రౌడీ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా హీరోయిన్స్ గా నటించిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను కె.ఎస్ రామారావు నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

 

రైటర్ అయిన గౌతమ్ (విజయ్ దేవరకొండ) జైలులో ఉండి ఓ బుక్ రాయాలని అనుకుంటాడు. ప్రేమలో విరహ వేదనని అనుభవిస్తున్న అతను వివిధ రకాల ప్రేమ కథలను రాస్తుంటాడు. అతని కథల్లోనే శీనయ్య, సువర్ణ.. గౌతం, ఇజా.. ఇలా ప్రతి కథను అందంగా మొదలు పెట్టి చివరకు స్మాల్ ట్విస్ట్ తో ఎండ్ చేస్తాడు. అయితే అసలు ఇంతకీ గౌతం ఎందుకు తన ప్రేయసి యామినికి దూరమయ్యాడు..? గౌతం, యామిల ప్రేమకథ ఎలా మొదలైంది..? గౌతం వరల్డ్ ఫేమస్ లవర్ అనిపించుకున్నాడా లేడా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

విశ్లేషణ :

 

వరల్డ్ ఫేమస్ లవర్.. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రేమికుడి కథ అంటూ ఓ నాలుగు ప్రేమకథలతో వచ్చాడు క్రాంతి మాధవ్. తనకు బాగా పట్టున్న లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో బాగా వర్క్ అవుట్ చేసిన క్రాంతి మాధవ్ సినిమా మొత్తం సీరియస్ మోడ్ లో తీసుకెళ్లడం మైనస్ అని చెప్పొచ్చు. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా మిస్సయ్యింది. దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్పాలనుకున్న జీవిత సత్యాన్ని వరల్డ్ ఫేమస్ లవర్ ఫుల్ ఫిల్ చేయలేకపోయింది.

 

సినిమా కోర్ పాయింట్ ను ఇప్పటి యువత.. అదికూడా ప్రేమలో మునిగితేలుతున్న యువత కన్నా ప్రేమలో విఫలమైన వారికి బాగా అర్ధమవుతుంది. మన పక్కన ఉన్నప్పుడు మనిషి యొక్క గొప్పతనం తెలియదు కాని అదే మనిషి దూరమైతే కాని వారి గొప్పతనం తెలుస్తుందని చెప్పే కథతో వచ్చిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పిస్తుందని చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ మెప్పించాగా సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ అర్జున్ రెడ్డి సినిమా తాలూఖా పోకడలు కనిపిస్తాయి.  

 

డైరక్టర్ క్రాంతి మాధవ్ కథ బాగానే రాసుకున్నా కథనంలో ట్రాక్ తప్పాడని చెప్పొచ్చు. మంచి కాస్టింగ్.. గ్లామరస్ హీరోయిన్స్.. మంచి ప్రొడక్షన్ ఇలాంటి అన్ని వ్యాపకాలు ఉన్నా డైరక్టర్ మాత్రం వాటిని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. ఈ సినిమా ట్రాజడీ ఎండింగ్ కూడా సినిమాకు మైనస్సే. యువత మెచ్చే అంశాలు.. భగ్న ప్రేమికులకు నచ్చే సినిమాగా వర్ల్డ్ ఫేమస్ లవర్ ఉంది. 

 

నటీనటుల ప్రతిభ :

 

వరల్డ్ ఫేమస్ లవర్ మూడు పాత్రల్లో విజయ్ తన పర్ఫార్మెన్స్ లో ది బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. ముఖ్యంగా శీనయ్యగా అతని అభినయం సూపర్ అనిపించింది. ఐశ్వర్యా రాజేష్ సహజ నటన ఆకట్టుకుంది. రాశి ఖన్నా కూడా మెప్పించింది. కేథరిన్, ఇజా బెల్లా పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెస్ చేశాయి. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

 

జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. విజయ్ నాలుగు లవ్ స్టోరీస్ లో కెమెరా వర్క్ బాగుంది. సాంగ్స్ లో కూడా అందంగా చూపించారు. లొకేషన్స్ కూడా బాగున్నాయి. గోపి సుందర్ మ్యూజిక్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. బిజిఎం ఆకట్టుకుంది. ఇలాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమాకు మ్యూజిక్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ విషయంలో గోపిసుందర్ నిరాశపరచాడు. ఈ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చుంటే వేరే లెవల్ లో ఉండేది. ఇక కథ బాగా రాసుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్ కథనంలో తేలగొట్టేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ తప్ప సినిమా గ్రిప్పింగ్ మిస్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

 

విజయ్ 

ఐశ్వర్యా రాజేష్ 

రాశి ఖన్నా

కొన్ని ఎమోషనల్ సీన్స్

 

మైనస్ పాయింట్స్ :

 

వీక్ స్క్రీన్ ప్లే

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్స్

సెకండ్ హాఫ్ 

 

బాటం లైన్ :

 

వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ దేవరకొండ కోసం మాత్రమే..!   

 

రేటింగ్ : 2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి: