సినిమా మొదటి 10 నిమిషాలు, సినిమా చివరి 5 నిమిషాలు, రాధిక పెర్ఫార్మన్స్ సినిమా మొదటి 10 నిమిషాలు, సినిమా చివరి 5 నిమిషాలు, రాధిక పెర్ఫార్మన్స్ గోరాతి ఘోరంగా అనిపించే గ్రాఫిక్స్, దుష్టశక్తిని అస్సలు ఎలివేట్ చేయకపోవడం, అమ్మోరు + దేవీ + దేవుళ్ళు = అవతారం కాన్సెప్ట్ కావడం, స్క్రీన్ ప్లే, బోరింగ్ సెకండాఫ్, లాజిక్ లేని రీజన్ లేని హీరో రిషి పాత్ర

విశ్వం మొదలయినప్పుడే దుష్ట శక్తి కూడా మొదలయ్యింది, ఆ శక్తిని ఆపడానికి దేవతలు అంతా గరుల కోట శక్తులకు లొంగి ఉండాలి అన్నది ఒప్పందం. సింహరాశి లో పుట్టిన ఒక వ్యక్తి లేదా ఏదయినా జీవి అగ్నికి ఆహుతి అయితే వారికి విముక్తి కలుగుతుంది. అలా నలుగు అక్కచెల్లెళ్ళు అగ్నికి ఆహుతి అవ్వడంతో అక్కమ్మకు విముక్తి లభిస్తుంది. పుట్టినప్పటి నుండి అక్కమ్మకు భక్తురాలిగా ఉంటుంది రాజేశ్వరి(రాధిక) , అదే ఊర్లో పిచ్చి వాడయిన ఆస్థి పరుడు ప్రసాద్(రిషి) తో రాజేశ్వరి పెళ్లి చేస్తారు. అదే సమయంలో పుడతాడు కర్కోటకుడు , తన ప్రాణానికి ప్రమాదం అయిన రాజేశ్వరిని ఎలాగయినా చంపాలని నిర్ణయించుకుంటాడు కర్కోటకుడు. అలా ఈ భూ ప్రపంచాన్ని నాశనం చెయ్యాలనేది అతని ఆలోచన. కర్కోటకుడిని దైవ శక్తి ఎలా నాశనం చేసింది అన్నదే ఈ చిత్రం మిగిలిన కథ ...

రాధిక పోషించిన పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరిచింది, ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాలలో తన ప్రదర్శన చాలా బాగుంది అంతే కాకుండా ఆమె అందంగా కూడా ఉండటంతో అటు అభినయం ఇటు అందంతో ఆకట్టుకోవడంలో సఫలం అయ్యింది. అక్కమ్మ పాత్రలో భాను ప్రియ నటన ఎప్పటిలానే చాలా బాగుంది ఇలాంటి పాత్రలకు సరిగ్గా సరిపోయే భానుప్రియ చాలా ఆకట్టుకుంది. రిషి నటనా పరంగా బాగున్న అతని పాత్రకు ఎటువంటి ప్రాముఖ్యత లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయాడు. ఇక చివరిగా విలన్ గా చేసిన సత్యప్రకాష్ తన అనుభావానికి తగ్గ ప్రదర్శన కనబరిచారు కాని తనకు ఈ గెట్ అప్ బొత్తిగా సూట్ అవ్వలేదు ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది..

కథాపరంగా అమ్మోరు వంటి కథనే ఎంచుకున్నారు కోడి రామ కృష్ణ గారు కథనం కూడా అదే రకంగా సెంటిమెంట్ చుట్టూ రాసుకున్న సన్నివేశాలు అందులో కూడా చాలా నెమ్మదిగా సాగుతుండటంతో ప్రేక్షకుడిని చిరాకు పెట్టేస్తుంది ఇక ఈ చిత్రానికి మరో ముఖ్యాంశం అయిన గ్రాఫిక్స్ పరంగా ఈ చిత్రం ఘోరం , ఈ చిత్రానికి ఒక్క శాతం కూడా సహాయపడే అవకాశం లేదు అంత నాసిరకం అయిన గ్రాఫిక్స్ ఉపయోగించారు. సినిమాటోగ్రఫీ బోత్తిగా బాగాలేదు దీనికన్నా లఘు చిత్రాలలో మంచి క్వాలిటీ ఉన్న సినిమాటోగ్రఫీ కనిపిస్తుంది. సంగీతం ఆకట్టుకోలేకపోయింది నేపధ్య సంగీతం అందించిన చిన్న ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువలు అసలు బాగోలేదు.

అమ్మోరు వంటి చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన కోడి రామ కృష్ణ గారు గ్రాఫిక్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ అయ్యారు. అలాంటి ఒక చిత్రమే అయిన "అవతారం" తో వచ్చారు , ఈ చిత్రం కంటెంట్ పరంగా చాలా బాగున్నా కూడా గ్రాఫిక్స్ మరీ దారుణంగా ఉన్నాయి, ఎప్పుడు చూపించే అదే కథని చివరికి దైవ శక్తి గెలిచిపోతుంది అని తెలిసిపోయే కథని ఎంచుకున్నప్పుడు గ్రాఫిక్స్ మాత్రమే ప్రేక్షకులను కట్టి పడేయగలదు ఈ చిత్రంలో అక్కడే పెద్ద మైనస్ ఎదురయ్యింది ముఖ్యంగా కర్కోటకుడు భూమి మీదకు వచ్చే సన్నివేశంలో గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. అంతే కాకుండా అది కాస్త ఆంగ్ల చిత్రం స్పీసీస్ ని పోలి ఉంటుంది. ఇక దర్శకుడిగా కోడి రామ కృష్ణ కూడా ఫెయిల్ అయ్యారు. మొదటి అర్ధ భాగం అయినా కాస్తో కూస్తో ఆసక్తి కరంగా సాగుతుంది రెండవ అర్ధ భాగం మొదలవగానే ప్రేక్షకుడి పనయిపోతుంది మొదట్లో పది నిమిషాలు చివర్లో ఐదు నిమిషాల చిత్రం తప్ప చెప్పుకోడానికి ఏమీ లేదు. పైగా ఈ చిత్రం ఒక అమ్మోరు ఒక దేవీ ఒక దేవుళ్ళు మిక్సీ లో వేసి బయటకు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది.. ఇక హీరో పాత్రకు సరయిన ముగింపు లేదు ఆ పాత్రా ఎందుకు పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అన్నదానికి ఒక అర్ధం కూడా చెప్పలేదు.. మొత్తానికి గత చిత్రాలతో పోలిస్తే కోడి రామకృష్ణ తీసిన బలహీనమయిన చిత్రం ఇది, కోడి రామ కృష్ణ గారి మీద నమ్మకం ఉంటె ఈ చిత్రాన్ని చూడకండి నమ్మకాన్ని కోల్పోకండి... తరువాత చిత్రం అయినా మంచి విషయం ఉన్న చిత్రంతో వస్తాడేమో అని ఆశిద్దాం..

Bhanu Priya,Radhika,Rishi,Kodi Ramakrishna.చిత్రంలో విషయం లేదు గ్రాఫిక్స్ అసలు బాలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: