ఈమధ్య కాలంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తమిళ సినిమా 96 లో నటించిన వర్షం బొల్లమ హీరోయిన్ గా నటించిన సినిమా చూసి చూడంగానే. శేష సింధు రావు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

 

చదువులో వీక్ అయిన సిద్ధు (శివ కందుకూరి) మేనేజ్ మెంట్ కోటాలో బి.టెక్ జాయిన్ అవుతాడు. కాలేజ్ లో ఐశ్వర్య (మాళవిక సతీషన్)తో ప్రేమలో పడతాడు సిద్ధు. ఐశ్వర్య కూడా సిద్ధుని ప్రేమిస్తుంది. సడెన్ గా వీరి ప్రేమ బ్రేకప్ అవుతుంది. మూడేళ్ల తర్వాత సిద్ధు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవుతాడు. అయితే అతన్ని చూసి శృతి (వర్ష బొల్లమ) ప్రేమలో పడుతుంది. కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ సిద్ధుకి దూరమై వేరే వాళ్లతో ఆమెకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇంతకీ సిద్ధు శృతి మళ్లీ కలిశారా..? ఎలా వారి ప్రేమని గెలిపించుకున్నారు..? అన్నది సినిమా కథ.

 

నటీనటుల ప్రతిభ :

 

శివ కందుకూరి మొదటి సినిమానే అయినా తనలో నటించాలన్న తపన కనబడ్డది. ఎంచుకున్న పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు కాని సినిమాకు తగినట్టుగా పర్ఫాం చేశాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమా ఇంప్రెస్ చేసింది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక మరో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య కొద్ది సీన్స్ కే పరిమితమైంది. వెంకటేష్ కాకమను కామెడీ బాగుంది. అవసరాల శ్రీనివాస్ గెస్ట్ రోల్ చేసి సర్ ప్రైజ్ చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు చేసి మెప్పించారు.

 

సాంకేతికవర్గం పనితీరు : 

 

వేదరామన్, రవితేజ గిరిజల సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే కంటెంట్ లో దమ్ము లేకపోవడం వల్ల సీన్స్ ఎంత ఫ్రెష్ గా అనిపించినా ప్రేక్షకులకు ఎక్కువు. ఇక సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. మెలోడీ సాంగ్స్ ఆకట్టుకునాయి. బిజిఎం బాగుంది. ఇక కథ, కథనాల్లో డైరక్టర్ శేష సింధు రావు రొటీన్ కథతో అదే రొటీన్ స్క్రీన్ ప్లే తో వచ్చిన గొప్ప అవకాశాన్ని మిస్ యూజ్ చేసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

 

విశ్లేషణ :

 

చూసి చూడంగానే.. సినిమా పోస్టర్.. టీజర్.. ట్రైలర్ ఇవన్ని చూసి ఇదో ఫ్రెష్ లవ్ స్టోరీగా ఆడియెన్స్ భావించారు. అయితే లవ్ స్టోరీలో కొత్త కథతో వస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. కాని ఆల్రెడీ ఒకరితో లవ్ లో పడి బ్రేకప్ అవడం.. ఆ తర్వాత మళ్లీ మరో అమ్మాయికి దగ్గరవడం ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఈ కథ కూడా అలాంటి రొటీన్ స్టోరీతోనే తెరకెక్కింది.

 

సినిమాలో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ఎమోషన్ బాగా రావాలి కాని అది కూడా పెద్దగా కుదరలేదు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని ఇస్తుందని అనుకున్న ఆడియెన్స్ ఈ సినిమా మెప్పించలేదని చెప్పొచ్చు.

 

రాజ్ కందుకూరి నుండి వచ్చిన పెళ్లిచూపులు, మెంటల్ మదిలో సినిమాలతో పోల్చితే చూసి చూడంగాఏ కథ మరీ ఫ్లాట్ గా నౌస్తుందని అనిపిస్తుంది. మహిళా దర్శకురాలు శేష సింధు రావు తన మార్క్ చూపించడంలో విఫలమైంది. అయితే యూత్ ఆడియెన్స్ ను మెప్పించే కొన్ని అంశాలు ఉన్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ :

 

వర్ష బొల్లమ నటన

మ్యూజిక్

కొన్ని కామెడీ సీన్స్

 

మైనస్ పాయింట్స్ :

 

ఫస్ట్ హాఫ్ 

క్లైమాక్స్

బలమైన సన్నివేశాలు లేకపోవడం

 

బాటం లైన్ :

 

చూసి చూడంగానే.. రొటీన్ లవ్ స్టోరీ..!

 

రేటింగ్ : 1.5/5

 

మరింత సమాచారం తెలుసుకోండి: