శర్వానంద్, కళ్యాణి, కాజల్ గ్లామర్, సినిమాటోగ్రఫీశర్వానంద్, కళ్యాణి, కాజల్ గ్లామర్, సినిమాటోగ్రఫీఫస్ట్ హాఫ్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్
చిన్న బిజినెస్ తో మొదలైన దేవా (శర్వానంద్) స్పెయిన్ లో గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. తను ఈ పొజిషన్ కు చేరుకునేందుకు ఎంత కష్టపడ్డాడు.. ఈ జర్నీలో తను ఎన్ని కోల్పోయాడో గుర్తు చేసుకుంటాడు. వయిలెన్స్, బ్లడ్ వీటితో తన గతం నిండి ఉంటుంది. గ్యాంగ్ స్టర్ గా ఉన్న దేవాకు శత్రువుల నుండి హాని ఉంటుంది. ఇంతకీ దేవా ఎలా ఎదిగాడు. అతని శత్రువులెవరు..? గతాన్ని తలచుకుంటూ ఉన్న దేవా జీవితం ఎలా సాగింది..? అతని శత్రువులను దేవా ఏం చేశాడు అన్నది సినిమా కథ.



శర్వానంద్ దేవా పాత్రలో నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో తను పర్ఫెక్ట్ గా నటించి మెప్పించాడు. కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ ల నటన బాగుంది. మురళి శర్మ, అజయ్, బ్రహ్మాజిలు సినిమాకు సపోర్ట్ చేశారు. సినిమాలో నటించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా మెప్పించారు.



ప్రశాంత్ పిల్లై మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అయితే సినిమాకు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు అతని కెమెరా వర్క్ హెల్ప్ అయ్యింది. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు కొత్తగా ఏం రాసుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.



గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన ఓ హీరో తన గతాన్ని గుర్తు చేసుకుని తన శత్రువులను టార్గెట్ చేయడం లాంటి కథలు చాలానే వచ్చాయి. శర్వానంద్ రణరంగం సినిమా కూడా అలాంటి కథతోనే వచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త ఎక్కువ ల్యాగ్ అయినట్టుగా ఉంటుంది సెకండ్ హాఫ్ మళ్లీ ఆడియెన్స్ ను మెప్పించేలా ఉందని అయ్యిందని చెప్పొచ్చు. సుధీర్ వర్మ టేకింగ్ బాగుంది.


శర్వానంద్ ను ఇలా రఫ్ లుక్ లో ఇదవరకు చూడలేదని చెప్పొచ్చు. దేవా పాత్రకు శర్వా చూపించిన అభినయం మెప్పించింది. అయితే సినిమా కథ, కథనాలు కొత్తగా అనిపించవు. సినిమా చూస్తున్నంత సేపు మదిలో చాలా సినిమాలు గుర్తుకొస్తాయి. ఫైనల్ గా శర్వానంద్ తో సుధీర్ వర్మ బెస్ట్ అవుట్ పుట్ ఇప్పించాడు. 


యూత్, యాక్షన్ సినిమాలు మెచ్చే ఆడియెన్స్ కు రణరంగం నచ్చుతుంది. సినిమాలో శర్వానంద్, కళ్యాణిల లవ్ సీన్స్ బాగున్నాయి. యాక్షన్ తో పాటుగా లవ్ అండ్ ఎమోషనల్ జర్నీగా రణరంగం జస్ట్ పాస్ మార్కులు వేసుకుందని చెప్పొచ్చు. అయితే క్లైమాక్స్ స్పీడ్ గా ముగించారనిపిస్తుంది.



శర్వానంద్, కళ్యాని ప్రియదర్శి,కాజల్ అగర్వాల్శర్వానంద్ రణరంగం... మెప్పించదగ్గ ప్రయత్నమే కాని..!

మరింత సమాచారం తెలుసుకోండి: