నిర్మాణ విలువలు, సంపూ కామెడీనిర్మాణ విలువలు, సంపూ కామెడీఅక్కడక్కడా బోరింగ్ ఫీల్, కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్.
సంపూర్ణేష్ బాబు నటించిన ఏ సినిమా అయినా ముందు నుంచి భారీ అంచనాలు నెలకొల్పడం సహజం. ఇక కొబ్బరి మట్ట సినిమపై కూడా ట్రైలర్స్ తో కాస్త ఆసక్తి రేపారు. స్టోరీ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు..అంతా కామెడీ ట్రాక్ లో నడుస్తుంది. పాపారాయుడు(సంపూర్ణేష్ బాబు) ఊరికి పెద్దరికం చేస్తూ తీర్పులు చెబుతుంటారు..ఆయన చనిపోయే సమయంలో పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) కి బాధ్యతలు అప్పజెప్పిపోతాడు.


పెదరాయుడికి ముగ్గురు అన్నదమ్ములు, చెల్లెల్లు. అలాగే ముగ్గురు భార్యలు కూడా ఉంటారు.  సాఫీగా సాగిపోతున్న వీరి కుటుంబంలో ఆండ్రాయిడ్ (సంపూర్ణేష్ బాబు ) ఎంట్రీ ఇస్తాడు. అప్పటి నుంచి పెదరాయుడికి కష్టాలు.. అసలు ఈ ఆండ్రాయిడ్ ఎవరు..అతనికి రాయుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూసి తెలుసుకోవాలి.


కొబ్బరి మట్ట తెలుగు సినిమా విషయానికి వస్తే.. జీవితంలోని ప్రేమానురాగాలు, ఆప్యాయతలను ప్రధాైన అంశంగా కథ సాగుతుంది. ఇక సన్నివేశాలకు తగ్గట్టుగానే కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి.  ట్రైలర్ లో చూపించినట్లు సంపూర్ణేష్ డైలాగ్స్ కామెడీతో తెర మీద బ్రహ్మండంగా పేలిందని చెప్పవచ్చు. సంపూ కోసం రాసిన డైలాగ్స్ ఆలోచింప జేసే విధంగా కాకుండా హాస్యాన్ని పుట్టించడంతో సినిమా సరదాగా సాగిపోతుంది. 


ఇక రెండో భాగంలో ఆండ్రాయుడు పాత్ర, పాపారాయుడు పాత్రలు హైలెట్ గా ఉన్నాయి.  ఇక పాపారాయుడు ఫ్లాష్ బాక్.. క్లైమాక్స్  పేరడీ కడుపుబ్బా నవ్విస్తుంది.  దర్శకుడు సాయి రాజేష్ ఈ మూవీలో సంపూర్ణేష్ చేత పాపారాయుడు,పెద్ద రాయుడు,యాండ్రాయుడు అనే మూడు విభిన్న పాత్రలు చేయించి మంచి హాస్యాన్ని తెరపై పండించారు. 

ఈ మూవీ తక్కువ బడ్జెట్ లో అయినా హైలెట్ గానే తెరకెక్కించారు. సాంగ్స్, మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా  స్టీవ్ శంకర్ రాసిన డైలాగ్స్ తెరపై నవ్వులు పూయించాయి. ఇక మూడు పాత్రల్లో సంపూర్ణేష్ చాలా బాగా మెప్పించాడు..డైలాగ్స్ కేక. మూవీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.


మూవీ ప్రతి పదినిమిషాల వ్యవధిలో చక్కగా చొప్పించిన హాస్య సన్నివేశాలు ఆహ్లదం కలిగిస్తాయి. దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ మూవీ అక్కట్టుకొనేలా తీయడానికి చాలా ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. 

దర్శకుడు సాయి రాజేష్ ఈ మూవీలో సంపూర్ణేష్ చేత పాపారాయుడు,పెద్ద రాయుడు,యాండ్రాయుడు అనే మూడు విభిన్న  తెరపై అద్బుతంగా ఆవిష్కరించారు. ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉన్నా..కాస్త ఆలస్యంగా రిలీజ్ చేశారు..ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగానే తీర్చిదిద్దారు.


హీరో సంపూ మూడు విభిన్న పాత్రలలో అద్భుతంగా నటించిన చక్కని హాస్యం పంచారు.  తనదైన డైలాగులతో, డాన్స్ లతో, నటనతో సంపూ ప్రేక్షకులకు కావలసినంత హాస్యం పంచారు.  షకీలా డీసెంట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. ఇక మద్యలో కత్తిమహేష్ పై వచ్చే సెటైర్ థియేటర్లో వాళ్లందరినీ కడుపుబ్బా నవ్వించింది.

సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, శ్రీలేఖ, షకీలా‘కొబ్బరిమట్ట’తో సంపూ కడిగేశాడు

మరింత సమాచారం తెలుసుకోండి: