సంపూర్ణేష్ బాబు ఏం చేసినా హైలెట్ లానే అనిపించింది,నేపధ్య సంగీతం,సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ సంపూర్ణేష్ బాబు ఏం చేసినా హైలెట్ లానే అనిపించింది,నేపధ్య సంగీతం,సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ బలమయిన పాయింట్ లేకపోవడం,రెండవ అర్ధ భాగం బాగా నెమ్మదించడం,పాటలు

సిటీలో చాలా దొంగతనాలు జరుగుతుంటాయి అవి ఎవరు? ఎందుకు? చేస్తున్నారనేది చేధించడం కోసం పోలీసులు ప్రయత్నిస్తుంటారు. ఆ దొంగే మన హీరో సంపూర్ణేష్ బాబు(సంపూర్ణేష్ బాబు). ఈ సంపూర్ణేష్ బాబుని పట్టుకోవడానికి ఓ స్పెషల్ టీం రంగంలోకి దిగుతుంది. ఎట్టకేలకు ఎంతో కష్టపడి ఆ టీం సంపూని పట్టుకుంటుంది. అలా పట్టుకున్న సంపూర్ణేష్ బాబుని పోలీసులు అసలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించడంతో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అసలు సంపూ బాబు ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అసలు సంపూ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే..

సంపూర్ణేష్ బాబు చూడటానికి హీరోలా ఉండడు నటన కూడా అంతంతమాత్రమే కాని ఇవే ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ అయ్యాయి. ఒకానొక సమయంలో సంపూర్ణేష్ ఎం చేసినా కామెడీ నే అన్న స్థాయికి చేరుకుంది చిత్రం. ఇక కథానాయికగా నటించిన కావ్య కుమార్ నటన నేర్చుకొని తెరంగేట్రం చేసి ఉంటె చాలా బాగుండేది. చాలా సన్నివేశాలలో నేను ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అన్న ప్రశ్నార్ధక మొహం పెట్టుకొని బిత్తర చూపులు చూసింది. ఇక ఇషిక సింగ్ పాత్ర పెద్దగా బలమయినది కాదు దానికి తగ్గట్టుగానే ఆమె నటన కూడా బలహీనంగానే ఉంది. మహేష్ కత్తి పోషించిన పాత్ర అయన చెప్పిన డైలాగ్స్ కొన్ని చోట్ల బాగానే పేలినా చాలా చోట్ల బోర్ కొట్టించేసింది. మిగిలిన అన్ని పాత్రలు సంపూర్ణేష్ బాబు పాత్ర నీడలో కలిసిపోయినవే...

దర్శకుడు స్టీవెన్ శంకర్ కథాపరంగా వినూత్నంగా ఎంచుకున్నారు అదే సమయంలో అయన రాసుకున్న కథనం కూడా చాలా వినూత్నంగా ఉండటం చిత్రాన్ని వేగంగా కదిలించడంలో చాలా సహాయపడింది . కాని మొదటి అర్ధ భాగం ఉన్నంత వేగం రెండవ అర్ధ భాగంలో ఉండదు. చివరికి వచ్చేసరికి చిత్రం మళ్ళీ వేగాన్ని అందిపుచ్చుకోగలిగింది డైలాగ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ ప్రాస కోసం ప్రాకులాడకుండా బూతు మరియు ద్వందార్ధాలు జోలికి పోకుండా కామెడీ పండించడంలో ఈ డైలాగ్స్ బాగా హెల్ప్ అయ్యాయి . సినిమాటోగ్రఫీ చాలా బాగుంది చిన్న సినిమానే అయినా రిచ్ గా కనిపించడంలో ఈ విభాగం పాత్ర కీలకం . సంగీతం విషయంలో పాటలు పరవలేధనిపించినా నేపధ్య సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ ఇక ఎడిటింగ్ విభాగం మొదటి అర్ధ భాగంలో పరవాలేదు అనిపించినా రెండవ అర్ధ భాగం వచ్చేసరికి తేలిపోయింది చాలా సన్నివేశాలను ఇంకాస్త పదునుగా కత్తిరించి ఉండవచ్చు . కోరియోగ్రఫీ కూడా కామెడీ లో కలిసి కాసేపు నవ్వించింది . ఇటువంటి చిత్రాన్ని నమ్మి నిర్మించాలంటే చాలా ధైర్యం కావాలి ఆ విషయంలో నిర్మాతలు నూటికి నోరు మార్కులు సంపాదించుకున్నారు.

స్టార్ అవ్వాలంటే వారసత్వం అవసరం లేదు అని ఎంతోమంది నిరూపించారు కాని టాలీవుడ్ లో మొదటిసారిగా అందం ఆహార్యంతో అవసరం లేకుండా కూడా స్టార్ అవ్వగలం అని నిరూపించాడు "బర్నింగ్ స్టార్" సంపూర్ణేష్ బాబు. సినిమా మొదలయిన దగ్గర నుండి కూడా కొత్తగా ఏదో చెయ్యాలన్న ప్రయత్నం కనిపిస్తుంది ఈ చిత్రంలో. చాలా రకాల కామెడీ చిత్రాలను చూసుంటారు కాని వాటన్నింటికీ విభిన్నంగా ఉంటుంది ఈ చిత్రంలో కామెడీ . సన్నివేశాలు సీరియస్ గా నడుస్తున్నా కామెడీ బాగా పండేలా చెయ్యడంలో స్టీవెన్ శంకర్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు . బూతు కామెడీ లేదా పేరడీ లేదా స్పూఫ్ లు లాంటి వాటి మీద ఆధారపడకుండా పూర్తిగా 'వెటకారం' మీదనే చిత్రాన్ని తెరకెక్కించ గలగటం కొత్త రకమయిన కథనానికి నాంది పలికింది . డైలాగ్స్ మరియు నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

మొదటి అర్ధ భాగం చాలా వేగంగా గడిచిపోయినా రెండవ అర్ధ భాగం చాలా నెమ్మదించింది పదే పదే డైలాగ్స్ కోసమే రాసుకున్న సన్నివేశాలతో కాస్త చిరాకు పెడుతుంది. నిజానికి ఈ చిత్రం మొదటి అర్ధ భాగంలో ప్రతీది కామెడీ అయ్యింది సంపూర్ణేష్ బాబు డాన్సు చేసినా డైలాగ్స్ చెప్పినా ఆఖరికి సెంటిమెంట్ సన్నివేశం అయినా ప్రేక్షకుడిని నవ్వించింది అదే రెండవ అర్ధ భాగంలో రొమాంటిక్ మరియు సెంటిమెంట్ ని కలిపి నవ్వించడానికి ప్రయత్నించిన దర్శకుడు ఆ విషయంలో విఫలం అయ్యాడు. ఆశ్చర్య కరంగా చివర్లో సన్నివేశాలు చాలా ఫన్నిగా నడుస్తున్నా అంతర్లీనంగా సెంటిమెంట్ నడపడం దర్శకుడి ప్రతిభకు తార్కాణం... ఇటు నవ్వుతూనే ఉన్నా ఆ పాత్ర మీద జాలి కలిగించ గలిగాడు దర్శకుడు... భారతేదేశం లో ఉత్పత్తి చేసిన వస్తువులనే కొనుగోలు చెయ్యండి అన్న మెసేజ్ కూడా అంతర్లీనంగా చెప్పగలిగాడు దర్శకుడు.. మొదటి అర్ధ భాగం కామెడీ బాగానే ఉన్నా రెండవ అర్ధ భాగంలో కామెడీ తగ్గడం తో ప్రేక్షకుడు విసుగు చెందుతాడు ... ఒక విభిన్న కామెడీ చిత్రం చూడాలనుకుంటే ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడాల్సిందే...

Sampoornesh Babu,Steven Sankar,Ishika Singh,Sai Rajesh Neelam.హృదయ కాలేయం - ఫస్ట్ హాఫ్ హృదయం సెకండ్ హాఫ్ ఖాళీయం ..

మరింత సమాచారం తెలుసుకోండి: