విజయ్ దేవరకొండ, రష్మిక, మ్యూజిక్, డైలాగ్స్విజయ్ దేవరకొండ, రష్మిక, మ్యూజిక్, డైలాగ్స్స్లో నరేషన్
చైతన్య అలియాస్ బాబి (విజయ్ దేవరకొండ) కాకినాడ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా ఉంటాడు. తాత కామ్రేడ్ సూర్యం (చారు హాసన్) మాటలను ఆదర్శంగా తీసుకుంటాడు. స్టూడెంట్ లీడర్ గా ఎక్కువ కోపంగా ఉండే బాబి తన ఇంటి పక్కన ఉన్న అపర్ణ దేవి అలియాస్ లిల్లీ (రష్మిక మందన్న) ప్రేమలో పడతాడు. స్టేట్ క్రికెటర్ గా ఆడుతున రష్మిక తన కెరియర్ విషయంలో ఇబ్బందులు పడుతుంది. బాబి కూడా తన కోపం వల్ల ఇబ్బందుల్లో పడతాడు. తనని తాను మార్చుకునేందు లాంగ్ ట్రిప్ కు వెళ్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం మళ్లీ తిరిగి వస్తాడు బాబి అప్పుడు తను ఎలాంటి పరిస్థితి ఎదుర్కున్నాడు..? బాబి, లిల్లీల లవ్ స్టోరీ ఎలా ముగిసింది అన్నది సినిమా కథ.   



విజయ్ దేవరకొండ మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో అతని నటనకు అందరు ఫిదా అవుతారు. ఇలాంటి పాత్రకు విజయ్ మాత్రమే పర్ఫెక్ట్ అనిపించేలా చేశాడు. రష్మిక మందన్న కూడా చాలా బాగా చేసింది. సినిమా కోసం ఆమె పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. సుహాస్ కూడా బాగా చేశాడు. చారు హాసన్, ఆనంద్ వంటి వారు కూడా ఆకట్టుకున్నారు.



జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ సినిమాకు ప్రాణమని చెప్పొచ్చు. మెలోడీ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. బిజిఎం కూఆ అలరించింది. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ కూడా అందాన్ని తెచ్చింది. కథ, కథనాలు దర్శకుడి ప్రతిభ కనబరిచాయి. కథనం ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండేది. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు.



యువ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కోసం చాలా కష్టపడ్డాడు. 3 ఏళ్లుగా సినిమాతో ట్రావెల్ అవుతున్న విజయ్ బాబి పాత్రలో అదరగొట్టాడు. అయితే దర్శకుడు రాసుకున్న కథ బాగున్నా దాన్ని చెప్పడంలో అక్కడక్కడ తడబడ్డాడు. సినిమా స్లోగా అనిపిస్తుంది.


అయితే సినిమాకు చేసిన ప్రమోషన్స్.. ఏర్పడిన బజ్ కచ్చితంగా ఆడియెన్స్ కు రీచ్ అవుతుంది. సినిమాలో లవ్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్లో అనిపించగా సెకండ్ హాఫ్ కాస్త బెటర్ గా ఉంటుంది. ఓవరాల్ గా విజయ్ సక్సెస్ మేనియా కొనసాగించేలా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా డియర్ కామ్రేడ్ మెప్పించింది.


సినిమాలో విజయ్, రష్మిక పెయిర్ వారి నటనకు మంచి మార్కులు పడతాయి. అయితే సినిమా తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు గాను కొన్ని డైలాగ్స్, సీన్స్ డబ్బింగ్ మూవీ ఫీల్ కలిగిస్తాయి. ఫైనల్ గా విజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టే లెక్క.



విజయ్ దేవరకొండ, రష్మిక మందన, శృతి రామచంద్రన్ విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'.. కామ్రేడ్ క్రేజీ లవ్ స్టోరీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: