అల్లరి సినిమాతో దర్శకుడిగా మారిన రవిబాబు రూపొందించిన కొత్త సినిమా అవును. మిగిలిన దర్శకుల కంటే విభన్నంగా సినిమాలను తెరకెక్కించాలనుకునే రవిబాబు తపనే అతనికి ప్రేక్షకులలో ఓ గుర్తింపుని తీసుకుని వచ్చింది. మరి ఆ గుర్తింపు ని తన తాజా అవును సినిమాతో నిలబెట్టుకున్నాడా..? వాస్తవ సంఘటన ఆధారం గా తెరకెక్కిందని ప్రచారం చేసుకుంటున్న అవును సినిమా అసలు కథ ఏమిటో చూద్దాం..!     చిత్ర కథ : కొత్తగా పెళ్లయిన దంపతులు మోహిని, హర్ష (పూర్ణ, హర్షవర్థన్ రానే) నగరానికి దూరంగా ఒక కాలనీలో ఉన్న కొత్త ఇంట్లోకి కాపురానికి వస్తారు. అయితే ఆ భార్యకు ఇంట్లో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో ఉండే ఆత్మ ఆమె మీద కోరిక పెంచుకుంటుంది. ఆ ఆత్మ ఎవరు..?, ఆ ఆత్మ కు, ఆ ఇలాల్లికి జరిగిన ఘర్షణలో భర్తకు ఏం జరిగింది... అనే ఆంశాలతో సినిమా సాగుతుంది. నటీనటుల ప్రతిభ : మోహినిగా పూర్ణ మంచి నటన కనబరిచింది. ప్రేమ, భయం వంటి భావాలను చక్కగా పలికించింది. హర్షవర్థన్ రానే నటన కూడా బావుంది. ముఖ్యంగా ఆత్మ అతన్ని ఆవహించినప్పుడు బాగా నటించాడు. చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి కనిపించింది కొద్ది సేపే అయినా ఆకట్టుకుంటారు. మిగిలిన వారు తమ తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : హర్రర్ కథాంశంతో తెరకెక్కే ఇలాంటి సినిమాలకు ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం ప్రాణం. ఈ అవును సినిమాకు ఆ రెండు బాగా కుదిరాయి. మాటలు ఓకే. హర్రర్ కథాంశంతో తెరకెక్కే ఇలాంటి సినిమాలను రూపొందించడం కత్తి మీద సాము లాంటిది. కొద్దిగా పట్టు తప్పినా హర్రర్ కాస్త చూసేవారికి కామెడి అయిపోతుంది. అయితే ఈ పనిని రవిబాబు చక్కగా చేశాడు. దర్శకత్వం మీద తనకు ఉన్న పట్టును చూపించాడు. ఎలాంటి కథాంశం అయినా తీయడానికి తాను సిద్ధం అని చెప్పుకున్నాడు. అయితే, రవిబాబు ఈ సినిమాకు కథ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోలేదు. టైటిల్స్ వేయడం ప్రారంభం నుంచి తన ప్రత్యేకత చూపించిన రవిబాబు సినిమా లో చాలా భాగాన్ని ఆసక్తికరంగా తీశాడు. ఈ హర్రర్ సినిమాతో ప్రేక్షకులను బాగానే భయపెట్టాడు. సినిమా అంతా ఒకే టెంపోలో తీసుకుని వెళ్లాడు. ఇలాంటి కథాంశానికి పాటలు ఉంటే ఇబ్బందని పాటలను కూడా వదిలేశాడు.  అయితే, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమాకు సరైన ముగింపు లేకపోవడం ప్రధాన లోపం. ముగింపు మీద దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టి ఉండే మంచి హర్రర్ సినిమా అయిఉండేది. హైలెట్స్ : పూర్ణ నటన, సంగీతం, ఫోటోగ్రఫీ, డ్రాబ్యాక్స్ : కొందరికి మాత్రమే నచ్చే కథాంశం, స్పష్టమైన ముగింపు లేకపోవడం చివరగా : హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి అవును మంచి టైంపాస్ అవును టీం: బ్యానర్ : ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నటీనటులు : పూర్ణ, హర్షవర్థన్ రానే, చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి, రవిబాబు తదితరులు ఫోటోగ్రఫీ : సుధాకర్ రెడ్డి, సంగీతం : శేఖర్ చంద్ర నిర్మాత : రవిరాబు, సురేష్ బాబు, దర్శకత్వం : రవిబాబు Read More Articles on Avunu  |  Enjoy Avunu Photos  |  Watch Avunu Videos Avunu  :: Tweet Review || English Review    

మరింత సమాచారం తెలుసుకోండి: