లేవు లేవు ఇవి మాత్రమే ఉన్నాయి

స్వతహాగా ధనవంతుడు అయిన చిట్టి(శ్రీ), ముంబైలో నాన్నమ్మ దగ్గర పెరుగుతూ ఉంటాడు. నాన్నమ్మ(అన్నపూర్ణ) చిట్టి ని పెళ్లి చేసుకోమని తొందరపెడుతూ ఉంటుంది. జీవితాన్ని హ్యాపీ గా ఎటువంటి బాదరబందీ లేకుండా బతికేయాలి అన్న వ్యక్తిత్వం చిట్టిది, అలాంటి చిట్టి హైదరాబాద్ పంపిస్తుంది నాన్నమ్మ, హైదరాబాద్ లో సుబాని(అలీ) తో కలిసి ఉంటాడు చిట్టి. అప్పుడే అతనికి పరిచయం అవుతుంది ఆండాళ్(హరి ప్రియ) , ఇదిలా సాగుతుండగా ఒక ఫార్మా కుంభకోణంతో సంభంధం ఉన్న పెద్దిరెడ్డి(సాయి కుమార్) మీద ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీకి జయచంద్ర(బెనర్జీ)ని అధికారిగా నియమిస్తారు. నీతి నియమాలను పాటించే జయచంద్ర ఈ కేసులోనూ అలానే వ్యవహరించడం తో అతని కూతురిని అపహరిస్తారు పెద్దిరెడ్డి మనుషులు. ఈ సంఘటనతో అనారోగ్య పాలవుతాడు జయచంద్ర, ఈ విషయం తెలుసుకున్న ఆండాళ్ , చిట్టితో కలిసి పెద్ది రెడ్డి ఆటలను ఎలా కట్టించారు అన్నదే మిగిలిన కథ...

ఈ సినిమాకి హీరో శ్రీ, మొదటి సినిమా హిట్ వచ్చింది కదా అని దాదాపు అన్ని సినిమాలను అదే జోనర్ లో ఎంచుకోవడంతో ఒక నటుడిగా రోజు రోజుకీ దిగజారి పోతున్నాడని చెప్పాలి. శ్రీని నటనలో అస్సలు ఇంప్రూమెంట్ లేకపోగా ఇంకా దారుణంగా తయారయ్యింది. ఈ సినిమాతోనే శ్రీనిపై ఆడియన్స్ చిరాకు తెచ్చుకుంటారు, మళ్ళీ ఇలాంటి సినిమా తీస్తే నటుడిగా అవకాశాలు కూడా రావడం మానేస్తాయి. ఒక్క చోట కూడా సీన్ తగ్గట్టు సరైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదు, ముఖ్యంగా రీమిక్స్ చేసిన 'నువ్వలా చూస్తుంటే' పాటలో ఇచ్చిన హావ భావాలు ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తాయి. ఇక పోతే హీరోయిన్ హరిప్రియ. ఈమెను సినిమాకి తీసుకునేటప్పుడే చెప్పారేమో మిమ్మల్ని గ్లామర్ కి తప్ప మరో దానికి వాడుకోము అని. అనుకున్నట్టుగానే హీరోయిన్ కూడా అందాల ఆరబోత తప్ప ఇంకేమీ చెయ్యలేదు. సోలో సాంగ్ అయినా, హీరోతో డ్యూయెట్ అయినా, పబ్ సాంగ్ అయినా, ఐటెం సాంగ్ అయినా అన్ని పాటల్లోనూ ఒక్క హరిప్రియనే కనిపించి విచ్చల విడిగా అందాలు ఆరబోసింది. సాయి కుమార్ ని అస్సలు వాడుకోలేదు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి ఆయన్ని ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. నాగబాబు, అలీ, వేణు లాంటి వారిని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయారు.

సాంకేతిక అంశాలు అనగానే ముందు వరుసలో ఉండేవి కథ కథనం మాటలు దర్శకత్వం , కృష్ణ ఈ అన్ని విభాగాల్లో సున్నా సాదించి రికార్డు సృష్టించాడు. కథ అనేది చిత్రంలో కనబడదు. కథనం లో పట్టు ఉండదు , డైలాగ్స్ లో అర్ధం ఉండదు. దర్శకత్వంలో నిబద్దత ఉండదు. సినిమాటోగ్రఫీ పరవాలేదు. ఎడిటింగ్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది, మాటలు బొత్తిగా ఆకట్టుకోలేకపోయింది నిర్మాణ విలువలు కూడా అలానే ఉన్నాయి.

చిన్న చిత్రాలను ఆదరించట్లేదు అని అంటారు కాని చిన్న చిత్రాల నాణ్యత ఎలా ఉంది అనేది అందరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు విడుదల అయిన గలాటా అనే చిత్రం వినోదం ప్రధానాంశం గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది అని చిత్రానికి సంభందించిన వ్యక్తులు అన్నారు కాని చిత్రంలో వినోదం కాదు కదా విషయం కూడా లేదు. అసలు చిత్రం మొదలయినప్పటి నుండి ఎప్పుడు కూడా చిత్రం ఒక గమ్యం వైపు నడువదు. అంతే కాకుండా కథకు సంభంధం లేకుండా చాలా అంటే దాదాపు అన్ని సన్నివేశాలు చిత్రానికి సంభంధం లేనివే. అసలు హీరో కి ఒక గమ్యం ఉండాలి లేదా ఎవరి గమ్యాన్ని అయిన హీరో కి కలపాలి కాని ఈ చిత్రం లో కథ కాకరకాయ అంటూ ఎం ఉండదు హీరో తెలివైనవాడు కాబట్టి హీరో తెలివైన వాడిలా నటిస్తూ ఉంటాడు, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటో తనకే తెలియదు ఎం నటించాలో తెలియక ఏది అనిపిస్తే అది నటించేసి చుపించేసింది. బెనర్జీ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి నో డైలాగ్స్ , సాయి కుమార్ చేత ఏ సన్నివేశం అయినా ఒకటే హవాభావం మైంటైన్ చేయించారు. ఎక్కడో ఒక సన్నివేశం దగ్గర ఇంటర్వల్ వెయ్యాలి కాబట్టి ఒక సంభంధం లేని పాట అయిపోగానే ఇంటర్వెల్ , ఎక్కడో ఒక చోట చిత్రాన్ని ముగించాలి కాబట్టి ఐటెం సాంగ్ అవ్వగానే శుభం కార్డు పడిపోద్ది.. ఇంకా లాజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఒక కేబినేట్ మినిస్టర్ ని ఒక సి ఐ అరెస్ట్ చెయ్యడం ఏంటో ఎంతకీ అర్ధం కాని విషయం. మొత్తానికి శ్రీ ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది కొన్ని సన్నివేశాలలో తన నటన తెలిపాయింది. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అన్నట్టు.. ఇలాంటి చిత్రాలు చూడటం ప్రేక్షకుడికి చెయ్యడం తెలుగు పరిశ్రమకి హానికరం అని బోర్డు పెట్టేయాలి... ఎలాగు ఈ చిత్రాన్ని చూడాలన్న ఆలోచన కూడా ఎవరికీ ఉండదు అలా ఎవరయినా చూడాలి అనుకుంటే "ఆత్మ హత్య మహా నేరం" ..

Sri,Hari Priya,Naga Babu,Krishna,Rajendra Prasad Varma,Sunil Kashyap.గలాటా : ఇది ప్రేక్షకుల జీవితాలతో ఆట

మరింత సమాచారం తెలుసుకోండి: