అజిత్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అజిత్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్ సాగదీత ,వీక్ స్క్రిప్ట్ ,ఇంకా చాలా

ముంబైలో మూడు బ్లాస్ట్ ల తో చిత్రం మొదలవుతుంది , ఆ బ్లాస్ట్ లకి కారణం అయిన ఏ కె /అశోక్ కుమార్ (అజిత్) మరియు మాయ (నయన తార) తో కలిసి అర్జున్ (ఆర్య) ని కిడ్నాప్ చేస్తారు. ఆర్య ఒక కంప్యూటర్ హ్యాకర్ అతని ద్వారా అశోక్ కుమార్ ఒక టీవీ ఛానల్ నెట్వర్క్ ని క్రాష్ చేయిస్తారు అలానే కొన్ని తప్పులు కూడా చేయిస్తాడు, ఇది నచ్చని అర్జున్ అశోక్ ని పోలీస్ లకు పట్టించడం లో కీలక పాత్ర వహిస్తారు. అప్పుడే అశోక్ గతం గురించి తెలుస్తుంది అశోక్ మరియు సంజయ్(రానా) మంచి స్నేహితులు వీరిరువురు కలసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తుంటారు. ఒకానొక ఆపరేషన్ లో సంజయ్ చనిపోతాడు. అతను చనిపోయింది ప్రమాదంలో కాదని తెలుసుకున్న అశోక్ అతని చావుకి కారణం అయిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ కారణంగానే అశోక్ ముంబై లో బాంబు బ్లాస్ట్స్ చేస్తారు. ఎవరి వల్ల సంజయ్ చనిపోయాడు? అశోక్ వారి మీద ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా? వీరి మధ్యలో అనిత పనేంటి? అన్న అంశాలకు సమాధానం కావాలంటే చిత్రాన్ని చూడవలసిందే ...

అజిత్ - వన్ మ్యాన్ ఆర్మీ , ఈయన్ని స్టైలిష్ గా చూపించడానికే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే అయన బాడీ లాంగ్వేజ్ చాలా బాగా సూట్ అయ్యింది. ఈ చిత్రంలో ఈయన లేకపోతే చెప్పుకోడానికి ఎం లేదు అన్నట్టు తన భుజాల మీద నడిపాడు చిత్రాన్ని, ఇక ఆర్య తన పాత్ర మేరకు చాలా వరకు ఆకట్టుకున్నారు ఇక తాప్సీ మాత్రం పాత్ర తక్కువ అనుకున్నదేమో కాని "ఎక్కువ" నటించేసింది. నయనతార గ్లామర్ పరంగా ఆకట్టుకుంది కాని నటనా పరంగా ఆకట్టుకునేంత స్కోప్ లేదు. కిశోర్ పాత్ర బాగుంది కాని కథలో అతనికి అంతగా ఆస్కారం లేదు. మహేష్ మంజ్రేకర్ , అతుల్ కులకర్ణి పరవలేధనిపించారు.

దర్శకుడు విష్ణు వర్ధన్ , ఇన్ని చిత్రాలలో అసలు గ్రిప్పింగ్ గా ఉందని చిత్రం ఇదే అని సులభంగా చెప్పేయచ్చు.ఈ చిత్రం నిజానికి స్వార్డ్ ఫిష్ చిత్రం నుండి ప్రేరణ పొందింది , ఈ చిత్ర స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా ఉంటుంది అసలు ఇంటరెస్టింగ్ గా సాగదు. ఈ చిత్రంలో చాలా లోపాలు ఉన్నాయి ఈ విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త వహించాల్సింది. అక్కడక్కడ వచ్చే పాటలు స్టొరీ ఫ్లో ని అడ్డుకోడమే కాకుండా చిరాకు పెట్టిస్తాయి. సినిమాటోగ్రఫీ పరవాలేదు. ఎడిటింగ్ పరవాలేదు కాని సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలను కత్తిరించి నిడివి తగ్గించి ఉంటె బాగుండేది. నిర్మాణ విలువలు పరవాలేదు.

తెలుగులో అంతగా మార్కెట్ లేని అజిత్ ఇక్కడ తనను తాను నిరూపించుకోడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు తమిళంలో మంచి విజయం సాదించిన ఈ చిత్రంతో మన మార్కెట్ మీద పట్టు సాదించాలని వఛ్చిన అజిత్ కి ఇది సరయిన చిత్రం కాదు. విష్ణు వర్ధన్ పూర్తిగా విఫలం అయిన చిత్రం ఇది , చిత్రం ఆసాంతం అజిత్ నడక మీద దృష్టి సారించిన విష్ణు వర్ధన్ కాస్తయిన కథ మీద దృష్టి పెట్టుంటే ఇంకా బాగుండేది. నిజానికి ఇదే కాన్సెప్ట్ ని ఇంకా బాగా తీయచ్చు. ఇక నయనతార నటన కూడా తాప్సీ నే నటించేసింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన ఆర్యను చూడటానికి కళ్ళు సరిపోలేదు జస్ట్ కామెడీ కోసమే అలా పాత్రను డిజైన్ చేసారు. ఫ్రేమ్ మారే లోపు ఆర్య ఫిజిక్ మారిపోతుంది అంటే అది ఎంత అనవసరమో మీకీ అర్ధం అవుతుంది. రానా ఉన్నంతవరకు చిత్రం పరవాలేదనిపిస్తుంది.

ఇక టెక్నికల్ గా తెర మీద మాట్లాడిన మాటలు వింటూ ఎవరయినా తల గోక్కోవలసిందే .. ఇక ఈ చిత్రాన్ని చూసి నేర్చుకున్న కొన్ని కొత్త అంశాలు "విలన్ కి ఎలా స్కాం లు ఎలా చెయ్యాలో తెలుసు కాని ఒక మనిషిని ఎలా చంపాలో తెలియదు" .. "పోలీస్ నుండి తప్పించుకున్న అశోక్ కి దుబాయ్ వెళ్ళడం చాలా సులువు" .. "దుబాయ్ లో దొంగతనం చెయ్యడం చాలా ఈజీ" ... "దుబాయ్ బ్యాంకు నుండి డబ్బులు షిఫ్ట్ చెయ్యడానికే అన్నట్టు గా రిజర్వు బ్యాంకు ఒక ఎకౌంటు మేనేజ్ చేస్తుంటుంది" ఇవి శాంపిల్ మాత్రమే ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఒక విష్ణు వర్ధన్ చిత్రంగా అయితే దీన్ని అసలు చూడలేం కాని అజిత్ కోసం మాత్రమే చిత్రాన్ని చూడగలం అనుకునేవాళ్లు ఈ చిత్రాన్ని చూడొచ్చు ...

Ajith Kumar,Arya,Nayantara,Vishnuvardhan,A Raghuram,Taapsee Pannu ఆట ఆరంభం - ఆట ఆ'రంపం'

మరింత సమాచారం తెలుసుకోండి: