సంగీతం,సినిమాటోగ్రఫీసంగీతం,సినిమాటోగ్రఫీఅవి రెండు కాకుండా మిగిలిన అన్నీ

ఈ చిత్రం మూడు కథల సమూహారం మొదటిది భాను కథ , ఎనెర్జీ డ్రింక్స్ లో సేల్స్ విభాగంలో పని చేసే భాను(స్వాతి) తను పొందుపరిచిన ఫేక్ సర్టిఫికెట్స్ మూలాన ఉద్యోగం కోల్పోతుంది. ఇక భాను ని ప్రేమిస్తున్న వంశీ(నవదీప్) ఆ విషయం భానుకి చెప్పగా అసలు జీవితంలో దేన్నీ సీరియస్ గా తీసుకోని వంశీని ప్రేమించాను అని చెప్పేస్తుంది భాను, ఇక ఉద్యోగం పోయాక భాను ఎనెర్జి డ్రింక్స్ ప్రకటించిన సంక్రాంతి పథకానికి చెందిన బంగారు బిస్కెట్స్ ని కాజేయలనుకుంటుంది దీనికి వంశీ సాయం కోరుతుంది.. ఇక రెండవ కథ దొరబాబు(రామ్) భీమవరంలో ఉంటాడు అతనికి గూండాల కారణంగా ముప్పు ఉంటుంది దీని నుండి తప్పించుకోవడానికి అతను ఎర్రబాబు కోడి సహాయం తీసుకోవాలని అనుకుంటాడు కాని అనుకోకుండా దొరబాబు మరియు ఎర్రబాబు కూతురు కిడ్నాప్ కి గురవుతారు.. ఇక మూడవ కథ వేణు(సంతోష్) పిజ్జా డెలివర్ చెయ్యడానికి వచ్చి దొరబాబుతో పాటు కిడ్నాప్ కి గురవుతాడు ఎప్పటి నుంచో హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్న వేణు అక్కడ ఎర్రబాబు గురించి తెలుసుకుని ఎర్రబాబు నుండి డబ్బులు కాజేయాలని ప్లాన్ చేస్తాడు .. ఇక భాను మరియు వంశీ బంగారు బిస్కెట్ లు కాజేసారా? వేణు ఎర్రబాబు నుండి డబ్బులు దొంగిలించ గలిగాడా? దొరబాబు గూండాల బారి నుండి ఎలా తప్పించుకో గలిగాడు అన్నది మిగిలిన కథాంశాలు...

నవదీప్ పాత్ర చెప్పుకునేంత స్థాయిలో లేకపోవడంతో అయన నటన కూడా అలానే ఉంది అక్కడక్కడా మాత్రమే అయన పరవలేధనిపించారు. స్వాతి తన హావభావాలతో ప్రేక్షకుల మనసుని గెలుచుకుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇందులో నటించడం ఆశ్చర్యకరం వారి నటన కూడా బాగుంది. సంతోష్ పరవాలేదనిపించాడు. హర్షవర్ధన్ కొద్ది సేపే కనిపిస్తారు కాని అయన ఉన్నంతసేపు బాగా నటించారు...

దర్శకుడిగా పరవాలేదనిపించుకున్న రాజ్ రచయితగా దారుణంగా విఫలం అయ్యాడు. సినిమా సాగే కొద్ది సాగదీత మాత్రమే మిగిలింది. నవదీప్ మరియు రామ్ ల కలల సన్నివేశాలు సాగే కొద్ది చిరాకు పెట్టేస్తుంది. మహేష్ శంకర్ అందించిన సంగీతం బాగుంది నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది ఇక సినిమాటోగ్రఫీ పరవాలేదు. ఎడిటింగ్ రెండవ అర్ధ భాగం లో అసలు బాగోలేదు ఇంకా చాలా సన్నివేశాలను కత్తిరించి ఉండవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

దొంగతనం గురించి ఒక కథ రాసుకునేప్పుడు కథనం ఆద్యంతం ఆసక్తి కరంగా సాగేలా చూసుకోవాలి ఈ చిత్రంలో అదే మిస్ అయ్యింది మూడు వేరు వేరు కథలను ఒక తాడు మీదకు తీసుకు రావాలన్న ఆలోచన బాగున్నా కూడా అందుకు అయన రాసుకున్న సన్నివేశాలు బాగాలేవు, అనవసర సన్నివేశాలతో రెండవ అర్ధ భాగం నింపేసి చివర్లో మూడు కథలను కలిపేసి చిత్రం అయిపోయింది అనిపించేసారు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే అప్పటి వరకు చిరాకు పెట్టిన చిత్రం ఆ సన్నివేశంలో "హింసించింది". ఈ చిత్రంలో బొత్తిగా ఎంటర్ టైన్మెంట్ లేకుండా పోయింది ప్రేక్షకుడు ఇటు థ్రిల్లింగ్ కాని సెంటిమెంట్ కాని వినోదం కాని ఇలాంటి ఏ అనుభవాన్ని పొందలేడు ఇంకా కామెడీ కోసం ఉంచిన సన్నివేశాలు నవ్వించడం పోయి ఏడిపించాయి.. ఈ చిత్రంలో ముప్పై నిమిషాలకు పైగా కట్ చేసినా జరిగే నష్టం అంటూ ఎం ఉండదు అంటే ఈ చిత్రంలో రచయిత మరియు ఎడిటర్ పనితనం ఏంటో అర్ధం అయిపోతుంది. ఈ చిత్రంతో పోలిస్తే రాజ్ గత చిత్రం "బోణి" నయం అనిపిస్తుందంటే ఈ చిత్ర పరిస్థితి అంచనా వేసుకోవచ్చు ఈ చిత్రాన్ని చూడాలా వద్దా అన్న ఆలోచన వద్దు మీ టికెట్ డబ్బులకు థియేటర్ లోపల ఏ మాత్రం గిట్టుబాటు ఉండదు...

Navdeep,Swathi,Raj Pippalla,Sunita Tati ఇది పుత్తడి కాదు చెత్తది ....

మరింత సమాచారం తెలుసుకోండి: