సినిమాటోగ్రఫీసినిమాటోగ్రఫీకథనం,కథ,దాదాపుగా అన్నీ

మాధవ్ (కృష్ణ మాధవ్) ఒక ఆర్కిటెక్ట్ అతను ప్రేమలో పడిన ప్రతిసారి ఏదో ఒక లోపం చూపెట్టి ప్రేమించిన అమ్మాయి నుండి విడిపోతుంటాడు. ఇలా కాదని మన్మధుడు(హర్ష వర్ధన్) , మాధవ్ చిన్ననాటి స్నేహితురాలయిన గాయత్రి(సంస్కృతి) తో ప్రేమలో పడేలా చేస్తాడు. గాయత్రి పారామౌంట్ బిరియాని ఓనర్ కూతురు. మాధవ్ ని వాళ్ళింట్లో పరిచయం చెయ్యడానికి గాయత్రి వాళ్ళు కొత్తగా కడుతున్న బ్రాంచ్ పనులు మాధవ్ కి దక్కేలా చేస్తుంది. ఇదే సమయంలో మన్మధుడి అసిస్టెంట్ కన్స్ట్రక్షన్ సైట్ వద్ద నిత్య(అనుష),మాధవ్ దగ్గర అయ్యేలా చేస్తాడు ఇక్కడ నుండి మాధవ్, గాయత్రీ మరియు నిత్య ల త్రికోణ ప్రేమాయణం సాగుతుంది .. చివరికి మాధవ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నదే కథ...

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి వచ్చిన మరో హీరో కృష్ణ మాధవ్, అయన తన బాడీ లాంగ్వేజ్ మీద మరియు డాన్సు మీద చాలా జాగ్రత్త తీసుకోవలసి ఉంది. మొదటి చిత్రం కాబట్టి ఏదో అలా కానిచ్చేసారు కాని ఇలానే చేస్తే ఎక్కువ రోజులు చిత్రసీమలో నిలదొక్కుకునే అవకాశాలు తక్కువ. అనుష తన నటన మరియు అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. సంస్కృతి ఏదో పరవాలేదనిపించింది. హర్ష వర్ధన్ బాగా నటించారు కాని ఇది ఆయనకు సరిపడా పాత్ర అయితే కాదు. ధనరాజ్ మరియు జబర్దస్త్ టీం అంతగా ఆకట్టుకోలేదు. 30 ఇయర్స్ పృథ్వి అక్కడక్కడా నవ్వించారు. మిగిలిన పాత్రలు అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి.

కథ చాలా చిన్నది కావడంతో తరువాత ఎం జరుగుతుందో యిట్టె పసిగట్టేయచ్చు కాబట్టి కథనం మీద చాలా పని చేసి ఉండాల్సింది కాని దర్శకుడు ఆనంద్ ఆ పని అసలు చేసినట్టు కనిపించదు ఏదో సన్నివేశం ఉండాలి కదా అని రాసుకున్న సన్నివేశాలే కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఈ చిత్రానికి ప్రధాన హైలెట్ ఈ విభాగం. రొమాంటిక్ ఎంటర్ టైనర్ సఫలం అవ్వాలంటే ఉండాల్సిన వాటిలో ఒకటి మంచి సంగీతం ఆ విషయంలో ఈ చిత్రం జీరో అయ్యింది సంగీత దర్శకుడు విశాల్ అందించిన సంగీతం అసలు బాగోలేదు. జినేష్ అందించిన డైలాగ్స్ అసలు బాగోలేదు సన్నివేశానికి బొత్తిగా బలం చేకూర్చలేకపోయాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటన, డాన్సు, డైలాగ్ డెలివరీ ఇవన్ని నేను మహేష్ బాబు దగ్గర నుండి నేర్చుకున్నాను నేను ఎటువంటి ఫిలిం స్కూల్ కి వెళ్ళలేదు అని చెప్పారు హీరో కృష్ణ మాధవ్ గారు కాని హీరో గారికి తెలియాల్సిన విషయం ఒకటి ఉంది అయన అన్నీ మహేష్ బాబు దగ్గర నుండి నేర్చుకున్నాను అనుకుంటున్నారు కాని నేర్చుకోలేదు, మంచి ఫిలిం స్కూల్ కి అయినా వెళ్ళాలి లేదా మరింత శ్రద్ద పెట్టి నిజంగా నేర్చుకొని మరో చిత్రంతో మన ముందుకు వస్తారేమో చూడాలి. మహేష్ బాబు కజిన్ అని చెప్పుకొని వస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి అది నటన విషయంలో కాని కథ మరియు కథనం విషయంలో కాని.. మహేష్ బాబు కజిన్ అన్న ఒక్క విషయంతోనే హిట్ కొట్టేయలేరు కదా, ఇప్పటికయినా ఈ విషయాన్నీ గ్రహిస్తారని ఆశిస్తున్నాం. ఇక చిత్ర విశ్లేషణ కు వస్తే ముప్పై ఏళ్ళ కిందట వచ్చినా కూడా పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అనేలా ఉండే కథ, తరువాత సన్నివేశాన్నే కాదు చివరి సన్నివేశాన్ని కూడా గ్రహించేసాకా తెర మీద అవే సన్నివేశాలు వస్తుంటే ఆవలిస్తూ కూర్చోవడం తప్ప మరో అవకాశం ఉండదు ప్రేక్షకుడికి.. ఇంతకు మించి ఈ చిత్రం గురించి చెప్పుకోవడం వ్యర్ధం .... చూడాలి అనుకుంటే మీ ఇష్టం...

Krishna Madhav,Anusha,Vi Anand,Sanjay Muppaneni,Vishal Chandrasekharహృదయం ఎక్కడున్నది : రొమాన్స్ కాదిది హింస

మరింత సమాచారం తెలుసుకోండి: