శాన్వి, సప్తగిరి సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ మరియు సంగీతం.శాన్వి, సప్తగిరి సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ మరియు సంగీతం. సాగదీసిన స్క్రీన్ ప్లే, నెమ్మదిగా సాగే కథనం, ఆది మరియు శాన్వి మధ్య కెమిస్ట్రీ, రొటీన్ కథ

సంతోషంగా జీవితాన్ని సాగించే చంద్ర(ఆది) మొదటి చూపులోనే యుక్త(శాన్వి) తో ప్రేమలో పడుతాడు. చంద్ర కి ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంటుంది , క్రేజీ అనే ఈ బ్యాండ్ లో పాడటానికి యుక్త ని ఆహ్వానిస్తాడు చంద్ర. ఆ సమయంలోనే వీరిద్దరి జీవితాలలోకి వస్తాడు బాబీ (వెన్నెల కిషోర్) , ఒక రికార్డింగ్ కంపెనీ ఓనర్ అయిన బాబీ వీరితో ఆల్బం రికార్డింగ్ కి ఎందుకు ఒప్పుకున్నాడో తెలిసిన క్షణం వారి జీవితాలలో మార్పులు సంభవిస్తాయి. ఇదిలా సాగుతుండగా యుక్త తన తండ్రి సహాయంతో ఆదిత్య మ్యూజిక్ లో పాడే అవకాశం దక్కించుకుంటుంది. అదే సమయంలో యుక్త కి తన చిన్ననాటి శత్రువు అయిన చిన్నా గురించి తెలుస్తుంది. అసలు ఈ చిన్న ఎవరు? చిన్నకి మరియు యుక్తకి మధ్య అసలు గొడవేంటి? చంద్ర , యుక్త కలుస్తారా లేదా? అన్నది మిగిలిన కథ ...

చంద్ర పాత్రలో ఆది చాలా బాగా నటించారు అతని డైలాగ్ డెలివరీ కాని మరియు బాడీ లాంగ్వేజ్ కాని చాలా బాగుంది కాని అతను స్టైలింగ్ మీద దృష్టి సారించాల్సి ఉంది. శాన్విశ్రీవాస్తవ చూడటానికి చాలా బాగుంది ఆమె అమయకత్వం ఈ పాత్రకి కావలసిన ఇంపాక్ట్ సృష్టించింది. ఈ జంట మధ్య కెమిస్ట్రీ బొత్తిగా కుదరలేదు వీరి గత చిత్రం "లవ్లీ"తో పోలిస్తే ఈ చిత్రంలో ఇది లోపించింది అనే చెప్పాలి. సప్తగిరి కొన్ని సన్నివేశాలలో మాత్రమే నవ్వించగలిగాడు కాని మిగిలిన అన్ని సన్నివేశాలు బలవంతంగా జొప్పించిన కామెడీ సన్నివేశాలే, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్ నవ్విన్చాలేకపోయారు. విష్ణు ప్రియ పరవాలేదనిపించింది, కాశీ విశ్వనాధ్ పాత్రను వృధా చేసారు...

"ప్యార్ మే పడిపోయానే" చిత్రం కథ కొత్తగా ఏమీ లేదు, ఇలాంటి కథలను అషికి చిత్రం నుండి చూస్తున్నదే. దర్శకత్వం విషయంలో రవి చావలి చాలా జాగ్రత్త తీసుకోవలసింది. కథనం మొదటి అర్ధభాగంలో అంతంతమాత్రంగా ఉండే చిత్రం రెండవ అర్ధ భాగంలో మరో మెట్టు కిందకి దిగుతుంది. మాటలు కూడా చాలా బాగుంది. ఎడిటర్ కేవీ కృష్ణ రెడ్డి మరికొంత నిర్దయగా సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది. ఈ చిత్రంలో మరొక 20 నిమిషాల చిత్రం కత్తిరించినా చిత్రానికి జరిగే నష్టం ఏమి లేదు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం లో రెండు పాటలు బాగున్నాయి కాని నేపధ్య సంగీతం రొమాంటిక్ చిత్రానికి చాలా ఎక్కువ.. టి సురేందర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ పరవాలేదు. శ్రీ సత్య సాయి క్రియేషన్స్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

సందేశాత్మక చిత్రాలతో బాగా ఫేమస్ అయిన రవి చావలి ఈసారి ఒక రొమాంటిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి అర్ధ భాగం అంతంతమాత్రంగా ఉన్నా బాగా నెమ్మదించిన రెండవ అర్ధ భాగం ప్రేక్షకులను చిరాకు పెడుతుంది ఈ చిత్రంలో ఒక్క సన్నివేశం కూడా కొత్తగా అనిపించదు. పటిష్టమయిన కథనం ఉంది ఉంటె ఈ చిత్ర ఫలితం మరోలా ఉండేది. శాన్వి నటన, సంగీతం మరియు సినిమాటోగ్రఫీతో ఆకట్టుకున్నా చిత్రం బాగుండాలంటే ఇవి మాత్రం సరిపోవుగా మంచి కథ దానికి తగ్గ కథనం కూడా ఉండాలి ఈ చిత్రంలో మిస్ అయ్యింది ఇదే. రొమాంటిక్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం బొత్తిగా నచ్చకపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వీకెండ్ మీకు చెయ్యడానికి ఎటువంటి పని లేకపోతే థియేటర్ కి వెళ్ళండి ...

Aadhi,Shanvi,Ravi C Kumar,KK Radha Mohan,Anup Rupens.ప్యార్ మే పడిపోయానే - ప్రేక్షకుడు థియేటర్లో దొరికిపోయేనే!!

మరింత సమాచారం తెలుసుకోండి: