కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 మూవీని తెలుగులో జానుగా రీమేక్ చేశారు. మాత్రుక దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగు జానుని డైరెక్ట్ చేశారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో శర్వానంద్, సమంత జంటగా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :  

 

వైల్డ్ ఫోటోగ్రాఫర్ అయిన రామ్ (శర్వానంద్) తన స్కూల్ కు వెళ్లి అక్కడ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. వెంటనే తన స్నేహితులతో కలిసి ఓ గెట్ టూ గెదర్ ప్లాన్ చేస్తాడు. అందరితో పాటుగా జానకి అలియాస్ జాను (సమంత) కూడా పూర్వ విద్యార్ధుల కలయికకు అటెండ్ అవుతుంది. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన మనిషి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తన ముందుకు వస్తుందని రామ్ ఎలాంటి అనుభూతి పొందాడు. ఆ ఈవెంట్ అయ్యాక జానుతో రామ్ ఏం చేశాడు..? రామ్ జానకిని ఎలా మిస్సయ్యాడు..? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

 

విశ్లేషణ :

 

ప్రేమ కథలు ఎన్నొచ్చినా సరే మనసుని కదిలించేస్తాయి.. అందులోనూ విరహ ప్రేమ కథ అంటే ఆ ప్రణయ గాథ వేరేలా ఉంటుంది. అలాంటి మరో మంచి ప్రయత్నమే చేశారు దిల్ రాజు. తాను చూసిన 96 మూవీని రిలీజ్ ముందే హిట్ అని గెస్ చేసిన రాజు అక్కడ ఆ సినిమా రిలీజ్ కు ముందే రీమేక్ రైట్స్ కొన్నారు. అనుకున్నట్టుగానే 96 అక్కడ పెద్ద హిట్ అయ్యింది. అయితే తెలుగులో ఈ సినిమా తీసేందుకు కొంత టైం తీసుకున్నారు. ఇలాంటి క్లాసిక్ మూవీస్ కు కాస్టింగ్ చాలా ప్రాధాన్యత వహిస్తుంది. 

 

అందుకే శర్వానంద్, సమంతలను సెలెక్ట్ చేసుకున్నారు. జాను పాత్రలో సమంత తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. 96 మూవీ చూసిన వారికి ఈ సినిమా కూడా నచ్చేస్తుంది. ఇక తెలుగులో జానుని మొదటిసారి చూసేవారికి మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. శర్వా, సమంత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే సినిమా మొత్తం వీరిద్దరి పాత్రలే ఎక్కువగా కనిపించడం.. అక్కడక్కడ కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. అయితే దర్శకుడు తనకు పట్టున్న లవ్ ఎమోషనల్ సీన్స్ లో బాగా ప్రతిభ కనబరిచాడు. 

 

ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లో అయినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి దిల్ రాజు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా బాగా ఎక్కేస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగ ఎంజాయ్ చేస్తారు. అయితే బి, సి సెంటర్స్ మాత్రం కొద్దిగా నిరాశ తప్పదు.

 

నటీనటుల ప్రతిభ :

 

రామ్ పాత్రలో శర్వానంద్ పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. శర్వానంద్ తప్ప ఈ పాత్ర మరొకరు చేయలేరు. ఇక జానకి అలియాస్ జానుగా సమంత ది బెస్ట్ అనిపించుకుంది. 96 లో త్రిషన్ మరపించేలా సమంత నటన ఉంది. పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్న సమంత జానుగా ప్రేక్షకుల్లో మరోసారి కొన్నాళ్లుగా నిలిచిపోయే పాత్ర చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో రామ్, జానుగా నటించిన వారు కూడా బాగా చేశారు. వర్ష బొల్లమ, శరణ్య ప్రదీప్, వెన్నెల కిశోర్, రఘుబాబులతో పాటుగా సినిమాలో నటించిన మిగతా నటీనటులు కూడా ఆకట్టుకున్నారు.

         

సాంకేతికవర్గం పనితీరు :

 

గోవింద్ వసంత్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్టైన ఆల్బం యాజిటీజ్ ఇక్కడ దించేశాడు.. సినిమాలోని అన్ని సాంగ్స్ కు ముఖ్యంగా బిజిఎం కు ఆడియెన్స్ ఫిదా అవడం ఖాయం. ఇక సినిమాటోగ్రఫర్ కూడా చాలా నీట్ గా తీశాడు. ఇక సినిమా దర్శకుడు ప్రేం కుమార్ తెలుగులో కూడా అదే మ్యాజిక్ రీ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రేమ, ఎమోషనల్ సీన్స్ లో తన ప్రతిభ కనబరిచారు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

 

శర్వానంద్

సమంత

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

ఫ్లాష్ బ్యాక్ సీన్స్

 

మైనస్ పాయింట్స్ :

 

అక్కడక్కడ స్లో అనిపించడం

 

బాటం లైన్ :

 

శర్వానంద్, సమంత జాను.. ప్రేమ ఎప్పటికి ఒక అందమైన జ్ఞాపకమే..!

 

రేటింగ్ : 3.5/5   

మరింత సమాచారం తెలుసుకోండి: