విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించారు. రాశి ఖన్న, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

 

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన కార్తిక్ (నా చైతన్య)కు అన్ని తానై ఉంటాడు మేనమామ వెంకట రత్నం (వెంకటేష్). కార్తిక్ తాతయ్య నాజర్ జాతకాలు బాగా నమ్ముతాడు. అయితే ఏనాటికైనా అల్లుడి వల్ల వెంకట రత్నం ప్రాణానికి అపాయమని తెలుసుకుని వాళ్లిద్దరిని దూరం చేయాలని చూస్తారు. వెంకట రత్నానికి తోడుని వెతకడంలో కార్తిక్. ఫెయిల్ అయిన కార్తిక్ లవ్ మళ్లీ కలిపేందుకు వెంకట రత్నం ప్రయత్నిస్తారు. ఈ క్రమంల్లో అనుకోకుండా కార్తిక్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. కొన్నాళ్లు అతను కనిపించకుండా వెళ్తాడు. ఇంతకీ కార్తిక్ ఆర్మీలో ఎందుకు చేరాడు..? అతను కనిపించకుండా ఎలా మాయమయ్యాడు..? వెంకటరత్నం కార్తిక్ మళ్లీ ఎలా కలిశారు..? అన్నది సినిమా కథ.  

 

విశ్లేషణ :

 

మల్టీస్టారర్ ట్రెండ్ టాలీవుడ్ లో కొనసాగుతుంది అంటే అది కేవలం విక్టరీ వెంకటేష్ వల్లే అని చెప్పొచ్చు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మొదలైన మల్టీస్టారర్ హవా కొనసాగుతూనే ఉంది. ఈ ఇయర్ మొదట్లోనే ఎఫ్ 2తో హిట్ అందుకున్న వెంకటేష్ ఈసారి నాగ చైతన్యతో వెంకీమామగా వచ్చాడు. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్ పైనా అవే పాత్రల్లో నటించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

 

ఇక అనుకున్నట్టుగానే సినిమా మొదటి భాగం మొత్తం ఎంటర్టైనింగ్ చేసిన డైరక్టర్ బాబి సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కామెడీ, స్క్రీన్ ప్లే సరదగా రాసుకున్నాడు. ఇంటర్వల్ బ్యాంగ్ కూడా సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఈ కథకు ఆర్మీ బ్యాక్ డ్రాప్ అసలు సెట్ అవలేదని చెప్పొచ్చు.

 

సెకండ్ హాఫ్ సినిమా ఇంకాస్త లేపుతుందని అనుకున్నా దానికి పూర్తిగా విరుద్ధంగ సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా సీరియస్ గా సాగుతుంది. నో ఎంటర్టైన్మెంట్ ఇన్ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా బాగా ఉండటం వల్ల సినిమా కన్ ఫ్యూజ్ చేసినట్టు అవుతుంది. మొత్తానికి వెంకీమామ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను అలరించలేదని చెప్పొచ్చు.

 

నటీనటుల ప్రతిభ :

 

విక్టరీ వెంకటేష్ ఎప్పటిలానే తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. తన కామెడీ టైమింగ్ తో పాటుగా ఈ సినిమాలో సీరియస్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలో మరో హైలెట్ నాగ చైతన్య.. కార్తిక్ పాత్రలో అదరగొట్టాడు. అయినా సరే చైతు పాత్రకు పెద్దగా స్కోప్ దొరకలేదని అనిపిస్తుంది. రాశి ఖన్నా అందంగా కనిపించింది. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇంప్రెస్ చేసింది. ఒక సాంగ్ లో అమ్మడి అందాలకు ఫిదా అవుతారు. నాజర్, ప్రకాశ్ రాజ్ పాత్రలు మెప్పిస్తాయి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

 

ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ హైలెట్ గా నిలుస్తుంది. కాశ్మీర్ అందాలను బాగా చూపించారు. థమన్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. బిజిమె బాగా ఇచ్చాడు. సినిమా దర్శకుడు బాబి కథ, కథనాల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా కథ చాలా సింపుల్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే వర్క్ అవుట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిపించినా సెకండ్ హాఫ్ తేలగొట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

 

వెంకటేష్, నాగ చైతన్య

ఫస్ట్ హాఫ్ కామెడీ

వెంకీ చైతన్య కాంబో కెమిస్ట్రీ

 

మైనస్ పాయింట్స్ :

 

సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే

ఫ్లాష్ బ్యాక్స్ ఎక్కువవడం

 

బాటం లైన్ :

 

వెంకీమామ.. మామా అల్లుళ్లు అంచనాలను అందుకోలేదు..!

 

రేటింగ్ : 2.25/5 

 

మరింత సమాచారం తెలుసుకోండి: