బెల్లంకొండ శ్రీనివాస్, విలన్, మ్యూజిక్, స్క్రీన్ ప్లేబెల్లంకొండ శ్రీనివాస్, విలన్, మ్యూజిక్, స్క్రీన్ ప్లేక్లైమాక్స్, లవ్ సీన్స్
డైరక్టర్ అవ్వాలని కలలు కన్న అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్) అనుకోకుండా ఎస్సై అవుతాడు. సైకో కిల్లర్ స్కూల్ పిల్లలను టార్గెట్ చేస్తుంటాడు. సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు అరుణ్ తన డైరక్షన్ టాలెంట్ చూపిస్తాడు. అరుణ్ ఆ కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు..?  అరుణ్ ఈ టాస్క్ ఎలా పూర్తి చేశాడు..? అన్నది సినిమా కథ.  



బెల్లంకొండ శ్రీనివాస్ అరుణ్ పాత్రలో అదరగొట్టాడు. ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో చాలా క్లవర్ గా నటించాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా చేసింది. శరవణన్ కూడా బాగా నటించాడు. రాజీవ్ కనకాల ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా నటించింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.



జిబ్రాన్ మ్యూజిక్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. రీ రికార్డింగ్ లో కూడా సినిమాకు ప్రాణం పోశాడు జిబ్రాన్. వెంకట్ సినిమాటోగ్రఫీ మెప్పించింది. కొన్ని సీన్స్ లో థ్రిల్ కలిగించేలా కెమెరా వర్క్ బాగుంది. అమర్ ఎడిటింగ్ ఓకే.. ఇంకొంత జాగ్రత్తపడితే బాగుండేది. రమేష్ వర్మ డైరక్షన్ ఓకే మాత్రుక సినిమాను మక్కీకి మక్కీ దించాడని చెప్పొచ్చు. టేకింగ్ పరంగా పర్వాలేదు అనిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



తమిళంలో ఆల్రెడీ హిట్టైన సినిమా రాక్షసుడు. ఆ సినిమానే తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ మనసు పెట్టి చేసిన సినిమా ఇదని చెప్పొచ్చు. మాత్రుక సినిమాకు ఏమాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కించారు. ఇక ఇన్నాళ్లకు తనకు సూటయ్యే పాత్ర చేశాడు బెల్లంకొండ హీరో. 


కథ, కథనాలు తమిళ సినిమాను డిటో దించారని అనిపించినా ప్రేక్షకులను మెప్పించేలా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కాస్త ముందే ఊహించే విధంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అయ్యింది. ఇంటర్వల్ సీన్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ సినిమాకు బలంగా ఉన్నాయి. రెగ్యులర్ సినిమా లవర్స్ కు ఎంత నచ్చుతుందో చెప్పలేం కాని థ్రిల్లర్ జానర్ సినిమాలను చూసే ఆడియెన్స్ కు రాక్షసుడు తప్పకుండా నచ్చుతుంది.


కోలీవుడ్ రాక్షసుడు సినిమా రీమేక్ గా వచ్చిన బెల్లంకొండ సినిమా ఆ సినిమాను చెడగొట్టలేదని చెప్పొచ్చు. అయితే తమిళంలో స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్ గా ఉంటుంది. తెలుగులో అది మిస్సయ్యింది. ఫైనల్ గా బెల్లంకొండ హీరో చెప్పినట్టుగానే సినిమా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. సమాజంలో జరుగుతున్న ఘోరాలను ఈ సినిమాలో ప్రస్థావించడం బలమని చెప్పొచ్చు. అయితే ఎంటర్టైన్మెంట్ ఆశించి వెళ్లే ఆడియెన్స్ కు నిరాశ కలుగుతుంది.



బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్, శ్రవణన్బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు'.. మెప్పించే ప్రయత్నమే కాని..!

మరింత సమాచారం తెలుసుకోండి: