నటీనటుల పనితీరు,ఆర్ట్ పనితనం,సంగీతం,సినిమాటోగ్రఫి నటీనటుల పనితీరు,ఆర్ట్ పనితనం,సంగీతం,సినిమాటోగ్రఫి నెమ్మదిగా సాగే కథనం,ఎడిటింగ్, సంభాషణలు,చిత్ర నిడివి

"స్త్రీ కి హృదయం ఉంది , దానికి అనుభవం కావాలి" అన్న వాక్యంతో మొదలయిన ఈ చిత్రం మొదలవుతుంది. సత్యం(శివాజీ) తన కూతురికి కమల రాణి కి కథ చెప్పడం మొదలుపెడతాడు. కమల రాణి ఒక వేశ్య, 1950లలో అయోధ్య పురం శివార్లలో నివసిస్తూ ఉంటుంది. తన స్నేహితుడు ఆనందరావు కి సహాయం చెయ్యడానికి బర్మా నుండి వచ్చిన సత్యం వాతావరణం బాగోలేకపోవడం చేత కమల దగ్గర ఉండవలసి వస్తుంది. ఆ రాత్రి వారి మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది దీంతో కమలను బర్మా తీసుకు వెళ్లి తన భార్యగా చేసుకోవాలని అనుకుంటాడు సత్యం . అక్కడ నుండి ఆనందరావు ని వెతుకుతున్న సత్యం కి తోడవుతుంది కమల. వీరిరువురు కలిసి ఆనందరావు ని వెదకడం మొదలు పెడతారు. కొన్ని సమస్యల కారణంగా వీరు సూర్య నారాయణ అనే అబ్బాయిని కలుసుకుంటారు. మరుసటి రోజు తిరిగి ఆనందరావు ని వెదకడం మొదలుపెడతారు. కష్టాలలో ఉన్నాడని సాయం చెయ్యడానికి సత్యం వెదుకుతున్న ఆనందరావు దొరికాడా? తప్పు ఎన్నిసార్లు చేసినా తప్పే అని నమ్మే ఈ సమాజాన్ని ఎదిరించి సత్యం , కమలను పెళ్లి చేసుకున్నాడా ? అన్నవి మిగిలిన కథాంశాలు...

శివాజీ సైనికుడి పాత్రలో చాలా బాగా నటించారు అయన కనబరిచిన నటన ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యింది. అర్చన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది కాని కీలక పాత్ర అని పేరులో తెలుస్తుంది కాని ఆమె నటనలో అంతటి గాఢత కనబడదు. పావలా శ్యామల పాత్ర ఈ చిత్రంలో చాలా బాగా కలిసొచ్చింది. అర్చన పాత్రను ఒక స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఈ పాత్రలో పావల శ్యామల కనబరిచిన నటన చాలా సహాయపడింది. జమిందార్ పాత్ర పోషించిన నటుడు పరవాలేదనిపించాడు. చిన్న పిల్లల పాత్రలలో నటించిన బాల నటులు వారి స్థాయి మేరకు ప్రతిభ కనబరిచారు..

‘వీధి చివర ఇల్లు ’ అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. చాలా రోజుల తరువాత ఒక నవలాదారిత చిత్రం తెర మీదకు రావడం నిజంగా ధైర్యంతో కూడుకున్న పనే కాని దర్శకుడు ఈ కథను తెరకెక్కించిన విధానం నవలలో ఉన్న భావాన్ని సరిగ్గా చూపెట్టలేకపోయింది. ఇలాంటి కథలకు కథనంలో వేగం ఉండకపోవడం సాధారణ విషయమే కాని ఇంత నెమ్మదిగా సాగదీయడం మాత్రం దర్శకుడి లోపమే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది 1950 లో ఉన్న వాతావరణాన్ని సృష్టించడంలో సినిమాటోగ్రాఫర్ సఫలీకృతుడు అయ్యాడు అతడు వాడిన రంగుల విధానం చాలా బాగుంది. కె కె అందించిన సంగీతం బాగుంది కొన్ని సన్నివేశాలకు ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా చాలా బాగా నప్పింది. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే వినడానికి బాగానే ఉన్న కాని తెర మీద ఎందుకు వస్తున్నాయో తెలియక మతిపొయెలా చేసాయి. సన్నివేశానికి తగ్గ సంభాషణలు అయ్యి ఉంటె మరింత బాగుండేది.. ఎడిటర్ పనితనం అసలు బాగోలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న ఇలాంటి సమయంలో ఇటువంటి చిత్రాన్ని తెరకెక్కించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ విషయంలో వీరిని తప్పక అభినందించాలి.

గతంలో జాతీయ అవార్డు చిత్రం చేసిన దర్శకుడు తెరకెక్కించిన చిత్రం అని అంటే ఏ బాషలో అయినా ప్లస్ అవుతుందేమో కాని తెలుగు లో అదే పెద్ద మైనస్ .. అవార్డు దర్శకుడు అని పేరు తెచ్చుకున్నాక అతను ఏ చిత్రం చేసినా అదే కోణంలో చూడటం మొదలు పెడతారు అలాంటి కోవలోకే వస్తాడు కమలతో నా ప్రయాణం దర్శకుడు గతంలో జాతీయ అవార్డు స్వీకరించిన ఈ దర్శకుడు ఈ చిత్రాన్ని కూడా అదే విధానంలో తెరకెక్కించాడు ఒక కళాత్మకం అయిన చిత్రాన్ని తెర మీద చూపించాలన్న అయన తపన బాగా కనిపిస్తున్నా తెర మీద మాత్రం ఆ స్థాయి కనపడదు కథనంలో చాలా లొసుగులు కనిపిస్తాయి. చెప్పాలనుకున్న పాయింట్ ని సరిగ్గా చెప్పలేకపోవడంతో మంచి చిత్రం అవ్వాల్సిన చిత్రం కాస్త తికమక చిత్రంగా మిగిలిపోయింది.

ఒక సున్నితమయిన కథను డీల్ చేసేప్పుడు చాలా కష్టాలు ఎదురుకోవలసి వస్తుంది అది తెలిసిన విషయమే కాని చెప్పాలనుకున్న పాయింట్ నే సరిగ్గా ప్రేక్షకుల వద్దకు చేర్చలేకపోతే దర్శకుడి కష్టానికి పూర్తిగా ఫలితం లేకుండా పోతుంది.. ఇటువంటి చిత్రాన్ని చెయ్యడానికి నిజంగా చాలా ధైర్యం కావాలి అందులోనూ "పీరియాడిక్ డ్రామా" జోనర్ లో తెలుగులో చాల తక్కువ చిత్రాలు వస్తున్నాయి ఇలాంటి ఒక చిత్రం చెయ్యాలన్న ఆలోచన అభినందనీయం కాని ఇదే ప్రయత్నం ఇంకాస్త అందంగా చేసి ఉంటె ఇటువంటి చిత్రాలు మరిన్ని వచ్చే అవకాశం ఉండేది కాని ఒక విఫలం అయిన చిత్రాన్ని చూసాక అటువంటి చిత్రాలను మరొకరు ప్రయత్నిస్తారు అని నేను అనుకోవట్లేదు. ఈ చిత్రాన్ని చూడటం కన్నా చలం గారి "వీధి చివరి ఇల్లు" అన్న పుస్తకం చదవడం బెటర్ ...

Shivaji,Archana,Narasimha Nandi,Sunil Reddyకమలతో నా ప్రయాణం : చేరలేదు ఏ గమ్యం...

మరింత సమాచారం తెలుసుకోండి: