మనోజ్ మోహిని పాత్ర,కామెడీ,నేపధ్య సంగీతం,బ్రహ్మానందంమనోజ్ మోహిని పాత్ర,కామెడీ,నేపధ్య సంగీతం,బ్రహ్మానందంపాతబడిపోయిన కథ,ముందుగానే పసిగట్టగలిగే కథనం,ఫైట్స్,అక్కడక్కడా మనోజ్ "నటన"

బ్యాంకాక్ లో ఉంటున్న మోహన్ బాబు కి కొడుకులు అయిన మంచు మనోజ్, వరుణ్ సందేశ్ మరియు తనీష్ కి మరియు రవీనా టాండన్ కొడుకులు అయిన విష్ణు మరియు వెన్నెల కిషోర్ కి మధ్యలో గొడవ జరుగుతుంది. ఇలా తన కొడుకులతో గొడవ పడుతున్నది ఎవరు అని వారి అంతు తేల్చడానికి మోహన్ బాబు రవీనా టాండన్ ఇంటికి రాగా అక్కడ రవీన టాండన్ ని చుసిన మోహన్ బాబు గతం గుర్తొస్తుంది. గతంలో వారిద్దరూ ప్రేమించుకొని విడిపోయుంటారు, ఈ విషయం తెలిసిన హన్సిక వారిద్దరిని పెళ్ళికి ఒప్పిస్తుంది. విష్ణు మరియు మనోజ్ కూడా పెళ్ళికి ఒప్పుకుంటారు. అక్కడ నుండి వారి మధ్య గొడవలు జరుగుతుంటాయి ఇదిలా నడుస్తుండగా హన్సిక ను రఘు బాబు వాళ్ళు కిడ్నాప్ చెయ్యడంతో మొదటి అర్ధ భాగం పూర్తవుతుంది.. అసలు హన్సిక ఎవరు? హన్సికను ఎందుకు కిడ్నాప్ చేసారు? ఈ మధ్యలో వచ్చే ప్రణీత ఎవరు అసలు మోహిని పాత్రా ఏంటి? అప్పటికే ప్రేమలో ఉన్న విష్ణు మరియు హన్సిక పెళ్లి ఎలా చేసారు? అనేది మిగిలిన కథ ..

మోహన్ బాబు నటనా పరంగా అయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాని ఈ చిత్రం మొదటి భాగం అయన పాత్రా హిందీ గోల్ మాల్ 3 చిత్రంలో మిథున్ పాత్రను పోలి ఉంటుంది రెండవ అర్ధ భాగం మొత్తం సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన చంద్ర వంశం చిత్రంలో కృష్ణ గారి పాత్రను పోలి ఉంటుంది కాని ఈ రెండు పాత్రలకి తనదయిన టచ్తో మోహన్ బాబు గారు ప్రాణం పోశారు.

మంచు విష్ణు , హీరోగా నిరూపించుకోవాలన్న తన ప్రయత్నం ఎట్టకేలకు ఈ చిత్రంలో కొంతవరకు ఫలించింది. పాండవులలో భీముడి వంటి పాత్ర పోషించిన విష్ణు ఆ ఫీల్ ని తెప్పించగలిగాడు కాని ఎప్పటిలానే తన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది.

మంచు మనోజ్ , తెలుగు పరిశ్రమలో కష్టపడే తత్వం ఉన్న హీరోలలో ఒకడు అని లేబెల్ ఎసుకున్న మనోజ్ ఈ మధ్య వచ్చిన చిత్రాలలో చేసిన "అతి" ఈ చిత్రంలో కనపడదు. మోహిని పాత్రలో చాలా పరిపఖ్వతతో నటించారు. అయన మోహిని పాత్రలో అయన ప్రదర్శించిన నటన కెరీర్లో బెస్ట్. కొన్ని సన్నివేశాలలో అయన "నటన" కనబరచినా కూడా మొత్తం మీద ఈ చిత్రానికి అయన నటన హెల్ప్ అయ్యింది కాని మైనస్ అవ్వలేదు..

బ్రహ్మానందం పాత్ర చాలా బాగా పేలింది అయన రెండవ అర్ధ భాగంలో చాలా బాగా నవ్వించారు పడిపోతున్న చిత్ర వేగాన్ని అమాంతం అలా లేపి తన భుజాన వేసుకున్నారు.

హిందీ గోల్ మాల్ 3 లో ని తుషార్ కపూర్ పాత్ర తెలుగులో పోషించిన తనీష్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో తేలిపోయాడు. వరుణ్ సందేశ్ చిత్రంలో ఉన్నారు ... ? ఉన్నారా? ఆ ఉన్నారు అనుకోవలసిందే .. దాసరి గారు ఉన్నదీ ఒక్క నిమిషమే అయినా అయన ఉన్నంతసేపు నవ్వించారు...

రవీన టాండన్ చాలా తెర మీద కనిపించి ఆకట్టుకుంది సరిగ్గా చెప్పాలంటే ఆకట్టుకునే స్థాయి పాత్ర కాకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కీలక పాత్ర పోషించిన హన్సిక చాలా బాగా నటించింది, ప్రణీత సుభాష్ పాత్రా దేనికోసం అయితే రాసుకున్నారో ఆ ఫలితాన్ని చేరుకోగలిగింది. అలీ, వెన్నెల కిషోర్ , ముఖేష్ రుషి, సుప్రీత్ , గిరిబాబు, ఫిష్ వెంకట్, లిస్టు చాలా పొడవే ఉంది అందరు కూడా కథ నడవడానికి వారి చేతనయినంత సాయం చేసారు.. సరిగ్గా చెప్పాలంటే ఎవరి పాత్ర ఉన్నంతసేపు వారు తెర మీద కనిపిస్తూ గడిపేశారు..

దర్శకుడు శ్రీవాస్ చాలా తెలివయిన దర్శకుడు ఎవరికీ ఎలాంటి పాత్ర ఇవ్వాలో వారికి అలంటి పాత్రనే ఇచ్చారు అంతే కాకుండా ఎవరి చేత ఎంతవరకు నటింపజేయాలో అంతవరకే నటింపచేసారు. కథ విషయంలో మొదటి అర్ధభాగం గోల్ మాల్ 3 రెండవ అర్ధ భాగం చంద్ర వంశం చిత్ర కథలు ఛాయలు కనిపిస్తాయి అందులోనూ ఈ రెండు చిత్రాలను కలపడంలో దర్శకుడు సరిగ్గా సఫలం అయ్యారు. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవలసింది రెండవ అర్ధ భాగంలో చెప్పాలనుకున్న కథను వదిలేసి చాలా విషయాలను తెర మీదకు తీసుకొచ్చారు ఇక్కడ కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటె మరింత బాగుండేది.. డైలాగ్స్ రచించిన కోన వెంకట్ అక్కడక్కడా విసిగించినా చాలా వరకు మెప్పించారు. బప్పా లహరి మరియు అచ్చు అందించిన పాటలు బాగానే ఉన్నాయి మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఈ చిత్రానికి మేజర్ హైలెట్, విష్ణు ని ఎలివేట్ చెయ్యడంలో కాని సెంటిమెంట్ సన్నివేశాలలో కాని అయన నేపధ్య సంగీతం చాలా తోడ్పడింది, ఎడిటర్ రెండవ అర్ధ భాగంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది మిగిలిన అన్ని సన్నివేశాలు బానే ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ పరవాలేదనిపించాడు కాని ఫై సన్నివేశాలలో ఈ విభాగం విఫలం అయ్యింది.. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి కొన్ని చోట్ల అనవసర ఖర్చు అయినా కూడా సరయిన ప్రదేశాలలో సరిగ్గా ఖర్చు పేటి చిత్రానికి "రిచ్" టచ్ ఇచ్చారు..

లక్ష్యం చిత్రంతో పరిశ్రమకు పరిచయమయిన దర్శకుడు శ్రీవాస్ తరువాత రామ రామ కృష్ణ కృష్ణ తో అపజయం ఎదుర్కున్న ఈ చిత్రంతో మళ్ళీ తనను నిరూపించుకునే ప్రయత్నం చేసాడు ముఖ్యంగా ఈ చిత్రంలో నటులను వాడుకున్న తీరు మెచ్చుకోదగ్గ విషయం ఎవరికీ ఎక్కడ ప్రాముఖ్యత ఇవ్వాలో అక్కడ వారికి ఇచ్చాడు. రొటీన్ చిత్రమే ఇది కాని మంచు వారి నుండి చిత్రం అనగానే సగటు ప్రేక్షకుడికి ఉన్న అంచనాలను తారుమారు చేస్తూ చిత్రం చాలా బాగుంది అనే స్థాయిలో కాకపోయినా చూడచ్చు అన్న స్థాయిలో నిలిచింది. సన్నివేశాలకు ఒకసారి వహ్చె మోహన్ బాబు గారి "క్లాసు" గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్, మొదటి అర్ధ భాగం మొత్తం గోల్ మాల్ లానే ఉన్నా ఎక్కడా కూడా ఏ నటుడు తన మార్క్ చుపించుకొవలన్న ప్రయత్నం చెయ్యలేదు ఎంతవరకు నటించాలో అంతవరకే నటించారు గోల్ మాల్ నుండి తీసుకున్న కొన్ని సన్నివేశాలను బాగా తీయలేకపోయినా చెడగొట్టలేదు.మంచు విష్ణు అదే పనిగా తనలో ని హీరో ను ఎలివేట్ చెయ్యాలన్న ప్రయత్నం చేసారు అందులో కొంతవరకు సఫలం అయ్యారు కూడా, మనోజ్ "మోహిని" పాత్రలో చాలా సమతుల్యత తో కూడానా నటనను ప్రదర్శించి ప్రేక్షకుల ముక్కున వేలేసుకునేట్టు చేసాడు.

మాకు హీరోయిన్ లేదని అనుకున్నారేమో తనీష్ మరియు వరుణ్ సందేశ్ ఏదో నటిస్తున్నాం అనే కాని ఆకట్టుకోవాలన్న ఆలోచన ఎక్కడా కనపడదు. మంచు మనోజ్ వదిలేసినా అతిని హన్సిక అక్కడక్కడా చూపించింది కాని చాలా వరకు సన్నివేశాలలో చాలా బాగా నటించింది. ఈ చిత్ర రెండవ అర్ధ భాగం చంద్ర వంశం లానే కాకుండా శ్రీను వైట్ల తెరకెక్కించిన "రెడీ" అనే చిత్రాన్ని పోలి ఉంటుందింఅహ భారతంలో కౌరవులు మరియు పాండవులు వారి మధ్య జూదం ఇలాంటి అంశాలను బాగా తీసుకున్నా కూడా మరింత వర్క్ అవుట్ చేసి ఈ అంశాలను ఇంకాస్త ధృడంగా చెప్పుంటే చాలా బాగుండేది. మొత్తం మీద ఈ చిత్రాన్ని మనోజ్ "మోహిని" నటన బ్రహ్మానందం కామెడీ మరియు మణి శర్మ నేపధ్య సంగీతం కోసం అక్కడక్కడా మనోజ్ "నటన " ని భరించెసి, సన్నివేశం ముందే తెలిసిపోయినా తెలియనట్టు నటించేసి ఒకసారి చూసేయచ్చు ...

Vishnu Vardhan Babu,Manchu Manoj Kumar,Hansika Motwani,Mohan Babu,Srivasపాండవులు పాండవులు తుమ్మెద - ఈ మధ్య కాలంలో వచ్చిన మంచు వారి మంచి చిత్రం ...

మరింత సమాచారం తెలుసుకోండి: