Damarukum Tweet Review || Damarukum Full English Review   హీరో నాగార్జున నటించిన తాజా సినిమా డమరుకం. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ డమరుకం సినిమా నాగార్జున కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. వరసగా విజయాలు సాధిస్తున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించడం, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ డమరుకం పాటలు ఆదరణ పొందడం వంటి కారణాలతో డమరుకం సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే పలు మార్లు విడుదల వాయిదా పడ్డం, సినిమా ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడం వంటి అంశాలతో ఈ సినిమా వార్తల్లో ఎక్కువ చోటు దక్కించుకుంది. అనేక వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!   చిత్రకథ :   దేవతల-దానవుల యుద్ధంలో  రాక్షస జాతి అంతమైపోయినా అంధకాసురుడు (రవిశంకర్) అనే ఒక్క రాక్షసుడు ప్రాణాలతో మిగులుతాడు. అతని అనుచరుడు మాయావి (జీవా)తో కలసి దేవతల మీద పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. కొన్ని వేల సంవత్సరముల తరువాత పంచ గ్రహాలు ఒకే కక్ష్యలోకి వచ్చిన శుభసమయంలో భూమ్మీద మహేశ్వరి(అనుష్క) జన్మిస్తుంది. అ ఆమ్మాయి వివాహం చేసుకుని, ఆమెను బలి ఇస్తే స్వర్గం మీద అధిపత్యం లభిస్తుందని అంధకాసురుడు తెలుసుకుంటాడు. దీంతో అమ్మాయి తో వివాహం కోసం శివుని గురించి తపస్సు చేసి తన సంకల్పానికి అడ్డురాకుండా ఉండమని వరం కోరుతాడు. అలాగే, మల్లికార్జున్ (నాగార్జున) చిన్నతనం నుంచి శివ భక్తుడు. అయితే 12 సంవత్సరాల వయస్సులో తన కుటుంబంతో కాశీ వెళ్లిన మల్లికార్జున్  తిరుగు ప్రయాణంలో ప్రమాదంలో తన కుటుంబసభ్యులను పొగట్టుకుంటాడు. చెల్లి అవిటిదానిగా మిగులుతుంది. దీంతో శివుడు అంటే ద్వేషం పెంచుకుంటాడు.        మల్లికార్జున్  మళ్ళీ శివ భక్తుడిగా ఏవిధంగా మారాడు. మల్లిని దక్కించుకోవడానికి అంధకాసురుడు ఏ విధంగా ప్రయత్నించాడు, అంధకాసురుడు మహేశ్వరిని వివాహం చేసుకోకుండా  మల్లికార్జున్  ఏ విధంగా అడ్డుకున్నాడు అనేది చిత్రకథ. నటీనటుల ప్రతిభ :   నాగార్జునకు ఇలాంటి పాత్రలు కొత్త కాదు. చెల్లి తో సెంటిమెంట్ సీన్ లో నటించి మెప్పించడం, కామెడీ గ్యాంగ్ తో కలసి హాస్యం పుట్టించడం, విలన్ ను ఎదుర్కొవడం వంటి సన్నివేశాలలోనే కాకుండా అఘోరాలతో సన్నివేశంలో అఘోరా గా కనిపించడం లాంటి సన్నివేశాలోనూ ఆకట్టుకుంటాడు. అంధకాసురుడుగా రవిశంకర్ నటన బావుంది. అతని గాత్రం కూడా ఆ పాత్రకు సరిపోయింది. మహేశ్వరి పాత్రకు అనుష్క సూటయ్యింది. హుందాగాను, అందంగాను అనుష్క కనిపించింది. శివుడి పాత్రలో ప్రకాష్ రాజ్ నటన అంతగా ఆకట్టకునే విధంగా లేదు. శివుడి పాత్ర పోషణకు ప్రకాష్ రాజ్ మరింతగా కష్టపడి ఉంటే బావుండేది. మిగిలిన వారు తమ తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ బాగుంది. దేవీశ్రీ ప్రసాద్ పాటలు, వాటి చిత్రీకరణ బాగుంది. ఈ సినిమాకు గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమా ప్రారంభంలో సన్నివేశాలు, లోయలో పడబోతున్న కారును నంది ఆపడం వంటి గ్రాఫిక్స్ సన్నివేశాలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న చిత్రాలు తీసిన శ్రీనివాసరెడ్డికి ఈ ఢమరుకంతో భారీ సినిమా తీసే అవకాశం దక్కింది. నాగార్జున వంటి పెద్ద హీరోతో చాన్సు వచ్చింది. అంధకాసురుడు చుట్టూ సాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై మరికొంత దృష్టి పెట్టి ఉంటే బావుండేది. శివుడు భూలోకంలోని దృశ్యాలను, సినిమా మగింపు దృశ్యాలను మరింత బాగా తెరకెక్కించే అవకాశం ఉంది. హైలెట్స్ :   నాగార్జున, రవిశంకర్ నటన, అనుష్క గ్లామర్, గ్రాఫిక్స్, పాటలు డ్రాబ్యాక్స్ :   కొత్తగా లేని కథ, కథనం, బలహీనమైన ముగింపు   చివరగా :   హిట్ అవ్వాలంటే శివుడి ఆఙ్ఞ రావాలి.    More Articles on Damarukum || Damarukum Photos & Wallpapers || Damarukum Videos  

మరింత సమాచారం తెలుసుకోండి: