ఇందులో నటించినవారంతా దాదాపు కొత్తవారే. ఆ గ్రామానికి చెందినవారే కావడం విశేషం. వారిని దర్శకుడు సరైన పాత్ర‌లు  ఇచ్చి తీర్చిదిద్ది వారినుంచి నటన రాబట్టుకోగలిగాడు. ముఖ్యంగా నిర్మాత బ్రహ్మానందరెడ్డి (గురునారాయణ) పాత్రలో మెప్పించాడు. బాడీలాంగ్వేజ్‌ కరెక్ట్‌గా సరిపోయింది. రవి పాత్ర పక్కా గ్రామంలోని కుర్రాడిలా వుంది. హీరోగా నటించిన హరీష్‌ వినయ్‌ బాగా నటించాడు . డ్యాన్స్‌ లతో పాటుగా ఫైట్స్‌ లలో కూడా రాణించాడు . తనిష్క్‌ రాజన్‌ ఆల్రెడీ పలు చిత్రాల్లో నటించింది. ఇందులో ప్రతీకారం కోసం రగిలిపోయే పాత్రలో కన్పిస్తుంది. రౌద్రాన్ని కూడా పండించింది. ఆమె అన్నగా గుణ పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా ఇందులో కీలకమైన పాత్ర పోషించాడు. ఇక హీరో ఫ్రెండ్స్‌గా నటరాజ్‌, నత్తి నరి హాస్యంతో మెప్పించారు. వారి నుంచి వచ్చిన ఎమోషన్స్‌ పర్వాలేదనిపించాయి.

న‌టీన‌టులుః హ‌రీష్‌విజ‌య్‌, త‌నీషా రాజ‌న్, బ్ర‌హ్మానంద‌రెడ్డి త‌దిత‌రులు న‌టించారు. సాంకేతిక నిపుణులుః ద‌ర్శ‌క‌త్వంః అనిల్ పి.జి.రాజ్, ఎడిటింగ్ఃజ‌న‌కిర‌మ్‌, ప్రొడ్యూస‌ర్ఃబ్ర‌హ్మానంద‌రెడ్డి, సంగీతంః సుభాష్ ఆనంద్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: