రాహుల్ రవీంద్రన్ నటన,ఫస్ట్ హాఫ్రాహుల్ రవీంద్రన్ నటన,ఫస్ట్ హాఫ్సెకండాఫ్,హీరోయిన్,ఓవర్ సెంటిమెంట్ డోస్,ఎడిటింగ్ స్వప్న(తన్వి వ్యాస్) ఓ ఉమ్మడి కుటుంబంలో పుట్టడం మరియు వారితోనే పెరగడం వల్ల చిన్ననాటి నుంచి తను చేయాలనుకున్న ఏ పని చేయలక పోవడమే కాకుండా తన స్వేచ్చని కోల్పోతుంటుంది. దాంతో ఎలాగో తన తండ్రిని ఒప్పించి పై చదువుల కోసం స్వీడన్ చేక్కేస్తుంది. స్వీడన్ లో రోజుకో పని చేసుకుంటూ తనకి ఇష్ట మోచ్చినట్టు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండే క్రిష్(రాహుల్ రవీంద్రన్) తో పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. పరిచయం ప్రేమగా మారే టైం లో స్వప్నతో పాటు క్రిష్ కూడా ఇండియాకి వస్తాడు. అక్కడ స్వప్న ఫ్యామిలీతో క్రిష్ కి గొడవ అవుతుంది. ఆ తర్వాత క్రిష్ కి తన ఫ్యామిలీ గురంచి తెలుస్తుంది. అప్పుడు క్రిష్ అన్నిటినీ పక్కన పెట్టి తన ఫ్యామిలీని రక్షంచుకోవడం కోసం కొన్ని కష్టాలు పడుతూ ఉంటాడు. అప్పుడే క్రిష్ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు ఏమిటి? క్రిష్ ఫ్యామిలీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? చివరికన్నా క్రిష్ - స్వప్న కలిసారా? లేదా? అనేది మీరు వెండితెరపైనే చూడాలి.

సినిమా సినిమాకి రాహుల్ రవీంద్రన్ నటన కాస్త మెరుగవుతోంది. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో బాగా చేసాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ బాగా చేసాడు. అలాగే ఈ సినిమాలో రాహుల్ నటనే సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. సుమన్, శరత్ బాబు, ఆమని, రఘుబాబు లాంటి సీనియర్ నటులు వారి పరిధిమేర నటించారు. తాగుబోతు రమేష్ రెండు నిమిషాలున్నా బాగానే నవ్విస్తాడు. ఎల్బీ శ్రీరాం సినిమాలో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు అది కూడా ప్రాసతో, ఆ బట్లర్ ఇంగ్లీష్ ప్రాస కామెడీ వరకూ ఓకే, కానీ అదే బట్లర్ ఇంగ్లీష్ ప్రాసతోనే సెంటిమెంట్ సీన్స్ కూడా చేయించాలని డైరెక్టర్ కి ఎందుకు అనిపించిందో గానీ అవి ఆడియన్స్ కి డోకు తెప్పించేలా ఉన్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైంది. కానీ హీరోయిన్ కోసం మాత్రం సరైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోలేదు. తన్వీ వ్యాస్ పాత్రకి కేవలం 10% మాత్రమే న్యాయం చేసింది. మిగిలిన 90 % అన్యాయం చేసింది. కొన్ని చోట్ల హావ భావాలు దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల లిప్ సింక్ సరిగా లేదు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే కొన్ని సీన్స్ లో పక్కన హీరోయిన్ ఎక్కడుండా అని వెతుక్కోవాలి. ఎందుకంటే హీరో పక్కన చాలా ఎక్కువ వయసు కలిగిన అమ్మాయిలా కనిపిస్తుంది.

సినిమా సినిమాటోగ్రఫీ బాగుంది. టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో సినిమాటోగ్రాఫర్ ఏమీ అనలేం. అలాగే ఎంఎం శ్రీలేఖ తన వంతు కృషి తానూ చేసి మ్యూజిక్ పరంగా సినిమాకి హెల్ప్ చేసింది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ మాత్రం డే టైం లో చేసి సెకండాఫ్ ని మాత్రం నైట్ టైం లో చేసినట్టు ఉన్నాడు. ఎడిట్ చేయకుండా నిద్రపోయారేమో సెకండాఫ్ బాగా సాగదీశారు, అలాగే అనవసరమైన అలీ - వేణు మాధవ్ కామెడీ ట్రాక్ ని అలానే ఉంచేయడమే ఆయన పనితనానికి గుర్తింపు.

రామానాయుడు గారి నిర్మాణ విలువలు బాగున్నాయి. రమణి కథని సెలెక్ట్ చేసుకున్న రామానాయుడు సరైన డైరెక్టర్ ని మాత్రం సెలెక్ట్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ఇలాంటి జోనర్ సినిమాలు సునీల్ కుమార్ రెడ్డి కి సెట్ అవ్వవు కానీ ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. సరే సెలక్ట్ చేసుకున్న దానికోసం కష్టపడి ఫస్ట్ హాఫ్ కి న్యాయం చేసాడు కానీ కీలకమైన సెకండాఫ్ ని మాత్రం హుస్సేన్ సాగర్ లో ముంచేసాడు. దాంతో ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఫీలింగ్ కూడా దొబ్బింది.

సునీల్ కుమార్ రెడ్డి అంటేనే అవార్డు సినిమా డైరెక్టర్ ఆయన్ని తీసుకొచ్చి కృష్ణ వంశీ లాంటి సినిమా తీయమంటే ఇలానే ఉంటుంది, ఆయనకి వచ్చింది చెయ్యలేడు ఇటు రానిది చెయ్యలేక అయన పడిన కష్టం తెర మీద కనపడిపోతుంది. ఫస్ట్ హాఫ్ సినిమాలా తీసి సెకండ్ హాఫ్ మాత్రం సీరియల్ లా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో కాని బలయిపోయింది మాత్రం ప్రేక్షకుడు. రామానాయుడు గారి సినిమా అనగానే ఎంతో కొంత ఆశించి వచ్చే సగటు ప్రేక్షకుడు నిరాశ చెందడం మాత్రం ఖాయం. ఈ చిత్రంలో కథానాయిక కథానాయకుడి కన్నా పెద్దది ఈ విషయం చాలా చోట్ల బయటపడిపోతుంది. సునీల్ కుమార్ రెడ్డి గారి చేత ఇలాంటి సినిమా తీయించాలి అన్న ఆలోచన అసలు బాగోలేదు. ఈ చిత్రం గురించి ఇంతకన్నా ఎక్కువ విశ్లేషించలేము, ఈ సినిమాతో ఈ వీకెండ్ వచ్చిన అన్ని సినిమాలు వీక్ అని తెలిసిపోయింది . ఈ చిత్రం చూడటం కన్నా ఇంట్లో సీరియల్స్ చూసుకోడం బెటర్.Balabhadrapatruni,Ramani,D. Ramanaidu,P. Sunil Kumar Reddyనేనేం చిన్నపిల్లనా..? - సినిమా కాదిది సీరియల్

మరింత సమాచారం తెలుసుకోండి: