ఒక్క సీన్ కూడా బాగుండకపోవడంఒక్క సీన్ కూడా బాగుండకపోవడంఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా చూడవలసి రావడం

మై ఎఫ్ ఎం లో రేడియో జాకి గా పని చేస్తుంటాడు రాకీ (ఆర్య సందీప్), అదే ఎఫ్ ఎం ఒక టివీ ఛానల్ ని మొదలు పెడుతుంది అందులో హీరో ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఇదిలా ఉండగా పంచతులసి ఓనర్ అయిన రాకీ వాళ్ళ నాన్న రాకీ ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఒక్కో పెళ్లి చూపులు ఒక్కో కారణంతో చెడిపోతుంటుంది. అసలు కారణం ఏంటి అని హీరో స్నేహితులు అడుగగా తన గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు రాకీ, తన స్నేహితుడి పెళ్లిలో తను శ్రావణి(నీతి టేలర్) ని మొదటి చూపులోనే ప్రేమించా అని చెప్తాడు కాని శ్రావణి ప్రేమకు ఒప్పుకోదు అప్పటి నుండి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు రాకీ, ఈలోగా రాకీ వాళ్ళ నాన్న రాకీ కి తెలియకుండా పెళ్లి కుదురుస్తాడు. ముందు ఒప్పుకోకపోయినా ఒత్తిడి మీద రాకీ ఒప్పేసుకుంటాడు తీరా పెళ్లి మండపంలో చూస్తే పెళ్లి కూతురిగా శ్రావణి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు రాకీ పెళ్లి కూడా అయిపోయాక శోభనం రాత్రి శ్రావణి రాకీ ని దగ్గరకు రానివ్వదు ... ఎందుకు రానివ్వదు? అసలు రాకీ మరియు శ్రావణి ల మొదటి రాత్రి జరిగిందా లేదా జరిగితే ఎలా జరిగింది జరగకపోతే ఎందుకు జరగలేదు అనే ప్రశ్నలు ఉంటె ఈ చిత్రాన్ని చూడాల్సిందే ....

ఆర్య సందీప్ నటనలో ABCD లు కూడా దిద్దలేదు తెర మీద ఎలాంటి సన్నివేశానికి ఎటువంటి హావభావం ఇవ్వాలో తెలియక బిక్కమొహం వేసుకొని చిత్రం మొత్తం గడిపేసాడు. నీతి టేలర్ నటించకూడదు అనుకున్నంత వరకు బాగానే ఉంది ఒక్కసారి నటించాలి అనుకున్న వెంటనే తన నటన వర్ణనాతీతం స్థాయికి వెళ్లిపోయింది తను నటించక పోయుంటేనే బాగుండేది అనిపించింది. ధర్మవరపు గారి పాత్ర ఈ చిత్రం లో అసలు బాగోలేదు ఇక జయప్రకాశ్ రెడ్డి మరియు ఎం ఎస్ నారాయణ పాత్రలు సరే సరి, మొత్తం మీద ఈ చిత్రంలో చాలా మంది నటులకు నటన రాదు నటన వచ్చిన వాళ్ళు నటించాలి అనుకోలేదు..

దర్శకుడు రాజ వన్నెం రెడ్డి పరిశ్రమలో ఒక సీనియర్ దర్శకుడు, ఒక సీనియర్ దర్శకుడు ఇలాంటి చిత్రాన్ని తీస్తాడు అని ఎవరు ఊహించలేరు ఒక్క సన్నివేశంలో కూడా దర్శకుడి ప్రతిభ కాని అనుభవం కాని కనపడలేదు, పూర్తి స్థాయిలో విఫలం అయ్యాడు దర్శకుడు. కథనం అయితే దారుణం స్పూఫ్ లు తోనే చిత్రాన్ని నడిపించేయచ్చు అనుకున్నారు. మాటలు అసలు బాగోలేదు. నిజానికి మాటల కన్నా బూతులు ఎక్కువ. బి-గ్రేడ్ చిత్రాలను పోలిన సినిమాటోగ్రఫీ అందించడంలో సినేమతోగ్రఫర్ సఫలం అయ్యాడు. అదే స్థాయి ఎడిటింగ్ ఇవ్వడంలో ఎడిటర్ కూడా సఫలం అయ్యాడు. వీరికి తనేం తక్కువ కాదు అనుకున్నారేమో చక్రి చాలా నాసిరకమయిన సంగీతాన్ని అందించాడు. నిర్మాణ విలువలు కూడా బి-గ్రేడ్ స్థాయిలోనే ఉన్నాయి.

బూతు రాజ్యమేలుతున్న సమయం ఇది ఇప్పటి వరకు ఎన్నో బూతు చిత్రాలు చూసి ఉంటారు కాని ఇటువంటి బూతు చిత్రాన్ని చూడటం ఇదే మొదటిసారి అవుతుంది. ఒక చిత్రంలో ఇది బాగోలేదు అది బాగోలేదు అని చెప్పవచ్చు కాని ఏదీ బోగోలేని చిత్రంలో ఏది బాగోలేదో చెప్పడం ఎంత కష్టమో ఈరోజు అర్ధం అవుతుంది. ఆ సినిమా స్పూఫ్ లు ఈ సినిమా స్పూఫ్ ల తో సగానికి పైగా చిత్రాన్ని నింపేశారు డైరెక్టర్ అవేమయినా బాగున్నాయ అంటే అవీ అంతంత మాత్రమే, ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి గారి చేత ఒక డైలాగ్ చెప్పించారు.

" ప్రతి పాతికేళ్ళకు బూతు పవిత్రం అయిపోతుంది ఇప్పుడు మీరు బూతు అనుకుంటున్నదే పాతికేళ్ళ తరువాత పవిత్రం అయిపోతుంది".

ఇదే ఆ డైలాగ్, మురికి కాలువ పాతికేళ్ళ తరువాత పుణ్యక్షేత్రం అయిపోదు డైరెక్టర్ గారు పాతికేళ్ళు అయిన నూరేళ్ళు అయిన మురికి కాలువను మురికి కాలువ అనే అంటారు.. పెళ్ళయిన కొత్తలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ చూపించారు మొదటి రాత్రి గురించిన కథ కాని అందులో చాలా పరిపక్వత ఉంటుంది ఈ చిత్రంలో మొదటి రాత్రిని బూతులా చూపెట్టాడు..ఈ చిత్రం చూస్తుంటే పేషంట్ లు తగ్గిపొయరని మానసిక వైద్యులు అందరు కలిసి ఇలాంటి చిత్రాన్ని నిర్మించి జనం మీదకు వదిలితే వారికి పేషంట్ లు పెరుగుతారు అన్న ఆలోచనతో ఈ చిత్రాన్ని విడుదల చేసినట్టు ఉన్నారు అన్నఅనుమానం వచ్చేస్తుంది. మీకు తలపోటు తెలిసి ఉంటుంది గుండెపోటు తెలిసి ఉంటుంది కాని సినిమా పోటు అంటే ఏంటో తెలుసుకోవాలని ఉంటె వెంటనే ఈ చిత్రానికి వెళ్ళండి... ఎంతటి గుండె బలం గల వ్యక్తి అయినా ఈ చిత్ర ప్రభావం నుండి బయటపడడానికి కనీసం పదిహేను నిముషాలు తీసుకుంటాడు ...

గమనిక : మీకు కోపాన్ని కంట్రోల్ చేసుకోగలను అని నమ్మకం ఉంటేనే ఈ చిత్రానికి వెళ్ళండి లేకపోతే ఆవేశం తట్టుకోలేక పిచ్చి పట్టిన వాడిలా పక్కన వ్యక్తి మీద దాడి చేసినా చేసే అవకాశం ఉంది..

Niti Taylor,Aarya Sandeep,Raja Vannemreddy,CH V Brinda Reddy.టార్చర్ డాట్ కాం

మరింత సమాచారం తెలుసుకోండి: