నాగార్జున, వెన్నెల కిశోర్ కామెడీ, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్నాగార్జున, వెన్నెల కిశోర్ కామెడీ, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్డైరక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, అడల్ట్ కంటెంట్
పోర్చుగల్ లో ఉంటున్న సాంబ శివ రావు (నాగార్జున) పెళ్లికి దూరంగా ఉంటాడు. తన యంగ్ ఏజ్ లో ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్లు కాదన్నారని అమ్మాయిలను ప్రేమించకుండా అమ్మాయి కనిపిస్తే చాలు రాసలీలలు చేస్తాడు. అలాంటి టైంలో తన ఫ్యామిలీ పెడుతున్న ఇబ్బందిని భరించలేక అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్)ను తన లవర్ గా పరిచయం చేస్తాడు. సామ్ అలియాస్ సాంబ శివ రావు, అవంతిక ఇద్దరు ఓ అగ్రిమెంట్ మీదనే రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అయితే తన ఫ్యామిలీని మోసం చేసిన సాంబ చివరకు ఏం తెలుసుకున్నాడు..? సాంబ శివ రావు, అవంతికల రిలేషన్ కేవలం అగ్రిమెంట్స్ వరకే ఆగిందా..? ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.         



సాంబ శివ రావు పాత్రలో నాగార్జున అదరగొట్టాడు. తన లుక్స్ తో తానెప్పటికి మన్మథుడినే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు నాగార్జున. అయితే తానెంత పర్ఫెక్ట్ గా చేసినా కథ, కథనాల్లో దమ్ము లేకపోవడంతో నిరాశ చెందక తప్పదు. రకుల్ ప్రీత్ సింగ్ తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. తల్లి పాత్రలో సీనియర్ నటి లక్ష్మి ఎప్పటిలానే ఆకట్టుకుంది. డిడి, ఝాన్సి పాత్రలు జస్ట్ ఓకే అనిపించాయి. రావు రమేష్ పాత్ర అలరించింది. వెన్నెల కిశోర్ తన కామెడీతో మెప్పించాడు. 


సుకుమార్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. చేతన్ భరధ్వాజ్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. మన్మథుడు సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అవగా మన్మథుడు 2 ఆల్బం నిరాశపరచింది. సినిమా నుండి బయటకు వచ్చాక ఒక్కపాట గుర్తుండదు. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. కథ, కథనాల్లో దర్శకుడు రాహుల్ రవింద్రన్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.    



మన్మథుడు సినిమాకు సీక్వల్ గా కాకున్నా మన్మథుడు 2 అని టైటిల్ పెట్టగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. చిలసౌతో సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ రెండో సినిమానే నాగార్జునను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇది ఓ ఫ్రెంచ్ సినిమా కథ తీసుకున్నామని అన్నారు. కాని ఇదవరకు ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయనిపిస్తుంది.  


యంగ్ ఏజ్ లో ప్రేమ విఫలమైన హీరో ఇక ప్రేమించడం మానేసి కేవలం అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. పెళ్లి వయసు దాటాక ఇంట్లో వాళ్ల గోల భరించలేక వాళ్లను మేనేజ్ చేసేందుకు హీరోయిన్ తో ఒప్పందం ప్రకారం ప్రేమ, పెళ్లి అంటూ హంగమా చేస్తాడు. తెలుగు సినిమాల్లో ఇదవరకే వచ్చిన ఈ ఫార్ములా కథను మన్మథుడు 2 అంటూ కొత్తగా చెప్పాలని చూశారు. కాని అది వర్క్ అవుట్ కాలేదు.   


దర్శకుడు సినిమా అంతా రొటీన్ గా తెరకెక్కించాడు. మధ్య మధ్యలో వెన్నెల కిశోర్ కామెడీ మెప్పించినా సినిమాను గట్టెంక్కించడంలో ఉపయోగపడలేదు. సినిమాలో నాగార్జున లిప్ లాక్స్, రొమాన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇబ్బందిగా అనిపిస్తాయి. యూత్, అక్కినేని ఫ్యాన్స్ వరకు ఒకసారి చూసి ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. 



అక్కినేని నాగార్జున, రకూల్ ప్రీత్ సింగ్, సీనియర్ నటి లక్ష్మీ, వెన్నల కిషోర్నాగార్జున మన్మథుడు 2.. మెప్పించలేని ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: