Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 11:08 am IST

Menu &Sections

Search

గ్రీన్ సిగ్నల్ : రివ్యూ

- 0.5/5
గ్రీన్ సిగ్నల్ : రివ్యూ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • మానస్ - శిల్పి శర్మ - డింపుల్ చోప్డే ట్రాక్

చెడు

  • కథనం
  • నెమ్మదిగా సాగే నేరేషన్
  • అనవసరమయిన గే సన్నివేశాలు
  • ఎడిటింగ్
  • కొన్ని అనవసర పాత్రలు
ఒక్క మాటలో: గ్రీన్ సిగ్నల్ - బాడ్ సిగ్నల్ ..

చిత్ర కథ

ఈ చిత్రం నలుగురు బాచిలర్స్ (మానస్, రేవంత్,అశుతోష్ మరియు గోపాల సాయి) గురించిన కథ వీరందరు ఒకే రూమ్ లో అద్దెకు ఉంటారు. ముందుగా గూగుల్ , స్వీటీ(మనాలి శర్మ) తో ప్రేమలో పడతాడు కాని స్వీటీ మాత్రం తన అవసరాల కోసం గూగుల్ ను ఉపయోగించుకుంటూ ఉంటుంది. సందీప్ కుమార్ , దేవిక(శిల్పి శర్మ) తో ప్రేమలో పడతాడు కాని అతను సామాజిక కార్యకర్త మీరా(డింపుల్ చోప్డే) ని చూడగానే తనని కూడా ప్రేమించడం మొదలు పెడతాడు దీంతో అతనికి దేవికకి మధ్య ఉన్న బంధానికి బీటలు ఏర్పడుతుంది. నాయుడు(రేవంత్) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుకోకుండా ఇతడు జెస్సి(రక్షిత) ను కలుస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. నాయుడు అద్దె ఇంటిని వదిలి జెస్సి తో సహా జీవనం సాగిస్తూ ఉంటాడు. కాని ఇలా సాగుతుండగానే వీరి మధ్యన మనస్పర్ధలు వస్తాయి. ఇక ప్రేమ్(అశుతోష్) ఒక స్వలింగ సంపర్కుడు, ఇతనికి మరియు లీన( చంద్ర) మధ్య బంధం ఏర్పడుతుంది ఇక్కడ నుండి అసలు వీరి మధ్య జరిగిన కథలు ఏంటి ఎవరి ప్రేమను ఎవరు అర్ధం చేసుకున్నారు చివరికి ఏ ప్రేమ కథ గెలిచింది లాంటివి తెర మీద చూడవలసిందే...

నటీనటుల ప్రతిభ

మానస్ నటన చిత్రం లోని అందరి అబ్బాయిలలో బాగుంది చాలా సహజంగా నటించారు. శిల్పి శర్మ ఉన్నంతసేపు మనసుకి హాయిగా ఉండేది ఆమె అంత అందంగా ఉంది. అలానే డింపుల్ చోప్డే కూడా తన అందంతో మరియు అభినయంతో ఆకట్టుకుంది. నాయుడు పరవాలేదనిపించాడు కాని అతను బాధను బయటపెట్టే సన్నివేశంలో అతను చాలా యావరేజ్ గా నటించాడు ఈ సన్నివేశానికి ఒరిజినల్ లో ఉన్నంత ఇంపాక్ట్ ఈ సన్నివేశంలో ఉండదు. రక్షిత అలా తెర మీద కనిపించింది కాని ఆకట్టుకోలేదు. మనాలి రాథోడ్ హీరోయిన్ లా ఒక్క సన్నివేశంలో కూడా అనిపించలేదు, అశుతోష్ మరియు చంద్ర వారి పాత్రల మూలాన తేలిపోయారు. శ్రవ్య రెడ్డి మరియు మధురిమ తెర మీద తళుక్కుమని మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు

గ్రీన్ సిగ్నల్ అనే చిత్రం మూల కథ బాలీవుడ్ చిత్రాలు "ప్యార్ క పంచనామా" మరియు " దిల్ తో బచ్చా హాయ్ జీ" అనే చిత్రాల ఆధారంగా రాసుకుంది. కథనం విషయానికి వస్తే కామెడి కోసం చాలా ప్రయత్నించారు కాని సరిగ్గా కుదరలేదు. కథ చెప్పే వేగం శూన్యం అని చెప్పుకోవచ్చు. చిత్రం ఆసాంతం వేగం ఇంకా తగ్గుతుందే కాని ఎక్కడా పెరిగినట్టు అనిపించదు. విజయ్ మదాల చిత్ర కథను చెప్పడం మొదలు పెట్టడానికి గంటకు పైగా తీసుకున్నారు ఇంకా దాన్ని సరిగ్గా ముగించదానికి ఇంకా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇది మారుతీ బ్రాండ్ చిత్రం ఇందులో గొప్ప ట్విస్ట్ లు ఉండవు చివర్లో వచ్చే ఒక్క ట్విస్ట్ తప్ప కాని చిత్రం ఆసాంతం వినోదంతో నింపాలి అన్న ప్రయాస కనిపిస్తుంటుంది. ఈ చిత్రంలో వచ్చే గే సన్నివేశాలు చాలా దారుణంగా ఉన్నాయి ఇంత దారుణమయిన సన్నివేశాలు గతంలో ఎప్పుడు చూడలేదు అనడంలో ఆశ్చర్యం లేదు. సంగీతం అందించిన జేబీ పాటలు పరవాలేదనిపించాడు కాని నేపధ్య సంగీతం విషయంలో పూర్తిగా విఫలం అయ్యాడు. ఇక ఎడిటింగ్ నుండి తప్పించుకు వచ్చిన సన్నివేశాలు కోకొల్లలు.. స్వామి సినిమాటోగ్రఫీ పరవాలేదు , ఎసేల్ వి సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చిత్ర విశ్లేషణ

మారుతీ , చిన్న దర్శకులను ప్రోత్సాహిస్తున్నందుకు అభినందించాలా లేక ఇలాంటి చిత్రాలను తెర మీదకు తీసుకోస్తున్నందుకు అయన శైలి లో నే బూతులు తిట్టాలా అనేది అర్ధం కావట్లేదు. దర్శకుడు విజయ్ మద్ద్దాల చిత్రం మొదలయ్యి గంట అయినా అనవసరమయిన కామెడీ సన్నివేశాలతో సమయం గడిపేస్తున్నాడు కాని కథలోకి రాడేంటి అనుకుంటున్న వాళ్ళ చేత కథ మొదలవగానే ఇదేదో హిందీ చిత్రంలా ఉండే అనిపించేసాడు. ఒకప్పుడు సోషల్ మీడియా లో బాగా ప్రాచుర్యం పొందిన ప్యార్ కా పంచనామా చిత్ర సన్నివేశాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాడు పోనీ అది అయినా బాగుందా అంటే అంతంతమాత్రమే, చిత్రంలో మానస్ మరియు శిల్పి శర్మ ట్రాక్ చాలా బాగుంది ఎందుకంటే ఈ ట్రాక్ లో శిల్పి శర్మ చాలా అందంగా ఉంది కాబట్టి, ఈ చిత్రంలో బాగుంది అని చెప్పుకోడానికి ఈ ట్రాక్ ఒక్కటే ఉంది మానస్ నటన మరియు శిల్పి శర్మ అందాలు ఈ ట్రాక్ ని కాపాడి చిత్రానికి సహాయపడటానికి ప్రయత్నించాయి. ఇవి కాకుండా చిత్రంలో మరొక విషయం ఆకట్టుకోదు. ఇంకా ఆ గే కామెడీ సన్నివేశాలు న "బూతు" న భవిష్యత్తు లా ఉన్నాయి. అంటే బూతు అయినా చూడగలం కాని భవిష్యత్తులో ఇలాంటివి చూడలేము అని దాని సారాంశం. ఈ చిత్రాన్ని సరిగ్గా రాసుకొని ఉంటె చాలా బాగుండేది ఎందుకంటే రెండు హిట్ చిత్రాలను కలిపి రచించారు కదా కాని దర్శకుడు గే సన్నివేశాల మీద పెట్టిన శ్రద్ధ చిత్రం ఆసాంతం మీద పెట్టినట్టు అనిపించదు. చిత్రాన్ని చాలా వరకు కట్టిరిస్త్తే చాలా బాగుండేది. హిందీ చిత్రాలను తీసుకోవడం కాకుండా స్వంత ఆలోచనలను పొందుపరిచి ఉంటె విజయ్ కి ఇది మంచి ఆరంగేట్రం అయ్యుండేది. మీరు పరిగెత్తుకు వెళ్లి చూడవలసిన చిత్రం అయితే కాదు ఈ వీకెండ్ ఏ పని లేక బయట వేడిగా ఉంది అంటే ఏసి ఉన్న థియేటర్ చూసుకొని వెళ్ళిపొండి...

కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 907
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all