సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా ఏ.ఆర్ మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా దర్బార్. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా నివేదా థామస్ స్పెషల్ రోల్ చేశారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

పోలీస్ ఆఫీసర్ అయిన ఆదిత్య అరుణాచలం (రజినికాంత్) సిటీలోని డ్రగ్ మాఫియాని అంతమొందిస్తాడు. అయితే మాఫియాని నడిపించే హరి చోప్రా విదేశాలకు పారిపోతాడు. అతని సామ్రాజ్యాన్ని నాశనం చేశాడని ఆదిత్య మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు హరి చోప్రా. విలన్ వేసిన ప్లాన్ కు ఆదిత్య కూతురు వల్లి (నివేదా థామస్) బలవుతుంది. ఇక అప్పటినుండి ఆదిత్య అరుణాచలం టార్గెట్ హరి చోప్రా అవుతాడు.. ఇంతకీ హరి చోప్రాపై ఆదిత్య అరుణాచలం ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

15 ఏళ్లుగా రజినికాంత్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా ఉన్నా కథ విషయంలో మురుగదాస్ రొటీన్ గా నడిపించాడని చెప్పొచ్చు. రొటీన్ కథకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో దర్బార్ తీశారు. ముఖ్యంగా సినిమాలో రజిని ఎనర్జీని చూసి ఫ్యాన్స్ షాక్ అవడం ఖాయం. కచ్చితంగా రజిని ఫ్యాన్స్ అందరికి నచ్చే సినిమాగా దర్బార్ ఉందని చెప్పొచ్చు.

అయితే సినిమా మాత్రం రెగ్యులర్ కాప్ డ్రామాలానే అనిపిస్తుంది.. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని బాగా ఉన్నా కథ మాత్రం డిఫరెంట్ గా అనిపించదు. ఒకప్పుడు కొత్త కథలతొ వచ్చే మురుగదాస్ రజినికాంత్ కాంబినేషన్ సినిమాతో కూడా కొత్త కథతో వస్తాడని అనుకోగా రొటీన్ కథతోనే సినిమా నడిపించాడు. అయితే స్క్రీన్ ప్లే కాస్త రేసీగా ఉండటం వల్ల సినిమా ఓకే అనిపించేలా ఉంది.

 

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగా రాసుకున్న మురుగదాస్ సెకండ్ హాఫ్ కాస్త ట్రాక్ తప్పాడని చెప్పొచ్చు. కథ ఎలా ఉన్నా కథనంలో మురుగదాస్ తన మార్క్ చూపించాడని చెప్పొచ్చు. తమిళంలో దర్బార్ రజిని ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంటుంది. తెలుగులో కూడా రజిని ఈసారి పర్వాలేదు అనిపించేలా ఉన్నాడు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా చూసే అవకాశం ఉంది.

 

నటీనటుల ప్రతిభ :

 

కబాలి తర్వాత తన స్టైల్ విషయంలో ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్న రజినికాంత్ ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడు. తన మార్క్ స్టైల్ తో 70 ఏళ్ల వయసులో రజిని చేసిన యాషన్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఈ సినిమాలో నయనతార తన పాత్ర మేరకు బాగానే చేసింది. నివేదా థామస్ మంచి పాత్రలో మెప్పించింది. ఇక సినిమాలో విలన్ గా నటించిన సునీల్ శెట్టి బాగా చేశాడు. యోగి బాబు కామెడీ అలరించింది.

 

 

సాంకేతికవర్గం పనితీరు :

 

సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సినిమాలో ప్రతి ఫ్రేం చాలా రిచ్ గా ఉంటుంది. రజిని ఇంత స్టైలిష్ గా కనిపించడానికి కెమెరా వర్క్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఇక అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. పాటలు ఎలా ఉన్నా బిజిఎం అదరగొట్టాడు. ఎడిటింగ్ బాగుంది. కథ రొటీన్ గా ఉన్నా స్క్రీన్ ప్లేలో మురుగదాస్ కు మంచి మార్కులే పడ్డాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు.

 

ప్లస్ పాయింట్స్ :

 

రజినికాంత్

 

బిజిఎం

 

నివెదా థామస్

 

మైనస్ పాయింట్స్ :

 

స్టోరీ

 

సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అవడం

 

బాటం లైన్ :

 

రజినికాంత్ దర్బార్.. మురుగదాస్ మార్క్ ఎంటర్టైనర్..!

 

రేటింగ్ : 2.5/5

 

మరింత సమాచారం తెలుసుకోండి: