అడివి శేష్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అడివి శేష్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్, ప్రొడక్షన్
మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన సమీరా (రెజినా) ఓ కంపెనీలో పనిచేస్తుంది. అదే కంపెనీ బాస్ కు తను నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. సమీరా తన భర్తతో సంతోషంగా ఉండదు. తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ అశోక్ (నవీన్ చంద్ర)తో క్లోజ్ గా ఉంటుంది. ఇద్దరు కలిసి కునూర్ వెళ్తారు. అక్కడ సమీరాపై అత్యాచారం జరగడమే కాకుండా అశోక్ హత్య చేయబడతాడు. ఈ కేసు విచారించేందుకు కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ విక్రం వాసుదేవ్ (అడివి శేష్) వస్తాడు. విక్రం ఓ మిస్సింగ్ కేసుతో ఈ హత్య కేసుకి లింక్ ఉందని గుర్తిస్తాడు. ఇంతకీ సమీరాపై అత్యాచార ప్రయత్నం చేసింది ఎవరు..? అశోక్ ను హత్య చేసింది సమీరానా కాదా..? హంతకుడు ఎవరు అన్నది సినిమా కథ.           



విక్రం వాసుదేవ్ పాత్రలో అడివి శేష్ ఇంప్రెస్ చేశాడు. సినిమా సినిమాకు అడివి శేష్ తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. రెజినా కూడా సమీరా పాత్రలో మెప్పించింది. నవీన్ చంద్ర ఎప్పటిలానే బాగానే చేశాడు. మురళి శర్మ నటన బాగుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.



వంశీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో కెమెరా వర్క్ ఒకటి. శ్రీ చరణ్ బిజిఎం ఆకట్టుకుంది. వెంకట్ రాంజీ కథ, కథనాల్లో తన ప్రతిభ కనబరిచాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సినిమాలో డైలాగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది.



క్షణం, గూఢచారి సినిమాల సక్సెస్ తో అడివి శేష్ నుండి వచ్చిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎవరు. స్పానిష్ సినిమా మూల కథతో వచ్చిన ఎవరు సినిమా అనుకున్నట్టుగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అలరించింది. చెప్పదలచుకున్న కథను ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా దర్శకుడు వెంకట్ రాంజీ చెప్పాడు. సినిమాలో ఊహించని విధంగా ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తాయి.


అయితే ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్క్రీన్ ప్లే ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం గ్రిప్పింగ్ గా నడిపించాడు. కథ, కథనాలు సినిమాకు ప్రాణంగ నిలిచాయి. ప్రేక్షకులు ఒకటి ఊహిస్తే తెర మీద మరోటి జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ ట్విస్టులు సినిమాకు బలమని చెప్పొచ్చు.


రెగ్యులర్ సిని లవర్స్ తో పాటుగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఎవరు సినిమా బాగా నచ్చుతుంది. తన ప్రతి సినిమా మొదటి సినిమాగా చేస్తూ ఫుల్ ఎఫర్ట్ పెడుతున్న అడివి శేష్ ఖాతాలో మరో హిట్ పడినట్టే అని చెప్పొచ్చు. అయితే ఎంటర్టైనింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆశించే వారికి మాత్రం సినిమా రుచించదు.



అడవి శేషు, రెజీనా కసండ్ర, నవీన్ చంద్రఅడివి శేష్ 'ఎవరు'.. థ్రిల్ అవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: