సినిమాటోగ్రఫీ, బిజిఎంసినిమాటోగ్రఫీ, బిజిఎంకథ, కథనం, రొటీన్ కామెడీ
ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న అశ్విన్ (అశ్విన్ బాబు) తను ఉంటున్న కాలనీలో న్యూసెన్స్ కు కారణమవుతాడు. ఓ పక్క కేరళకు చెందిన డాక్టర్ మాయ (అవికా గోర్)కు ఎవరైతే లవ్ ప్రపోజ్ చేస్తారో వారు కారణాలు లేకుండా చనిపోతుంటారు. అదుకే ఆ కాలనీ సభ్యులంతా కూడా మాయను అశ్విన్ ప్రేమించేలా చేస్తారు. అయితే మాయను ఏదో శక్తి వెంటాడుతుందని తెలుసుకున్న అశ్విన్ అదేంటని కనుక్కునేందుకు కేరళ వెళ్తాడు. అక్కడ అశ్విన్ కు ఎదురైన సమస్యలు ఏంటి..? అశ్విన్, మాయను ప్రేమించాడా..? అశ్విన్ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా కథ.    



సినిమాలో అశ్విన్ నటన బాగుంది. దర్శకుడు ఏం చెప్పాడో దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు అశ్విన్. అవికా గోర్ కూడా తన నటనతో మెప్పించింది. మాయగా అవికా గోర్ కూడా ఇంప్రెస్ చేసింది. ఇక సినిమాలో అలి కూడా ఎప్పటిలానే తన కామెడీతో ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజి, అజయ్ ఘోష్, ఊర్వశి పాత్రలు కూడా మెప్పించాయి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.    



చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు హెల్ప్ అయ్యింది. షబిర్ మ్యూజిక్ డైరక్షన్ సోసోగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. కథ, కథనాల్లో దర్శకుడు ఓంకార్ ఏమాత్రం మెప్పించలేదు. కథ కొద్దిగా ఆసక్తికరంగా అనిపించినా కథనం రొటీన్ గా నడిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అంతగా మెప్పించలేదు.



సస్పెన్స్, హర్రర్ థ్రిల్లర్ కథలకు ఆడియెన్స్ ను సీటు చివర కూర్చో బెట్టే కథనం చాలా అవసరం. అయితే రాజు గారి గది సినిమాతో అటు సస్పెన్స్ తో పాటుగా కామెడీని కూడా పండించాడు. ఆ సినిమా హిట్ అవడంతో రాజు గారి గది 2 కూడా తీశారు. అయితే మొదటి పార్ట్ లో ఉన్న కామెడీ మిస్సైందని పార్ట్ 2 ఫలితం తిప్పికొట్టారు. అందుకే రాజు గారి గది 3లో కామెడీని పెట్టారు.


చెప్పాలనుకున్న కథకు కామెడీని మిక్స్ చేయడం మంచి విషయమే కాని రాజు గారి గది 3లో మళ్లీ రొటీన్ కామెడీతో సాగించాడు. సినిమా అంతా ఇలానే అనిపిస్తుంది. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనాలతో దర్శకుడు ఓంకార్ మరోసారి నిరాశపరచాడని చెప్పొచ్చు. ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడమే ముఖ్య ఉద్దేశమని అనవసరమైన కామెడీని ఇరికించాడని అనిపిస్తుంది.


సినిమాలో సన్నివేశాలు బలంగా లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. బూతు కామెడీ.. ఐటం సాంగ్ ఇలా మాస్ ఆడియెన్స్ కోసం మెప్పించే అంశాలతో రాజు గారి గది 3 వచ్చింది. రాజు గారి గది లా అన్నివర్గాల ప్రేక్షకులకు కాకుండా కేవలం బి,సి సెంటర్స్ ఆడియెన్స్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. 



అశ్విన్ బాబు, అవికా గోర్,అలీ, ఊర్వశి,అజయ్ ఘోష్రాజు గారి గది 3.. ఆశించిన స్థాయిలో లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: