అల్లు అర్జున్, బ్రహ్మానందం కామెడీ, సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం అల్లు అర్జున్, బ్రహ్మానందం కామెడీ, సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతంపస లేని కథ, పట్టు లేని కథనం, దర్శకత్వం, పాత్రలను సరిగ్గా వాడుకోలేకపోవడం

రామ్ (శ్యాం) మరియు లక్ష్మణ్(అల్లు అర్జున్) అన్నదమ్ములు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి గొడవపడుతూ పడుతూ ఉంటారు. కష్టపడి పోలిస్ అవుతాడు రామ్ అమెరికా కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు లక్ష్మణ్. అలాంటి లక్ష్మణ్ జీవితంలో కి ఏ స్పందనా ఉండని స్పందన(శృతి హాసన్) ప్రవేశిస్తుంది, కొద్ది రోజులకే స్పందనను ప్రేమలోకి దింపుతాడు లక్ష్మణ్. అదే సమయంలో లక్ష్మణ్ జీవితంలో కి ప్రవేశిస్తాడు శివా రెడ్డి (రవి కిషన్), మంత్రి అవ్వాలని ప్రయత్నిస్తున్నశివారెడ్డి ని ఎలాగయినా ఆపాలని ప్రయత్నిస్తుంటాడు రామ్, అలానే రామ్ ని చంపేయాలన్న ప్రయత్నంలో అనుకోకుండా లక్ష్మణ్ కి మరియు శివారెడ్డి కి మధ్య వైరం ఏర్పడుతుంది అక్కడ నుండి మొదలవుతుంది రేస్, ఈ రేసు లో ఇద్దరిలో ఎవరు గెలిచారు? మధ్యలో కిల్ బిల్ పాండే ఎవరు? అనేది తెర మీద చూడవలసిందే..

అల్లు అర్జున్ రోజు రోజుకి తన నటన మరియు ఆహార్యంలో తేడా చూపిస్తున్నవర్ధమాన నటుల్లో మొదటి వరసలో నిలబడ్డాడు. ఈ చిత్రంలో నటన అతని కెరీర్ లో మరో మెట్టు అవుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ని చూసిన ఫీల్ ఎక్కడ కనపడనివ్వలేదు, లక్కీ అనే పాత్ర మాత్రమే తెర మీద కనిపిస్తుంది. ఇక డాన్సు లు ఫైట్ లు విషయంలో అతని స్థాయి ప్రతిభని కనబరిచారు. మరో ముఖ్య పాత్ర అయిన శ్యాం పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక శృతి హసన్ విషయానికి వస్తే ఈ పాత్రను సరిగ్గా ఎలివేట్ చేయ్యకపోవడంతో శృతి హసన్ పాత్ర చాలా తక్కువ సన్నివేశాలకే పరిమితం అయ్యింది ఉన్నంతలో కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది.

ఇక ఈ చిత్రానికే హైలెట్ అయిన బ్రహ్మానందం నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా బాగా నెమ్మదిగా సాగుతున్నప్పుడు వచ్చిన అతని పాత్ర ప్రవేశించగానే ఒక్క సారిగా సినిమాని హై స్పీడ్ లో పరిగెత్తింది. ప్రకాష్ రాజ్ పాత్ర చాలా అర్ధంతరంగా ముగించేసాడు, ఉన్నకాసేపు కూడా ఆకట్టుకోలేకపోయాడు ప్రకాష్ రాజ్. సలోని పాత్ర మెరుపుతీగ వంటిది అలా వచ్చింది ఇలా వెళ్లిపోయింది. ఇక విలన్ పాత్రలో చేసిన రవి కిషన్ బొత్తిగా ఆకట్టుకోలేకపోయారు. జాతీయ అవార్డు గ్రహీత నుండి ఇటువంటి ప్రదర్శన ఎవరూ ఊహించరు. తనికెళ్ళ భరణి , జయప్రకాశ్ రెడ్డి , ఎం ఎస్ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, ముఖేష్ రుషి ఇలా అందరు వచ్చి వెళ్ళిపోయారు కాని ఆకట్టుకోలేకపోయారు ...

సురేందర్ రెడ్డి దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి గత చిత్రాలు విఫలం అయినా అయన దర్శకత్వం విషయంలో విఫలం అవ్వలేదు కాని ఈ చిత్రంలో ఆయన స్థాయి ప్రతిభ కనబరిచలేదు. వక్కతం వంశీ అందించిన కథ సింగల్ పాయింట్ మీద రాసుకున్నారు అన్నదమ్ముల మధ్యన అల్లుకున్న కథ. కాబట్టి కథనం మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసింది. మొదటి అర్ధ భాగం అంతా ఏదో అలా అలా నడిపెసారు రెండవ అర్ధ భాగంలో సెంటిమెంట్ కోసం ఉండవలసిన బలమయిన సన్నివేశాలు లేకపోవడంతో బాగా కథనం లో బలం లేకుండా పోయింది. వేమారెడ్డి అందించిన డైలాగ్స్ అక్కడక్కడ మాత్రమే బాగున్నాయి.

మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన హైలెట్స్ లో ఒకటి, ముఖ్యంగా పాటల విషయంలో లోకేషన్స్ ని చాలా అందంగా చూపించారు. సంగీతం విషయంలో తమన్ అందించిన పాటలలో రెండు పాటలు బాగున్నాయి, నేపధ్య సంగీతం కూడా చాలా బాగా అందించారు. ఈ మధ్య కాలంలో తమన్ అందించిన బెస్ట్ మ్యూజిక్ ఈ చిత్రంలో వినిపిస్తుంది. ఎడిటింగ్ అందించిన గౌతం రాజు చాలా పదునుగా సన్నివేశాలను కత్తిరించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి..

సురేందర్ రెడ్డి చిత్రం అనగానే కథనం ఈ చిత్రంలో కథనం చాలా వీక్ , నటన పరంగా అల్లు అర్జున్ నటన ఇరగదీస్తున్నా అతని పక్కన విలన్ గా చేసిన రవి కిషన్ నుండి అతని స్థాయి నటన రాబట్టుకోలేకపోయారు. నిజానికి ఎక్కడో మొదలు పెట్టి ఎటో తీసుకెళ్ళి ఎం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ పెట్టి గెలిచేసిన రేస్ గుర్రం ఇలా ఉండాల్సిన చిత్రం కాదు. హీరో ని మొదటి నుండి సరిగ్గా ఎలివేట్ చేసుంటే చివర్లో అల్లు అర్జున్ పాత్రను పక్కన పెట్టి బ్రహ్మానందాన్ని హైలెట్ చెయ్యాల్సిన అవసరం లేదు.

ఇక శృతి హసన్ ఎలాగు హావభావాలు పలికించలేదు కాబట్టి అలాంటి పాత్రనే రాసుకున్నారు. సురేందర్ రెడ్డి ఈ విషయంలో అతని తెలివి తేటలను మెచ్చుకొని తీరాలి. చిత్రం మొదలవ్వగానే కామెడీ సన్నివేశాలతో నింపేశారు అక్కడక్కడా పేలినా కొన్నిచోట్ల కామెడీ సరిగ్గా పండలేదు ఒక్క అల్లు అర్జున్ మాత్రమే చిత్రాన్నిఇంటర్వెల్ వరకు తీసుకు వచ్చారు. రెండవ అర్ధ భాగం మొదలవ్వగానే కామెడీ కూడా తగ్గడంతో చిత్రం వేగం తగ్గిపాయింది. చివర్లో బ్రహ్మానందం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు, నిజానికి ఈ బీభత్సం చిత్రాన్ని కాపాడింది. ఇక చాలా రోజుల తరువాత మంచి ఆల్బం ఇచ్చిన తమన్ ప్రతిభ ను సురేందర్ రెడ్డి బుగ్గిపాలు చేసారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఉన్నారు అపిిపించారు కారణం దర్శకుడు ఆయన పాత్రను ఇంత సాదా సీదాగా తీస్తారని ఎవ్వరూ ఊహించరు. ఇలాంటి పాత్ర ఎందుకు చేసాడు అని అందరికి అనుమానం రావడం కచ్చితం. ఇలాంటి పాత్రలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి.

రవి కిషన్ లాంటి జాతీయ అవార్డు గ్రహీత నుండి నటన రాబట్టుకోవడం లో విఫలం అవ్వడం సురేందర్ రెడ్డి ప్రతిభనే సందేహించేలా ఉంది. మొత్తానికి ఈ చిత్రం వేగంగా మొదలయినా ఒకానొక స్టేజి లో బాగా నెమ్మదిస్తుంది మళ్ళీ బ్రహ్మానందం వచ్చి చిత్రాన్ని అమాంతం తారాస్థాయికి తీసుకెళ్ళారు. ఇక ఈ చిత్రాన్ని ఎందుకు చూడకూడదు అని అడిగితే కథ కథనం దర్శకత్వం మాటలు ఇంకా పరిపఖ్వత లేని పాత్రలు, ఎలివేషన్ లేని సన్నివేశాలు ఇక ఎందుకు చూడాలి అంటే అల్లు అర్జున్ నటన కోసం, బ్రహ్మానందం కామెడీ కోసం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ కోసం ... మొత్తంగా బ్రహ్మానందం కామెడీ కోసం ఒక్కసారి కచ్చితంగా చూడదగ్గ చిత్రం ...

Allu Arjun,Shruti Haasan,Surender Reddy,Nallamalapu Srinivas.రేసు గుర్రం - పేస్ లేని రేసు గుర్రం

మరింత సమాచారం తెలుసుకోండి: