కథ, కథనం, ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్, ఎమోషనల్ సీన్స్కథ, కథనం, ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్, ఎమోషనల్ సీన్స్తమిళ సినిమాకు దించేశారు, అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అవడం
రైతుగా జీవనం సాగిస్తున్న కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇండియా ఓడిపోతే అసలు తట్టుకోలేడు. తండ్రి తరచు క్రికెట్ చూడటం, ప్రస్థావించడం వల్ల కౌసల్య (ఐశ్వర్య రాజేష్) కూడా క్రికెట్ పై ఇష్టాన్ని పెంచుకుంటుంది. చిన్నతనం నుండి ఆ ఇష్టం పెరిగి పెద్దవడంతో ఇండియా తరపున ఆడి తండ్రికి ఆనందాన్ని ఇవ్వాలని అనుకుంటుంది. అయితే కృష్ణమూర్తి భార్య ఝాన్సి మాత్రం మగపిల్లలతో ఆటలను ఒప్పుకోదు. కౌసల్యను అడ్డుకుంటుంది. ఊళ్లో వాళ్లు కూడా కౌసలయను అనరాని మాటలు అంటారు. వాటన్నిటిని తట్టుకున్న కౌసల్య క్రికెటర్ గా ఎదగాలని అనుకుంటుంది.  ఇంతకీ కౌసల్య క్రికెటర్ అయ్యిందా లేదా..? ఆమె ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుందా లేదా..? గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఆమె ఎన్ని కష్టాలు పడ్డది..? అన్నది సినిమా కథ.



ఐశ్వర్య రాజేష్ కౌసల్యగా అందరిని మెప్పిస్తుంది. క్రికెటర్ గా ఆమె నటించిన విధానం ఆకట్టుకుంది. సినిమా అంతా కౌసల్య మీదే నడుస్తుంది. ఆమె తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. ఇక తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మరోసారి అదరగొట్టారు. సినిమాలో ఆయనకు మంచి పాత్ర లభించింది. తల్లి పాత్రలో ఝాన్సి కూడా మెప్పించారు. ఇక శివ కార్తికేయన్ కూడా గెస్ట్ రోల్ లో సర్ ప్రైజ్ చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.



ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. క్రికెట్ ఆడుతున్న టైంలో కెమెరా వర్క్ బాగుంది. ఇక దిబు నినాన్ థామస్ మ్యూజిక్ కూడా అలరించింది. తమిళ వర్షన్ లో సాంగ్స్ సూపర్ హిట్ అవగా తెలుగులో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేశారు. బిజిఎం ఇంప్రెస్ చేసింది. దర్శకుడు భీమనేని శ్రీనివాస్ తమిళ సినిమాను యాజిటీజ్ దించేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. రైతుల గురించి రాసుకున్న డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. 



సాధారణ రైతు కూతురు క్రికెటర్ అవ్వాలన్న కోరిక ఎలా తీర్చుకుంది అన్నది కౌసల్యా కృష్ణమూర్తి కథ. తమిళంలో కణ సూపర్ హిట్ అవగా అదే కథతో తెలుగు రీమేక్ గా వచ్చింది కౌసల్యా కృష్ణమూర్తి. మాత్రుకలో నటించిన ఐశ్వర్యా రాజేష్ తెలుగులో కూడా నటించడంతో ఈజీ అయ్యింది. ఇక తెలుగు రీమేక్ లో పెద్దగా మార్పులు ఏమి చేయలేదని చెప్పాలి.


తమిళ సినిమాను యాజిటీజ్ దించేశాడు భీమనేని శ్రీనివాస్. రీమేక్ స్పెషలిస్ట్ అయిన భీమనేని శ్రీనివాస్ కణకు తగిన న్యాయం చేశాడని చెప్పొచ్చు. ఓ పక్క కౌసల్య క్రికెటర్ అవ్వాలన్న మెయిన్ కథను చెబుతూనే రైతు కష్టాల గురించి కూడా టచ్ చేశాడు. మాత్రుక కథలోనే ఇలా ఉంది కాబట్టి తెలుగులో కూడా దనని కొనసాగించారు.


కౌసల్యా కృష్ణమూర్తికి మెయిన్ హైలెట్ కథే. దాన్ని దర్శకుడు తెరకెక్కించిన తీరు కూడా చాలా బాగుంది. శివ కార్తికేయన్ ఉన్న కొద్దిసేపు అయినా సినిమాకు వెయిట్ ఇచ్చే పాత్ర చేశాడు. అతని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ గా కౌసల్యా కృష్ణమూర్తి అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు సినిమా నచ్చుతుంది.



డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీకేయర్, కార్తీక్ రాజకౌసల్యా కృష్ణమూర్తి.. చూడదగిన సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: