ఖర్చయితే పెట్టారు కాని కరెక్ట్ గా పెట్టలేదు.

"మేకింగ్ రీమేక్ ఇస్ వాకింగ్ కేక్" అనుకున్నట్టు ఉన్నారు విజయ్ భాస్కర్. గతంలో ఎదురయిన అనుభవాల నుండి కూడా ఎం నేర్చుకోలేకపోయారు లేదా బహుశా "ఫ్లాప్స్ మేక్ పర్ఫెక్ట్ హిట్" అని అనుకున్నారేమో. క్లాస్ మేట్స్ అని ఒక మలయాళ చిత్ర రీమేక్ చేసారు హేండిల్ చెయ్యలేకపోయారు తరువాత దొంగలు అని బంటీ ఆర్ బబ్లీ ఫ్రీమేక్ చేసారు అది కూడా హేండిల్ చెయ్యలేకపోయారు ఇప్పుడు బోల్ బచ్చన్ లో మసాలా వెయ్యాలని ప్రయత్నించారు రిజల్ట్ మాత్రం మారలేదు. గత చిత్రం ప్రేమ కావాలి తో మళ్ళీ ఫాం లో కి వచ్చినట్టే అనిపించినా ఈ చిత్రంతో అయన తనని తను తిరిగి నిరూపించుకున్నారు. "వేర్ ఎవర్ బర్డ్ ఫ్లైస్ కం బ్యాక్ టు హోం నైస్" అన్నంత సులువుగా తిరిగి తన స్థానానికి తను వచ్చి చేరుకున్నారు విజయ్ భాస్కర్ గారు. ఈ సినిమాలో తెలుగుదనం కోసం విజయ భాస్కర్ గారు చాలా కష్టపడ్డారు.

చిత్రంలో రెండు లేదా మూడు సన్నివేశాలను తెలుగు తగ్గట్టుగా మార్చడంలో అయన కష్టం చాలా కనిపించింది. ఈ చిత్ర చివర్లో ఏ ఫిలిం బై విజయ భాస్కర్ అని వేయించడం కన్నా ఫిలిం బై రోహిత్ శెట్టి అని వేయిస్తే బాగుండేది. బాడీ లాంగ్వేజ్ నుండి బ్యాక్ గ్రౌండ్ సెట్స్ వరకు ఎక్కువగా కష్టపడకుండా కట్ కాపీ పేస్ట్ అనే సిద్దాంతాన్ని ఫాలో అయ్యారు ఈ సందర్బంగా ఒక విషయం చెప్పాలి అనిపిస్తుంది "డూయింగ్ కాపీ పేస్ట్ మేక్స్ ఎఫర్ట్ వేస్ట్" , విజయ్ భాస్కర్ గారు మీకు మరో త్రివిక్రమ్ ని వెతుక్కోవలసిన సమయం వచ్చింది రీమేక్ లు చెయ్యడం ఆపేసి ఆ పని మీద ఉండటం మంచిది. ఇక ఈ మధ్య కాలంలో తమన్ గురించి చెప్పుకోవాలంటే రీమేక్ సినిమానే కదా అని ట్యూన్స్ కూడా రీమేక్ చేసారు. అజయ్ దేవగన్ పాత్రను తెలుగుకి సరిపడేలా ఉండాల్సింది.

హిందీ లో అభిషేక్ పండించిన "గే" హావభావాలు రామ్ పలకించలేకపోయాడు, ఆ నటన గే గా కన్నా తాగుబోతు నటనగా ఎక్కువగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సన్నివేశాలు చాలా చిరాకు పెడుతుంది. మొదట్లో బాగానే అనిపించినా టింగ్లిష్ డైలాగ్స్ చివరకు వచ్చేసరికి అనవసరం అనిపిస్తుంది. షాజన్ పదమ్సీ మరియు అంజలి పాత్రలను హీరోయిన్ పాత్రల అనడం కన్నా ప్రత్యేక పాత్రలు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ చిత్రం గురించి చెప్పాలంటే రోహిత్ శెట్టి కథను తీసుకొని కాస్త హార్డ్ వర్క్ చేసి ఉంటె బాగుండేది. " హార్డ్ వర్క్ ఇస్ కీ హోల్ తో సక్సెస్" ...

Venkatesh,Ram,Anjali,Shazahn Padamsee,K. Vijaya Bhaskar,Daggubati Suresh Babuమసాల : మసాలా "కాపీ"

మరింత సమాచారం తెలుసుకోండి: