డైలాగ్స్ , కాన్సెప్ట్ , నారా రోహిత్ , తక్కువ నిడివి ఉండటం డైలాగ్స్ , కాన్సెప్ట్ , నారా రోహిత్ , తక్కువ నిడివి ఉండటం నేరేషన్ , శుభ్ర అయ్యప్ప , నెమ్మదిగా సాగిన మొదటి అర్ధ భాగం , లాజిక్ లేకపోవడం .

"పోరాడేవాడు యోధుడు అయితే యుద్ధం అంటారు, అదే పౌరుడు అయితే "ప్రతినిధి" అంటారు", ఈ సందేశాన్ని ప్రధానాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక వృద్దశ్రమాన్నిప్రారంభించడానికి వచ్చిన ముఖ్యమంత్రి సాంబశివరావు(కోట శ్రీనివాస రావు) ని ఒక మాములు వ్యక్తి అపహరిస్తాడు. ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో రాష్ట్ర మరియు కేంద్ర వర్గాలు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. హోం మంత్రి ఈ సమస్య ని పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారిగా అంజన(పోసాని కృష్ణ మురళి)ను నియమిస్తారు. శ్రీకర్(విష్ణువర్ధన్) పోలీస్ లకి దొరికిపోవడంతో తనకి మరియు సునయన(శుబ్ర) కి మరియు మంచి శ్రీను(నారా రోహిత్) కి మధ్యలో ఉన్న బంధం గురించి చెప్తూ ఉంటాడు. అదే సమయంలో కామన్ మాన్ ప్రస్తుత కరెన్సీ ని మొత్తం నాశనం చేసి కొత్త కరెన్సీ ని ప్రవేశ పెట్టాలని తన డిమాండ్ ని తెలియజేస్తాడు. కాసేపటి తరువాత మరో డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచుతాడు ఇలా ఒక్కొక్క డిమాండ్ తో ప్రజలలో హీరో అయిపోతాడు కామన్ మాన్. అసలు కామన్ మాన్ కి మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్న సంభంధం ఏంటీ అనేది తెర మీద చూడవలసిందే....

ఈ చిత్రంలో ప్రతి నటుడు లేదా నటి మనస్పూర్తిగా నటించడం కనిపిస్తుంది. నారా రోహిత్ తన పాత్రలో చాలా అద్భుతంగా నటించారు అతని డైలాగ్ డెలివరీ కాని అతని పరిపఖ్వతతో కూడిన నటన కాని చూడటానికి చాలా బాగుంది కాని కాస్త మేనరిజం మీద దృష్టి పెడితే బాగుంటుంది. శుభ్ర అయ్యప్ప హీరోయిన్ లా ఎక్కడా కనిపించలేదు ఆమె పాత్రకు తగ్గ నటనను కనబరిచింది. కోట శ్రీనివాస రావు పాత్రలో ఒదిగిపోయారు. రెండవ అర్ధ భాగంలో కొన్ని పదునయిన డైలాగ్స్ ని చాలా బాగా చెప్పారు. జయప్రకాశ్ తనదయిన యాసలో కామెడీ ని బాగానే పేల్చారు. విష్ణువర్ధన్ నటన బాగున్నా పాత్ర చాలా చిన్నది అయిపోవడంతో అంతా ఆకట్టుకోలేకపోయింది. పోసాని దర్శకుడు అవకాశం ఇవ్వకపోయినా తనదయిన శైలిలో కామెడీ ని పేల్చి నవ్వించారు. మిగిలిన అన్ని పాత్రలు పరవాలేదనిపించాయి..

ఈ చిత్రం మొదటి అర్ధ భాగం కాస్త చిరంజీవి ఠాగూర్ చిత్రాన్ని పోలి ఉంటుంది కాని రెండవ అర్ధ భాగం పూర్తిగా కొత్తగా ఉంటుంది. మొదటి అర్ధ భాగంలో వచ్చే లవ్ ట్రాక్ చాలా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టించేస్తుంది. కాని రెండవ అర్ధ భాగం మీద దర్శకుడు ప్రశాంత్ మండవ పట్టు కనిపించింది.రెండవ అర్ధ భాగంలోనో కొన్ని అనవసరమయిన సన్నివేశాలను జొప్పించారు. ఈ చిత్రం దర్శకత్వం చాలా పేలవం. ఆనంద్ రవి రచించిన మాటలు చాలా బాగున్నాయి ముఖ్యంగా "స్వార్ధ పరులను పాలించాలంటే పరమ స్వార్థపరుడై ఉండాలి" వంటి వాక్యాలు ఇందులో చాలానే ఉన్నాయి. సాయి కార్తీక్ అందించిన సంగీతం పరవాలేదు అయన అందించిన నేపధ్య సంగీతం బాగుండటమే కాకుండా కొన్ని సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఎడిటింగ్ బాగానే ఉన్నా లవ్ సన్నివేశాలను కత్తిరించి ఉంటె మరింత బాగుండేది. నిర్మాణ విలువలు బాగోలేదు ఈ చిత్రాన్ని నమ్మి మరికొంత ఖర్చుపెట్టి ఉంటె ఫలితం ఇంకా బాగుండేది.

ఎన్నికల పుణ్యమా అని ఈ మధ్య వరుసగా రాజకీయ చిత్రాలు వస్తున్నాయి మొన్న ప్రభంజనం నిన్న ప్రతిఘటన ఈరోజు ప్రతినిధి. కాని మొదటి రెండు చిత్రాలతో పోలిస్తే ప్రతినిధి చాలా పరిపఖ్వత ఉన్న చిత్రం, చిత్రం మొదలు పెట్టినప్పటి నుండి దర్శకుడికి ఎం చెప్పాలనుకున్నాడో క్లారిటీ ఉన్నట్టు కనిపిస్తుంది మధ్యలో కొన్ని సన్నివేశాలలో ట్రాక్ మారినా వెంటనే సరిదిద్దుకున్నారు. అంతే కాకుండా ఈ చిత్రం సమస్య గురించి మాట్లాడటం కాకుండా పరిష్కారం వైపు నడుస్తుంది. డైలాగ్స్ అందించిన ఆనంద్ రవి ఒక ఎత్తు అయితే ఆ డైలాగ్స్ ని చెప్పడంలో నారా రోహిత్ మరో ఎత్తు. ఒక నూతన దర్శకుడి నుండి ఇంత పరిపఖ్వతతో కూడిన చిత్రం రావడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం కాని కాన్సెప్ట్ లో మాత్రమే పరిపఖ్వత కనిపించడం దర్శకత్వం విషయంలో తడబడటం కాస్త ఆందోళన చెందాల్సిన విషయం. ఈ చిత్రం ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది నిజానికి ఇలాంటి చిత్రాలకు మంచి ప్రచారం లభిస్తే అటు దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ప్రేక్షకులకు చేరుతుంది ఇటు నిర్మాత కాస్త లాభపడే అవకాశం ఉంది. ఇకనయినా ఈ విషయం గ్రహించి కాస్త దూకుడుగా ప్రచారం చేస్తారని ఆశిద్దాం ఇక మీరు చూడాలా వద్ద అన్న అంశానికి వస్తే ఇది ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రం (కొన్ని సన్నివేశాలను భరించగలిగితే)...

Nara Rohit,Prasanth Mandava,J Shambasiva rao,Sai karthikచివరగా : ప్రతినిధి : విషయం బాగుంది చెప్పిన విధానం బాలేదు ...

మరింత సమాచారం తెలుసుకోండి: