యువ హీరో కార్తికేయ, నేహా సోలంకి జంటగా శేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా 90 ఎం.ఎల్. కార్తికేయ తండ్రి ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి గుమ్మడికొండ నిర్మించిన ఈ సినిమా సరికొత్త కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

పూటకి 90 ఎం.ఎల్ తాగనిదే ఉండలేని దేవదాస్ (కార్తికేయ) అసలు మందు వాసనే పడని సువాసన (నేహా సోలంకి)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. దేవదాస్ మందు అలవాటు తెలియని సువాసన అతన్ని ప్రేమించినా అతని గురించి తెలుసుకుని హీరోకి దూరమవుతుంది. అయితే ఆమె ప్రేమని దక్కించుకునేందుకు దేవదాస్ ఏం చేశాడు. అసలు దేవదాస్ మందు ఎందుకు రోజు తాగుతాడు..? దాని వల్ల అతనికి ఎలాంటి సమస్యలు వచ్చాయి..? వాటినన్నిటిని దేవదాస్ ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా కథ. 

 

విశ్లేషణ :

90 ఎం.ఎల్ అన్ ఆథరైజెడ్ డ్రింకర్ అంటూ పొస్టర్స్, టీజర్ తో అలరించిన కార్తికేయ. కేవలం వాటితో మాత్రమే ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. హీరోకి చిన్నప్పుడు వచ్చిన వ్యాధికి పూటకో 90 ఎం.ఎల్ వేస్తే కాని బ్రతకడు. అయితే అతను ప్రేమించిన అమ్మాయికి ఈ విషయం చెప్పకపోవడం.. అలా చెబుదామని అనుకున్న ప్రతిసారి మాట మార్చడం ఇలా సినిమా అంతా ఎలాంటి సర్ ప్రైజులు, ట్విస్టులు లేకుండా సాగుతుంది.

 

సినిమా దర్శకుడు శేఖర్ రెడ్డి హీరో ప్రతి పూట 90 ఎం.ఎల్ వేస్తాడన్న పాయింట్ తోనే సినిమా మొత్తం లాగించాడు. అయితే ఆ లైన్ కు సరైన కథ కథనాలను తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. హీరోకి తాగితే కాని రోజు గడవదు.. హీరోయిన్ ఫ్యామిలీకి ఆ తాగుడు అంటేనే అసలు పడదు. ఇలా చాలా బలహీనమైన కథా వస్తువుతో 90 ఎం.ఎల్ మూవీ వస్తుంది.

 

అయితే ఈ కథను దర్శకుడు మరీ రొటీన్ గా నడిపించాడు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ తప్ప 90 ఎం.ఎల్ లో పెద్దగా మ్యాటర్ లేదని చెప్పొచ్చు. సినిమాలో కార్తికేయ స్టైలిష్ లుక్ బాగుంది. ఇక యూత్ ఆడియెన్స్ కు నచ్చే డైలాగ్స్ ఉన్నాయి. అంతేకాని ఫ్యామిలీ, కంటెంట్ ఉన్న సినిమాలు చూడాలనుకునే వారు మాత్రం పెదవివిరుస్తారు.

 

నటీనటుల ప్రతిభ :

యువ హీరో కార్తికేయ దేవదాస్ పాత్రలో పర్వాలేదు అనిపించాడు. అయితే తన ప్రతి సినిమాలో  ఒకే తరహా పాత్రలో నటిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక మీదట సినిమాల్లో ఇంకాస్త హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. హీరోయిన్ నేహా సోలంకి నటన బాగుంది. రవికిశన్ కామెడీ విలన్ గా అలరించాడు. తన మార్క్ నటనతో మెప్పించాడని చెప్పొచ్చు. రావు రమేష్ జస్ట్ ఓకే అనిపిస్తారు. ప్రభాకర్, రహు, సత్య ప్రకాశ్, ప్రగతి ఎప్పటిలానే పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

యువరాజు సినిమాటోగ్రఫీ బాగుంది.. సినిమా కెమెరా వర్క్ విషయంలో మంచి మార్కులు పడ్డాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ జస్ట్ ఓకే. సాంగ్స్, బిజిఎం పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. శేఖర్ రెడ్డి కథ, కథనాలు పెద్దగా మెప్పించలేదని చెప్పొచ్చు. ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించాయి.

 

ప్లస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్

సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్స్ :

కథ

కథనం

 

బాటం లైన్ :

90 ఎం.ఎల్.. కొత్త సీసాలో పాత మందు..!

 

రేటింగ్ : 2/5

 

మరింత సమాచారం తెలుసుకోండి: