సినిమాటోగ్రఫీ,స్పెయిన్ అందాలు,సంగీతం మరియు నేపధ్య సంగీతంసినిమాటోగ్రఫీ,స్పెయిన్ అందాలు,సంగీతం మరియు నేపధ్య సంగీతంకథ,కథనం,అవసరం లేని ఫైట్స్, నెమ్మదిగా సాగే కథనం

స్పెయిన్ లో జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడానికి వెళ్ళిన వరుణ్ (నితిన్)కి తన ఫ్రెండ్ కి పెళ్లి చెయ్యాలని స్పెయిన్ వచ్చిన హయతి(అదా శర్మ)తో ప్రేమలో పడతాడు. తన వెంటపడుతున్న వరుణ్ ని ద్వేషిస్తుంది కాని లోలోపల వరుణ్ అంటే ఇష్టం ఉంది. హయతి స్నేహితురాలి పెళ్లికి వరుణ్ సాయం చేస్తాడు. తరువాత వరుణ్ కి హయతి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేదని తెలుస్తుంది. ఆ తరువాత వరుణ్ తన తండ్రికి సాయం చెయ్యడానికి ఇండియా తిరిగి చేరుకుంటాడు. అక్కడ నుండి రోమానియా చేరుకున్న వరుణ్ మనసులో హయతి ఉంటుంది. హయతి కోసం వరుణ్ తిరిగి స్పెయిన్ కి తిరిగి వెళ్తాడా? లేదా? హయతి వరుణ్ కోసం వేచి చూస్తుందా లేదా? అనేది మిగిలిన కథ..

నితిన్ ఇటు రొమాంటిక్ అటు ఎమోషనల్ సన్నివేశాలలో చాలా బాగా నటించారు. అదా శర్మ తన డైలాగ్ డెలివరీ మరియు స్టైలింగ్ మీద కాస్త దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మార్ఖండ్ పాత్రలో నటించిన అజాస్ ఖాన్ చాలా బాగా నటించారు. స్లో గా నడుస్తున్న కథనంలో అప్పుడప్పుడు వచ్చిన అలీ మరియు బ్రహ్మానందం కామెడీ కాస్త ఊరటను ఇచ్చింది. మిగిలిన నటులు అందరిలో దేవన్ పాత్రా తప్ప ఎవరు ఆకట్టుకోలేకపోయారు...

కథలో చెప్పుకోదగ్గ బలం లేదు, దర్శకుడు పూరి జగన్నాథ్ పూర్తిగా మసాల ఎంటర్ టైనర్ ని తీయాలని అనుకున్నాడు. అక్కడక్కడా కామెడీ బాగానే పండినా రెండవ అర్ధ భాగంలో అసలు శ్రద్ద తీసుకోలేదు. దర్శకుడిగా పూరి పూర్తిగా అయన స్థాయి దర్శకత్వం చూపెట్టి చాలా రోజులు అయ్యింది. ఈ చిత్రంతో అయిన చూపెడతారు అని అనుకున్న అభిమానులకు ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. సంగీత పరంగా అనూప్ రుబెన్స్ మంచి పాటలు ఇచ్చాడు అలానే నేపధ్య సంగీతం కూడా చాలా బాగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ బాగుంది స్పెయిన్ అందాలను చాలా బాగా చూపెట్టారు. ఎడిటర్ చాలా చోట్ల బాగానే కట్ చేసినా చాలా చోట్ల కట్ చెయ్యకుండా వదిలేసారు రెండవ అర్ధ భాగంలో చాలా సన్నివేశాలను పదును పెట్టి ఉండాల్సింది.. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ఈ చిత్రం మొదటి అర్ధ భాగం అలా అలా సాగిపోతుంది కాని చిత్రం కథలోకి ప్రవేశించడానికి చాలా సమయం తీసుకుంటుంది. పూరి జగన్నాథ్ మరోసారి కథ లేకుండా చిత్రాన్ని చెయ్యడానికి ప్రయత్నించాడు కాని మరోసారి అదే ఫలితాన్ని చేరుకుంది ఇలా కథ లేకుండా ఒక చిత్రం వచ్చి అది విజయం సాదించే వరకు ఇలాంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనిపిస్తుంది కాని ఇలాంటి చిత్రాలు ఎప్పటికీ విజయం సాదించదు అని ఎప్పటికి తెలుసుకుంటారో పూరి గారు, బాలీవుడ్ హీరోయిన్ లు తెలుగులోకి వస్తున్నారంటే బేసిక్ హోం వర్క్ కూడా చెయ్యకుండా వచ్చేస్తున్నారు డబ్బింగ్ చెప్పుకొలెకపొయినా పరవాలేదు కాని లిప్ సింక్ అయినా ఇవ్వగలిగే కథానాయికలు బాగుంటుంది. ఇక పూరి గారి మార్క్ ఉన్న ఐటెం గర్ల్స్ ప్రేక్షకులను భయపెడుతున్నారు కాని ఆకట్టుకోలేకపోతున్నారు. ఇకనయినా పూరి జగన్నాథ్ మంచి కథతో, మంచి కథానాయిక తో కాస్తయిన అందంగా ఉన్న ఐటెం గర్ల్ తో మన ముందుకు వస్తుంది అని ఆశిద్దాం ఇంత చెప్పాక కూడా ఈ చిత్రాన్ని చూడాలి అని అనుకుంటే మీ ఇష్టం ..

Nitin,Adah Sharma,Puri Jagannadh,Anoop Rubensహార్ట్ ఎటాక్ : ప్రేక్షకుడికి గుండెపోటు ..

మరింత సమాచారం తెలుసుకోండి: