మహేష్ బాబు నటన ,రత్నవేలు సినిమాటోగ్రఫీ,దేవి శ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం మహేష్ బాబు నటన ,రత్నవేలు సినిమాటోగ్రఫీ,దేవి శ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం చాలా పొడవయిన చిత్రం (దాదాపుగా మూడు గంటలు),రెండవ అర్ధ భాగం బాగా నెమ్మదిస్తుంది. ఎటు వైపు వెళ్తుందో కూడా అర్ధం కాని నేరేషన్ ,అవసరం లేని పొడవయిన చేజ్ లు..

తల్లిదండ్రులను ఒక ప్రమాదంలో కోల్పోయిన గౌతం(మహేష్ బాబు) నిజానికి, అబద్దానికి మధ్య తేడా తెలుసుకోలేని మానసిక వ్యాదితో బాధ పడుతూ ఉంటారు. ఆ వ్యాధి కారణంగా అతను మూడు హత్యలు చేసానని పోలీస్ లకి లొంగిపోతాడు. అప్పుడు గౌతం ఆ హత్యలు చెయ్యలేదు అది అతని మానసిక వ్యాధి వలన అల అనుకుంటున్నాడని నిరూపిస్తుంది న్యూస్ యాంకర్ సమీర(కృతి సనన్), పరిచయం అయిన దగ్గర నుండి గౌతంని ప్రేమలో పడేయాలని ప్రయత్నిస్తుంటుంది సమీర ఇదిలా నడుస్తుండగా నిజానికి అబద్దానికి తేడా తెలుసుకోలేని గౌతం తన తల్లిదండ్రులను హత్య చేసారని నమ్మి అసలు తన అమ్మ నాన్న ఎవరు అని వెతకడానికి బయలుదేరతాడు, ఈలోపు అతని పై హత్య ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాని అది అతని పై కాదని సమీర పై అని తెలుసుకున్న గౌతం సమీర ను రక్షించే ప్రయత్నం చేస్తాడు , ఈలోపు తన తల్లిదండ్రులను చంపినా వాడు లండన్ లో ఉంటాడు అని తెలుసుకున్న గౌతం లండన్ ప్రయాణం అవుతాడు . అసలు సమీరని ఎందుకు చంపాలనుకున్నారు? ఎవరు చంపాలి అనుకున్నారు? గౌతం గతం అబద్దమా? నిజమా? అసలు గౌతం తల్లిదండ్రులు ఎవరు? అన్న ప్రశ్నలకి సమాధానాలు తెర మీద తెలుసుకోండి...

మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఒక్కడు నుండి అయన నటనకు ఆయనే మైలురాళ్ళు పెట్టుకుంటూ వాటిని ఆయనే అధిగమిస్తూ వచ్చారు. దూకుడు మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలలో సరదాగా కనిపించిన మహేష్ బాబు ఈ చిత్రంలో బాగా ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో కనిపించాడు. ఇలాంటి పాత్రలు ఇతని కోసమే రాస్తారేమో అన్నట్టు అయన నటించారు. కథలో ఉన్న ఇంటెన్సిటీ ని చివరి వరకు అయన నటనతో ఎక్కడ మిస్ అవ్వకుండా చేసారు. కృతి సనన్ తన అందంతో బాగానే ఆకట్టుకుంది మొదటి చిత్రం అయిన తడబడకుండా నటించి తన భవిష్యత్తుకి రోడ్ బాగానే వేసుకుంది కాని కృతి సనన్ పాత్రకి బలం లేకపోయింది. పోసాని కృష్ణ మురళి , నాజర్ , ప్రదీప్ రావత్ , సాయాజీ షిండే , కెల్లీ దోర్జీ మొదలగునవారు అలా తెర మీద కనపడి వెళ్ళిపోయారు.

కథ విషయంలో సుకుమార్ వినూత్న పాయింట్ ని ఎంచుకున్నాడు కాని కథనం విషయం వచ్చేసరికి చాల దారుణంగా విఫలం అయ్యాడు ఫస్ట్ హాఫ్ ఏదో అలా గడిచిపోయినా రెండవ అర్ధ భాగం వచ్చేసరికి కథ అసలు ముందుకు సాగదు అందులోనూ పొడవయిన చేజ్ లు అనవసరంగా వచ్చి చిరాకు పెట్టించాయి. దర్శకుడిగా సుకుమార్ టేకింగ్ బాగున్నా కథనం వీక్ అయ్యేసరికి దర్శకత్వం ఎఫెక్ట్ పెద్ద్డగా కనపడదు. రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీ ఇప్పటి వరకు తెలుగు తెర మీద ఇంత క్వాలిటీ చూడలేదు. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన వైనం, లండన్ మరియు గోవా అందాలను తెలుగు తెర మీద చాలా అద్భుతంగా ఆవిష్కరించడంలో విజయం సాదించారు. దేవిశ్రీ అందించిన సంగీతం వినడానికి చాలా బాగున్నాయి అలానే తెర మీద కూడా అందంగా చూపించారు. అయన అందించిన నేపధ్య సంగీతం సన్నివేశాలకు చాలా తోడ్పడింది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్ర నిర్మాణ విలువలు గురించి చెప్పాలంటే ఆడియో వేదిక మీద మహేష్ బాబు అన్నట్టు అవసరం అయిన దానికన్నా ఎక్కువగానే ఖర్చు పెట్టారు అదే సమయంలో వారు పెట్టిన ఖర్చు మొత్తం తెర మీద క్వాలిటీ రూపంలో కనిపిస్తూనే ఉంటుంది..

సుకుమార్ వంటి దర్శకుడు మాస్ చిత్రం చేస్తే మా పరిస్థితులు గల్లంతు అయిపోతుంది, ఒకానొక వేదిక మీద రాజమౌళి అన్నమాటలు ఇవి, అయన అన్నట్టుగానే సుకుమార్ తెరకెక్కించిన మొదటి "మాస్ ఎంటర్ టైనర్" ఈ చిత్రం. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉన్న ఈ చిత్రంలో కంటెంట్ పరంగా చాలా లోపాలు ఉన్నాయి. మొదటి అర్ధ భాగం ఏదో పరవాలేదు అనిపించినా రెండవ అర్ధ భాగంలో బాగా నెమ్మదించింది. చిత్ర నిడివి కూడద దాదాపుగా మూడు గంటలు ఉండటం, ఎంటర్ టైన్మెంట్ లేకుండా ఇంతసేపు ప్రేక్షకుడిని కూర్చోపెట్టడం నిజంగా సహనానికి పరీక్ష వంటిదే. అసలు హీరోకి ఒక గమ్యం ఉండాలి అది హీరోకి అయినా తెలియాలి లేదా ప్రేక్షకుడికి అయినా తెలియాలి, ఇద్దరికీ తెలియకుండా సన్నివేశాలను రాసుకుంటూ పోతే చిత్రానికి గమ్యం లేకుండా పోతుంది. ఈ చిత్రంలో అదే జరిగింది.

ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో వెళ్లి ఎక్కడో ముగుస్తుంది. అనుకున్న పాయింట్ చాలా బాగుంది కాదనలేదు కాని ఆ పాయింట్ ని చెప్పే విధానం అసలు బాగోలేదు. సగటు ప్ప్రేక్షకుడికి ఈ చిత్రం అర్ధం కాదు ఈ చిత్రం ఏ మాత్రం అర్ధం అయినా తరువాత వచ్చే సన్నివేశాన్ని పసిగట్టేయచ్చు. సుకుమార్ గారి తెలివితేటలు కొన్ని సన్నివేశాలలో బాగానే ఉన్నాయి కాని చాలా వరకు సన్నివేశాలలో అయన "తిక్క" చూపెట్టారు. మహేష్ బాబు నటన , వైవిధ్యమయిన కథ , రత్నవేలు సినిమాటోగ్రఫీ మరియు దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం ఇవన్ని ఈ చిత్రంలో బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి .. కొత్తగా ప్రయత్నించాడు అన్న ఒక్క విషయం మూలాన ఈ చిత్రాన్ని ఒక్కసారి "ఓపిక" బిగపట్టుకొని చూడవచ్చు..

Mahesh Babu,Kriti Sanon,Sukumar,Ram Achanta,Gopichand Achanta,Anil Sunkara,Devi Sri Prasadమహేష్ బాబు దూకుడు కి బ్రేక్ ఈ చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: